Trinayani Serial Today October 29th: 'త్రినయని' సీరియల్: బొమ్మలో బాంబ్ తల్లీబిడ్డని చంపనున్న తిలోత్తమ.. షాకింగ్ విషయాలు చెప్పిన అహల్య!
Trinayani Today Episode నయని తొలిబిడ్డ పునర్జన్మలోని గాయత్రీ దేవిని పసిబిడ్డగా చూడటానికి అందరూ గుడి దగ్గరకు వెళ్లడం తిలోత్తమ బొమ్మలో బాంబ్ పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Trinayani Serial Today October 29th: 'త్రినయని' సీరియల్: బొమ్మలో బాంబ్ తల్లీబిడ్డని చంపనున్న తిలోత్తమ.. షాకింగ్ విషయాలు చెప్పిన అహల్య! trinayani serial today october 29th episode written update in telugu Trinayani Serial Today October 29th: 'త్రినయని' సీరియల్: బొమ్మలో బాంబ్ తల్లీబిడ్డని చంపనున్న తిలోత్తమ.. షాకింగ్ విషయాలు చెప్పిన అహల్య!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/29/e9c6afeb3657e790531a278c189e742e1730163850283882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trinayani Serial Today Episode విశాల్ బొమ్మ పట్టుకొని కూర్చొని ఉంటే నయని వస్తుంది. కన్న బిడ్డను కలుసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తుంది. మన పెద్ద కూతురు ఎలా ఉంటుందని అడుగుతుంది విశాల్‌ని. ఏం చెప్పను నయని చెప్తే పాప కనిపించకపోతే నువ్వు బాధ పడతావాని అంటాడు. చాలా సార్లు ఆశపడి నిరాశ పడ్డామని విశాల్ అంటాడు.
నయని: ఎవరో చెప్పడం వేరు అమ్మగారు చెప్పడం వేరు. బిడ్డను కన్న రెండేళ్ల తర్వాత చూడబోతున్నాం. నాన్న అని మిమల్ని ముందు పిలుస్తుందో అమ్మ అని నన్ను పిలుస్తుందో చూడాలి.
విశాల్: మాటలు రావడం లేదు.
నయని: మీకు తెలుసా. మన పాపని చూడలేదు కదా.
విశాల్: అంటే నువ్వు చెప్తుంటే ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు అంటున్నా.
సుమన: ఏదైనా ప్లాన్ చేస్తున్నారా బుల్లి బావగారు.
విక్రాంత్: నీకు అనుమానం తప్పు ఆలోచన రాదు అనుకుంటా.
సుమన: గాయత్రీ అత్తయ్య గారు బొమ్మ ఎందుకు తీసుకొచ్చారు.
విక్రాంత్: రేపు నయని వదిన పెద్ద కూతురికి ఇవ్వడానికి. ఆ బొమ్మ లాస్ట్ భర్త్‌డేకి నేను రాలేను అని చెప్పి జోగయ్య శాస్త్రిగారు పంపారు కదా.
సుమన: అదే ఇదా అయన పంపిన బొమ్మ తెచ్చి మా అక్కకి ఇవ్వడం ఏంటి
విక్రాంత్: వాళ్ల మనవరాలికి ఆయన బొమ్మ ఇస్తే అది పెద్దమ్మ తెచ్చారు అందులో ఏముంది.
సుమన: ఆ బొమ్మనే ఎందుకు ఇవ్వాలి అంటే సరిగా చెప్పరేంటి ఈయన.
తిలోత్తమ: రేపు కచ్చితంగా గాయత్రీ అక్క గుడికి వస్తుంది వల్లభ. మనం అక్కని పసి బిడ్డగా చూస్తాం కానీ తను మాత్రం మన అంతు చూడాలని అనుకుంటుంది. తన టార్గెట్ అదే కదరా.
వల్లభ: నిన్ను పెద్దమ్మ చంపేయాలి అనుకుంటే ఎప్పుడో చంపేసేది కదా మమ్మీ కానీ పెనం మీద రోస్ట్ చేసినట్లు చేస్తుంది.
తిలోత్తమ: కొట్టడం వల్లే నాలో ఇంకా కసి పెరిగిందిరా. రేపు వన్ ప్లస్ ఆఫర్‌లా నయనికి తన కన్న కూతురుకి ఇద్దరికీ గండం అని తెలిసే లోపు లేపేయాలి. గాయత్రీ అక్క ఇచ్చిన బొమ్మ ఉంది కదా అందరూ పడుకున్న తర్వాత ఆ బొమ్మ నేను తీసుకొచ్చి అందులో స్పెషలిస్ట్ చేత బాంబ్ పెట్టించి తిరిగి నయని గదిలో పెడతా.
వల్లభ: బాంబా మమ్మీ నవ్వేం చేస్తున్నావో తెలుస్తుందా
తిలోత్తమ: నువ్వేం చేయాలో చెప్తా విను. రేపు గుడి దగ్గర నయని తన కన్న కూతురు కలిశాక నీ జేబులో పెట్టుకున్న రిమోట్ నొక్కే అంతే తల్లీ కూతుళ్లు ప్రాణం పోతుంది.
ఉదయం అందరూ పరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గర అహల్య ఉంటుంది. విశాల్, హాసిని గాయత్రీ పాపని తీసుకొని వస్తుంది. గాయత్రీ పాప చేతిలో బొమ్మ పట్టుకొని ఉంటుంది. పసి బిడ్డగా ఉన్న తన తల్లి గురించి చెప్పమని అడుగుతాడు విశాల్. ఇక మరోవైపు మిగతా అందరూ ఓ కారులో వస్తుంటారు. విశాల్, హాసిని ముందు ఎందుకు వెళ్లారని అడుగుతారు. ఇక అహల్య విశాల్‌తో పసిబిడ్డగా గాయత్రీ అక్క వస్తుందని అంటుంది. దాంతో హాసిని, విశాల్‌లు గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని అహల్యకు తెలీదని ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో తిలోత్తమ వాళ్లు వచ్చేస్తారు. తిలోత్తమ వల్లభతో అస్తమానం బొమ్మ గురించి మాట్లాడొద్దని అంటుంది. అందరూ అమ్మవారి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటారు. నయని తన కన్న బిడ్డ కనిపిస్తుందేమో అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. అహల్య నయనితో పాపగా ఉన్న గాయత్రీ అక్కని ఎవరూ తీసుకురారు నయని అని చెప్తుంది. నయని కళ్లలో నీళ్లు తిప్పుకుంటుంది.
విక్రాంత్: పిన్ని పాపని ఎవరూ తీసుకురాకపోతే ఎలా వస్తుంది.
అహల్య: విక్రాంత్ అసలు విషయం ఏంటి అంటే నయని కన్న తొలి బిడ్డను అమ్మవారే ఇక్కడికి తీసుకొస్తుంది. ఆ బిడ్డకు గండం అని చెప్పారు కదా.
విశాల్: పిన్ని ఇప్పుడేం చేస్తే మా అమ్మ పసి బిడ్డగా ఇక్కడికి వస్తుంది.
హాసిని: గండం రావాలి కదా అప్పుడే వస్తుందేమో.
అహల్య: వచ్చింది.
విక్రాంత్: పాపనా గండమా.
అహల్య: రెండింటిలో ఏ ఒక్కటి వచ్చానా ఇంకోటి జతగా వస్తుందని నువ్వు కన్న కూతురి గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పారు నయని.
వల్లభ: మనకంటే ముందు పాప ఎవరికో తెలుసు.
విక్రాంత్: ఇంట్రస్టింగ్ నయని వదిన బాధ పడుతుందని తెలిసి కూడా దాచారు. విశాల్, హాసిని టెన్షన్ పడతారు.
అహల్య: గాయత్రీ అక్క పసి పాపలా ఎలా ఉందో ఇంట్లో వాళ్లకి తెలుసని ఓ పుణ్యాత్ముడు చెప్పారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)