అన్వేషించండి

Lucky Lakshman Review - 'లక్కీ లక్ష్మణ్' రివ్యూ : 'బిగ్ బాస్' సోహైల్ సినిమా ఎలా ఉందంటే?

Syed Sohel's Lucky Lakshman Review : 'బిగ్ బాస్' సోహైల్ హీరోగా నటించిన తాజా సినిమా 'లక్కీ లక్ష్మణ్'. ఈ రోజు విడుదలైంది. ఇది ఎలా ఉందంటే?

సినిమా రివ్యూ : లక్కీ లక్ష్మణ్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష‌, దేవీ ప్ర‌సాద్‌, రాజా ర‌వీంద్ర‌, స‌మీర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌ త‌దిత‌రులు
పాటలు : భాస్కరభట్ల 
ఛాయాగ్రహణం : ఐ ఆండ్రూ 
సంగీతం : అనూప్ రూబెన్స్ 
నిర్మాత : హరిత గోగినేని 
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎ.ఆర్‌.అభి 
విడుదల తేదీ: డిసెంబర్ 30, 2022

కొత్త ఏడాది 2023కి వెల్కమ్ చెబుతూ... 2022కు వీడ్కోలు పలుకుతున్న తెలుగు సినిమాల్లో 'లక్కీ లక్ష్మణ్' (Lucky Lakshman Movie) ఒకటి. 'బిగ్ బాస్' సోహైల్ (Bigg Boss Sohel) హీరోగా నటించారు. హరిత గోగినేని నిర్మించారు. సినిమాపై నమ్మకంతో సొంతంగా విడుదల చేస్తున్నారు. థియేటర్లలో విడుదలైన ఈ ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Lucky Lakshman Movie Story) : లక్ష్మణ్ (సయ్యద్ సోహైల్) మిడిల్ క్లాస్ కుర్రాడు. చిన్నతనం నుంచి ఏది అడిగినా... తండ్రి డబ్బులు లేవని చెబుతూ ఉంటాడు. దాంతో తనకు పెళ్లై, పిల్లలు పుట్టాక అలా ఉండకూడదంటే చదువుకుని సెటిల్ అవ్వాలనుకుంటాడు. అందుకని, అమ్మాయిలకు దూరంగా... చదువుకు దగ్గరగా ఉంటాడు. అయితే... బీటెక్ కాలేజీలో అతడికి శ్రేయ (మోక్ష) పరిచయమవుతుంది. ఆమెకు బాగా డబ్బులు ఉన్నా.. ఎక్కడా పొగరు చూపించదు. పైగా, లక్ష్మణ్ అంటే ప్రేమ. అతడికి కావలసినవి అన్నీ ఇస్తుంది. అప్పుడు తల్లిదండ్రులను వదిలేసి వచ్చేస్తాడు. ప్రేమలో కొన్నాళ్ళు బానే ఉంటుంది. ఒక విషయంలో శ్రేయ హార్ట్ అయ్యి బ్రేకప్ చెబుతుంది. కోపంలో బాగా డబ్బులు సంపాదించాలని లక్కీ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేస్తాడు. నాలుగేళ్లలో బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఒక రోజు శ్రేయని ఒక స్టోరులో మేనేజరుగా చూసి షాక్ అవుతాడు. అసలు... లక్ష్మణ్, శ్రేయ ఎందుకు బ్రేకప్ అయ్యారు? డబ్బులున్న శ్రేయ స్టోరులో మేనేజరుగా ఎందుకు ఉద్యోగం చేస్తుంది? శ్రేయ, తల్లిదండ్రుల వేల్యూ లక్ష్మణ్ ఎప్పుడు తెలుసుకున్నాడు? అతడి తప్పును వాళ్ళు క్షమించారా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ : దురదృష్టవంతుడు అని ఫీల్ అయ్యే ఓ కుర్రాడు, డబ్బే ప్రధానం అని భావించే యువకుడు జీవితంలో ఏది ముఖ్యం అనేది ఎలా తెలుసుకున్నాడు? అనేది 'లక్కీ లక్ష్మణ్' కథ. క్లుప్తంగా చెప్పాలంటే ఇంతే! డబ్బు కంటే ప్రేమ ముఖ్యం అని, తల్లిదండ్రులను మించిన ఆస్తి లేదని సందేశం ఇస్తుంది. 

'లక్కీ లక్ష్మణ్' ద్వారా దర్శక నిర్మాతలు చెప్పాలనుకున్న సందేశం బావుంది. వాళ్ళ ఆలోచనను మెచ్చుకోవాలి. అయితే... కాలేజీ నేపథ్యంలో సినిమా స్టార్ట్ చేయడం వల్ల స్టార్టింగ్ రెగ్యులర్ అనిపిస్తుంది. ర్యాగింగ్, అబ్బాయికి అమ్మాయి గిఫ్టులు ఇవ్వడం వంటివి చూసిన సన్నివేశాలే. కొన్ని చోట్ల లాజిక్స్ లేవు. మరీ రొటీన్ గా తీశారు. కానీ, మధ్యలో కొన్ని సీన్స్ బావుంటాయి. ఐలవ్యూ చెబితే అమ్మాయి కోప్పడకుండా ఓకే అనడం కొంచెం కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత అప్పటి వరకు జరిగిన కథ, ఆ తర్వాత కథకు సంబంధం లేదన్నట్టు ఉంటుంది. పతాక సన్నివేశాలకు ముందు ఒక్కో సన్నివేశాన్ని కనెక్ట్ చేస్తూ దర్శకుడు సినిమాను ముగించారు. పతాక సన్నివేశాలకు ఓ అరగంట ముందు నుంచి కథలో లీనం చేసేలా తీశారు. 

అనూప్ రూబెన్స్ పాటలు సినిమాకు ప్లస్ అని చెప్పాలి. 'ఓ మేరీ జాన్', రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'కాలేజ్ గాళ్స్...' సాంగ్స్ పెప్పీగా ఉన్నాయి. మిగతా పాటలు కూడా పర్వాలేదు. సన్నివేశాలకు తగ్గట్టు చక్కటి నేపథ్య సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ బావుంది. పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఐ ఆండ్రూ విజువల్స్ ఉన్నాయి. కాలేజీ, మ్యారేజ్ బ్యూరో పేర్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద గ్రాఫిక్స్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాత హరిత గోగినేని ఖర్చుకు వెనుకాడలేదు. అవుట్ డోర్ షూటింగ్ ఎక్కువ జరిగింది. అయినా బాగా తీశారు. 

నటీనటులు ఎలా చేశారంటే? : సోహైల్ తన వయసుకు తగ్గ పాత్ర చేశాడు. అతడి స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. క్యారెక్టర్‌కు తగ్గట్టు నటించారు. హీరోయిన్ మోక్ష కొన్ని సన్నివేశాల్లో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. సినిమా ప్రారంభమైనప్పుడు ఆమె క్యారెక్టర్ సాధారణంగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత డెప్త్ ఉంటుంది. కాదంబరి కిరణ్ కనిపించేది రెండు మూడు సన్నివేశాలే. హీరోతో సన్నివేశంలో ఆయన నటన బావుంది. ముఖ్యంగా ఆ డైలాగులకు క్లాప్స్ పడతాయి. దేవి ప్రసాద్, సమీర్, రాజా రవీంద్ర తదితరులవి రెగ్యులర్ క్యారెక్టర్లే. టీవీల్లో వచ్చే కామెడీ షోలతో పేరు తెచ్చుకున్న కార్తీక్, యాదమ్మ రాజు అంతగా నవ్వించలేదు. 

Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే? : రెగ్యులర్ సినిమాగా మొదలై... పతాక సన్నివేశాల్లో యువతకు మంచి సందేశం ఇచ్చే సినిమా 'లక్కీ లక్ష్మణ్'. క్లైమాక్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంది. సోహైల్ న్యూ ఏజ్ యూత్ బాయ్ రోల్ బాగా చేశాడు. పాటలు బావున్నాయి. ఫస్టాఫ్ రొటీన్ అనిపిస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే... వీకెండ్ ఓ లుక్ వేయవచ్చు.
 
Also Read : 'బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్' రివ్యూ : నెట్‌ఫ్లిక్స్‌లో బెంగళూరు కామపిశాచి ఉమేష్ రెడ్డి డాక్యుమెంటరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget