Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 25th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అర్జున్ రాకతో చివరి నిమిషంలో ట్విస్ట్.. మళ్లీ మిత్రనే ఛైర్మన్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode అర్జున్ వచ్చి తన జేఎమ్మార్ వాటా తన వాటా మిత్ర కంపెనీలో కలిపి మిత్రనే మళ్లీ ఛైర్మన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా, దేవయాని హాల్ అందరూ ఉంటే వచ్చి టీవీ ఆన్ చేస్తారు. ఏదో సాధిస్తానని లక్ష్మీ వెళ్లింది కదా ఏం చేస్తుందో చూద్దామని అంటుంది. ఓటింగ్‌కి రాకుండానే మిత్ర ఓటమిని అంగీకరించారని సరయు కొత్త ఛైర్మన్ కాబోతుందని టీవీలో చూపిస్తారు. ఇంతలో మిత్ర అక్కడికి వస్తాడు. మనీషా, దేవయాని నవ్వుకుంటారు. లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ అట్టడుగుతుందని అంటాడు.
సరయు: గేమ్ స్టార్ట్ చేద్దామా లక్ష్మీ ఐ మీన్ ఓటింగ్ స్టార్ట్ చేద్దామా. అక్కడున్న వారంతా నా ఓటు సరయు గారికే అంటారు. లక్ష్మీ వాళ్లందరి షేర్ వ్యాల్యూ 35 పర్సంట్ నా షేర్ వ్యాల్యూ 20 పర్సంట్ టోటల్ 55 పర్సెంట్ షేర్ వ్యాల్చూతో నేను లీడ్‌లో ఉన్నాను. జస్ట్ 25 పర్సెంట్‌తో మీరు ఉన్నారు సో నేనే చైర్మన్.
అర్జున్: వెయిటే మినిట్.
సరయు: ఎవరు మీరు
అర్జున్: ఐ యామ్ అర్జున్. లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్‌కి కో పార్టనర్‌ని నా షేర్ 20 పర్సెంట్.
సరయు: మీ ఇద్దరిదీ మొత్తం కలిపినా 45 పర్సెంటే కదా మేమేం లీడ్‌లో ఉన్నాం.
అర్జున్: ఆగండి మేడం ఇంకా ఉంది.
సరయు: ఇంకే ముంది.
అర్జున్: జేఎమ్మార్ షేర్స్. ఆయన ఈ కంపెనీ పార్టనర్ వెల్ విషర్ ఆయన షేర్లు వీళ్లందరి కంపెనీళ్లలో ఉన్నాయి. ఆయన షేర్స్ 40 పర్సెంట్.
లక్ష్మీ: ఏంటి సరయు షాక్ అయ్యావా. తల తిరుగుతుందా. మా వెనక జేఎమ్మార్ గారు ఉన్నారు. ఆయన షేర్స్ మావి, జేఎమ్మార్‌వి కలుపు కుంటే మావే లీడింగ్ అనుకుంటా.
అందరూ లక్ష్మీ వైపు వచ్చేస్తారు. సరయు ఆగమని అడుగుతుంది. ఇది సరిపోతుందా లేదంటే చెప్పండి ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తాడు అర్జున్. ఇక లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీల కొత్త ఛైర్మన్ మిత్ర గారు అని అనౌన్స్ చేస్తుంది లక్ష్మీ. ఇక సరయు దగ్గరకు లక్ష్మీ వెళ్లి కంపెనీ మాది అని చెప్తుంది. మరోవైపు మీడియాలో లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ నందన్ వంశం చేయి జారిపోలేదని ఆఖరి నిమిషంలో అందరూ మిత్రకు ఓట్లు వేసి గెలిపించారని చెప్తారు. దేవయాని, మనీషా షాక్ అయిపోతారు. మిత్ర కూడా షాక్ అవుతాడు. జయదేవ్, అరవింద, జానులు సంతోషిస్తారు. ఇక అర్జున్, లక్ష్మీ, వివేక్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతారు. లక్ష్మీ మీడియాతో నా భర్త మిత్ర నందన్ నా వెనక ఉండి నడిపించారని చెప్తుంది. నా కుటుంబం, నా శ్రేయాభిలాషులు, షేర్ హోల్డర్స్ అందరూ మా వైపు ఉండి మమల్ని గెలిపించారని చెప్తుంది. అనివార్య కారణాల వల్ల తన భర్త రాలేకపోయి నన్ను పంపించారని లక్ష్మీ చెప్తుంది. మిత్ర ప్రోత్సాహంతోనే గెలిచానని క్రెడిట్ అంతా మిత్రదే అని చెప్తుంది. ఎప్పటికీ లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్ మిత్రనే అని చెప్తుంది. టీవీలో చూసి పిల్లలు చప్పట్లు కొడతారు. నాన్నే గెలిచారని గంతులేస్తారు.
అందరూ లక్ష్మీని పొగుడుతారు. మిత్ర ఆలోచనలో పడతాడు. మనీషా రగిలిపోతుంది. ఇక పిల్లలు రాత్రంతా కష్టపడి రామ కోటి రాశారని ఏమైనా తినిపించమని జానుకి మామ చెప్తాడు. ఇక లక్ష్మీ, వివేక్ ఇద్దరూ అర్జున్‌కి థ్యాంక్స్ చెప్తారు. ప్రాబ్లమ్‌లో ఉన్నట్లు ఎలా తెలిసిందని వివేక్ అడుగుతాడు. దాంతో రాత్రి లక్ష్మీ అర్జున్ ఇంటికి వెళ్లి హెల్ప్ అడిగినట్లు చెప్తాడు. ఎంత ఫ్రెండ్స్ అయినా మీ షేర్స్ మాకు ఇవ్వడం చాలా గ్రేట్ అంటాడు. ఇక జేఎమ్మార్‌కి ఎలా తెలిసింది అని లక్ష్మీ అడిగితే నువ్వు మా ఇంటి తలుపు తడితే నేను జేఎమ్మార్ ఇంటి తలుపు తట్టాను అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం ఫూల్.. తప్పించుకొని పరుగులు.. మళ్లీ నిశ్చితార్థం డౌటే!