హాలీవుడ్ ట్రైలర్... 'అన్ ఛార్టెడ్': కుర్రకుంకా... పెద్దవాళ్లతో ఆటలా?
గేమ్స్, ట్రెజర్ హంట్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని రూపొందుతున్న హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ బావుంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా రాబోతోంది.
![హాలీవుడ్ ట్రైలర్... 'అన్ ఛార్టెడ్': కుర్రకుంకా... పెద్దవాళ్లతో ఆటలా? Uncharted movie trailer plays Nathan Drake's greatest hits హాలీవుడ్ ట్రైలర్... 'అన్ ఛార్టెడ్': కుర్రకుంకా... పెద్దవాళ్లతో ఆటలా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/22/6187a97857d9b6278eac3d54024205c9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాపులర్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ గేమ్ ‘అన్ ఛార్టెడ్’బేస్ చేసుకుని, అదే పేరుతో ఓ హాలీవుడ్ సినిమా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ గేమ్ కు అభిమానులు ఉండటంతో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. బజ్ అయితే వచ్చింది కానీ... అనుకున్న విధంగా సినిమా పట్టాలు ఎక్కలేదు. తొలుత పలువురు దర్శకులు, హీరోల పేర్లు విపించాయి. చివరకు, సినిమా సెట్స్ మీదకు వెళ్లేసరికి వాళ్లెవరూ సినిమాలో లేరు. నాథన్ డార్క్ పాత్రలో టామ్ హోలాండ్, అతని మెంటార్ గా మార్క్ వాబర్గ్ ఫైనల్ అయ్యారు. ఇప్పుడీ సినిమా ట్రైలర్ విడుదలైంది.
Also Read: పవన్ బ్రేక్ తీసుకోవడం పక్కా.. మరి ఒప్పుకున్న సినిమాల సంగతేంటో..?
‘అన్ ఛార్టెడ్’ గేమ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు... గేమ్ గురించి తెలియని ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా సినిమా తీశామని యూనిట్ చెబుతోంది. ఇంగ్లిష్ సహా భారతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళంలో సినిమాను విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 18న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ లో ‘అన్ ఛార్టెడ్’ గేమ్ సిరీస్ లో రిఫరెన్స్ లు చాలా ఉన్నాయి. పైరేట్ షిప్ నుంచి కార్గో విమానం నుంచి కిందపడిపోయే సన్నివేశాలు గేమ్ ను గుర్తుకు తీసుకొస్తాయి. మ్యూజిక్ పరంగా కూడా గేమ్ లో ప్లేయర్స్ ను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. దాంతో ‘అన్ ఛార్టెడ్’ అభిమానులకు సినిమా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇక, ట్రైలర్ లో విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. గేమ్ గురించి తెలియని వాళ్లనూ ఆకట్టుకునేలా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారు.
తెలుగు ట్రైలర్ లో ‘చూస్తుంటే కుర్రకుంకలా ఉన్నావ్. బార్ టెండర్ ఎలా అయ్యావ్?’, ‘ఇక్కడికి వచ్చి మాలాంటి పెద్దవాళ్లతో ఆటలు ఆడితే... నీకు అసలైన స్కాటిష్ వెల్ కమ్ తప్పకుండా దొరుకుతుంది’ వంటి డైలాగులు ఉన్నాయి. మొత్తం మీద యాక్షన్ అండ్ అడ్వెంచరస్ హాలీవుడ్ సినిమాలను అభిమానించే ప్రేక్షకులకు ఈ సినిమా కిక్ ఇచ్చేలా ఉంది. ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Fortune favors the bold. Watch the official trailer for #UnchartedMovie, starring Tom Holland and Mark Wahlberg, exclusively in movie theaters February 18. pic.twitter.com/23PvjtINpn
— Uncharted (@unchartedmovie) October 21, 2021
Also Read: 'నాట్యం' సమీక్ష: నృత్యం బావుంది! కానీ..
Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
Also Read: అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)