అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 26th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ కళ్లెదురుగానే విహారి, సహస్రల నిశ్చితార్థం.. విహారి దక్కించుకోమని లక్ష్మీతో చెప్పిన పండు!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనక మహాలక్ష్మీ తన ఇంట్లోనే ఇన్ని రోజులు ఉందని విహారి సత్యకు చెప్పడం లక్ష్మీని ఇంటికి డ్రాప్ చేయమని సత్య చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకాన్ని విహారి చూసి షాక్ అయిపోతాడు. సెల్‌లో ఫొటో చూసి లక్ష్మీని చూసి ఇన్నిరోజులు కనకమహాలక్ష్మీనే లక్ష్మీగా ఉందా అనుకొని ఇన్నాళ్లు తాను మాట్లాడింది లక్ష్మీతోనా అమ్మ చేరదీసింది కనకమహాలక్ష్మినా అనుకుంటాడు. ఇక చారు కేశవ మనసులో ఉంగరాలతో పారిపోతుంది అనుకుంటే తిరిగి వచ్చిందేంటి అనుకుంటాడు. 

పద్మాక్షి: ఏమే 30 లక్షలు విలువ చేసే ఉంగరాలతో ఉడాయించావా. 
లక్ష్మీ: అదేం లేదు అమ్మగారు దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి.
కాదాంబరి: నోర్ముయ్ ఇక్కడ నిశ్చితార్థం పెట్టుకొని ఉంగరాలతో బయటకు వెళ్లావంటే ఏమనుకోవాలి. అమ్మేశావా వాటిని.
భక్తవత్సలం: అమ్మ లక్ష్మీ ఉంగరాలు నీ దగ్గర ఉన్నాయా.
లక్ష్మీ: ఉన్నాయి అయ్యా యమునమ్మ గారు నా దగ్గర భద్రంగా దాయమని ఇచ్చారు నేను ఏదో పని ఉండి వెళ్లాను. గుర్తొచ్చి పరుగున వచ్చాను ఇవిగో ఆ ఉంగరాలు అని కొంగు చూపిస్తుంది. 

లక్ష్మీ కొంగు ముడి విప్పి ఉంగరాలు తీయడం చూసిన విహారి గతంలో తాను లక్ష్మీతో కొంగు ముడి విప్పడం గుర్తు చేసుకుంటాడు. లక్ష్మీ ఆ ఉంగరాలను సహస్రకి ఇస్తుంది. విహారి అన్ని గుర్తు చేసుకుంటాడు. నిన్ను పక్కనే పెట్టుకొని ఊరంతా వెతికాను. నువ్వు నా ఇంట్లో క్షేమంగా ఉన్నావని సంతోష పడాలో నీ ముందే సహస్రతో నిశ్చితార్థం చేసుకుంటున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అనుకుంటాడు. లక్ష్మీ సహస్రకి ఉంగారాలు ఇస్తే సహస్ర వాటిని తన బావ విహరికి ఇవ్వమని అంటుంది. లక్ష్మీ ఏం మాట్లాడకుండా వణుకుతూ విహారి ముందు ఉంగరాలు ఉంచుతుంది. విహారి ఆలోచనలో పడిపోతే యమున ఉంగరాలు తీసుకోమని అంటుంది. ఇక లక్ష్మీ ముందే విహారి, సహస్రలు రింగులు మార్చుకొని నిశ్చితార్థం చేసుకుంటారు. లక్ష్మీని చూస్తూ విహారి ముభావంగా ఉంటాడు. తర్వాత విహారి, సహస్రలు ఇద్దరూ దండలు మార్చుకుంటారు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇక లక్ష్మీ ఎదురుగానే అందరూ విహారి, సహస్రలతో ఫొటోలు తీసుకుంటారు. 

లక్ష్మీ ఓ చోట కూర్చొని తన పెళ్లి విహారి ఇంటికి తాను రావడం విహారి, సహస్రల నిశ్చితార్థం అన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తుంది. పండు అక్కడికి వస్తాడు. బాధ పడొద్దని నీకు మంచి రోజులు వస్తాయని చెప్తాడు. విహారితో మీరు సంతోషంగా బతికితే బాగున్ను అని పండు అంటే. అది ఎప్పటికీ జరగని ఓ కల అని లక్ష్మీ అంటుంది. దాంతో పండు అందరికీ ఏదో ఒక రోజు నీ పెళ్లి గురించి తెలిసిపోతుందని పండు అంటే అది ఎప్పటికీ ఎవరికీ తెలీకూడదని లక్ష్మీ అంటుంది. జీవితాంతం ఆ తాళి మెడలో వేసుకొని బతికేస్తావా నీ భవిష్యత్ కోసం పోరాడవా అని అడుగుతాడు. నా స్వార్థం నేను చూసుకుంటే విహారిని ప్రేమించిన సహస్ర అన్యాయం అయిపోతుందని అంటుంది. మరోవైపు సహస్ర విహారి దగ్గరకు వెళ్లి ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. విహారిలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఎందుకు అలా డల్‌గా ఉన్నావని నిశ్చితార్థం అయినందుకు సంతోషంగానే ఉన్నావా అని అడుగుతుంది. ఇక విహారికి సత్య కాల్ చేస్తాడు. విహారి కనక మహాలక్ష్మీని నేరుగా చూశానని తను మా ఇంటికే వచ్చిందని అంటాడు. మా అమ్మ తనని చాలా రోజుల క్రితం నుంచి మా ఇంటికి తీసుకొచ్చిందని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అర్జున్ రాకతో చివరి నిమిషంలో ట్విస్ట్.. మళ్లీ మిత్రనే ఛైర్మన్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget