అన్వేషించండి

Pawan Kalyan: పవన్ బ్రేక్ తీసుకోవడం పక్కా.. మరి ఒప్పుకున్న సినిమాల సంగతేంటో..?

పవన్ కొత్తగా సినిమాలు ఒప్పుకునే అవకాశం లేదని సమాచారం. భగవాన్, పుల్లారావులతో పాటు కొందరు పవన్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పవన్ మాత్రం ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా..?  

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. 2018 జనవరిలో విడుదలైన 'అజ్ఞాతవాసి' సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రత్యక్షంగా పోటీకి దిగారు. ఆ సమయంలో తను సినిమాలకు పూర్తిగా దూరమైనట్లే అని.. మళ్లీ సినిమాలు చేయనని ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేయాలని గట్టిగా కోరుకున్నారు. ఆ తరువాత రెండేళ్లకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలని అనుకున్నారు. 

Also Read: 'నాట్యం' సమీక్ష: నృత్యం బావుంది! కానీ..

'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా తన పార్టీ బలంగా ఉండాలంటే.. సినిమాలు చేయక తప్పదని, అలానే అభిమానులతో కనెక్ట్ అయి ఉండడానికి కూడా సినిమాలు ఓ మార్గమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. రీఎంట్రీలో పవన్ వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు' లాంటి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటి తరువాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయాల్సివుంది. 

అయితే వీటి తరువాత పవన్ కళ్యాణ్ కొత్తగా సినిమాలు ఒప్పుకునే అవకాశం లేదని సమాచారం. భగవాన్, పుల్లారావులతో పాటు కొందరు నిర్మాతలు పవన్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పవన్ మాత్రం ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి మరో ఏడాదికి పైగా సమయం పట్టేలా ఉంది. ఇంకా సినిమాలు ఒప్పుకుంటే 2024 ఎన్నికలు రెడీ కావడం కష్టమవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. 

హరీష్ శంకర్ సినిమా పూర్తి చేసిన తరువాత సురేందర్ రెడ్డి సినిమాను హోల్డ్ లో పెట్టే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ తన మకాంను విజయవాడకు మార్చబోతున్నాడని.. పార్టీ పనులకు మరింత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి షూటింగ్స్ కోసం హైదరాబాద్ కు వచ్చి వెళ్తుంటాడని.. అవుట్ డోర్ షూటింగ్స్ ఉంటే విజయవాడలో చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారట. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి 2023 స్టార్టింగ్ లోనే బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారు.  

Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్

Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?

Also Read:  అఘోరాగా యువ హీరో...‘గామి’టీమ్‌కు బన్నీ ప్రశంసలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

 

టాప్ హెడ్ లైన్స్

Varanasi: మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
మహేష్ బాబు అందుకే లుక్ తీయలేదు... 'వారణాసి'లో అదొక్కటీ బాకీ
Pooja Hegde: ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
King Release Date: డిసెంబర్ నెలాఖరున 'కింగ్' రిలీజ్... తగ్గేదే లేదంటున్న షారుఖ్ ఖాన్
డిసెంబర్ నెలాఖరున 'కింగ్' రిలీజ్... తగ్గేదే లేదంటున్న షారుఖ్ ఖాన్
Sai Pallavi: నిత్యా రెడ్డిగా సాయి పల్లవి... 'ఓం'లో పవర్ ఫుల్ పోలీసుగా
నిత్యా రెడ్డిగా సాయి పల్లవి... 'ఓం'లో పవర్ ఫుల్ పోలీసుగా

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Wrong e-Challan: ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్‌ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
పొరపాటున మీకు ట్రాఫిక్‌ చలాన్ వచ్చిందా? కంగారు వద్దు.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి!
Embed widget