(Source: ECI/ABP News/ABP Majha)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 24th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం ఫూల్.. తప్పించుకొని పరుగులు.. మళ్లీ నిశ్చితార్థం డౌటే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకాన్ని చూసిన సత్య తాను విహారిఫ్రెండ్ అని చెప్పడంతో విహారికి తన గురించి చెప్తేస్తారేమో అనే భయంతో కనకం పారిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీని విహారి ఫ్రెండ్ చూస్తాడు. వెంటనే విహారికి కాల్ చేసి కనక మహాలక్ష్మీ గురించి చెప్పబోయి కనకం కనిపించకపోవడంతో మొత్తం వెతుకుతాడు. తర్వాత కాల్ చేస్తా అని విహారికి చెప్తాడు. మరోవైపు కనకం ఒక్కోరికి అడ్రస్ గురించి అడుగుతూ ఉంటుంది. విహారి టెన్షన్‌గా ఉండటం చూసి వెళ్తుంటుంది. ఇక అడ్రస్ తప్పు అని ఓ వ్యక్తి కనకానికి చెప్తారు. ఆ బాక్స్‌లో ఉన్నది విలువైనది అయితే వెళ్లి వాళ్లకి ఇవ్వండి లేదంటే వాళ్లకి ఇచ్చేయండి అని ఆయన లక్ష్మీని ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడమంటారు.
కనకం దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఓ కామెడీ బొమ్మ ఉంటుంది. దాంతో పాటు ఫూల్ అయి రాసి ఉంటుంది. అది చూసి కనకం షాక్ అయిపోతుంది. ఎవరో మిమల్ని ఫూల్ చేయడానికే ఇలా రాంగ్ అడ్రస్‌కి పంపారని అనుకుంటారు. ఇక అంబిక, పద్మాక్షి ఇద్దరూ కనకం చుట్టూ తిరుగుతూ ఒక చోట ఉండకుండా తిరుగుతూ నిశ్చితార్థంలో ఉండకూడదనే ఇలా చేశామని తెచ్చిన డబ్బులు కూడా ఆటో చార్జీలకు అయిపోయి ఉంటాయి కదా నడుచుకుంటూ ఇంటికి వచ్చేయ్ అని అంటారు. నేను వాళ్లకి నిశ్చితార్థం జరుగుతుంటే ఇష్టం లేదని నా భర్తకి వేరే అమ్మాయితో నిశ్చితార్థం నేను చూస్తే బాధ పడతాను అని దేవుడికి అనిపించి తనని ఇలా దూరం చేసుకుంటాడని అనుకుంటుంది కనకం.
ఇక కనకం కోసం విహారి ఫ్రెండ్ చాలా వెతుకుతూ ఉంటాడు. ఓ చోట కనకం నిల్చొడం చూసి వెళ్తాడు. ఫొటో తీస్తాడు. కనక మహాలక్ష్మీని పిలుస్తాడు. విహారి ఫ్రెండ్‌ని అని చెప్తాడు. విహారికి అతను చెప్తాడేమో అని కనకం భయపడి ఆయనకు దొరకకూడదని అక్కడి నుంచి పారిపోతుంది. విహారి ఫ్రెండ్ కనకం వెనక పరుగులు తీస్తాడు. విహారి ఫ్రెండ్‌కి సత్యకి దొరకకుండా కనకం దాక్కుంటుంది. సత్య విహారికి ఫోన్ చేస్తు కనకాన్ని చూశానని చెప్తాడు. కనకం మిస్ కాకూడదని విహారి సత్యతో చెప్తాడు. ఇక సహస్ర విహారి దగ్గరకు వచ్చి ఎందుకు బావ టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. ఏదో దాస్తున్నట్లు లోలోపల దేని కోసమో భయపడుతున్నట్లు తెలుస్తుందని కంగారు పడుతూ చూస్తున్నావని అంటుంది. బాగానే ఉన్నానని విహారి కవర్ చేస్తాడు.
ఇక సహస్ర నవ్వుతూ ఈ పిల్లని పెళ్లి చేసుకొని ఎలా వేగాల అని టెన్షన్ పడుతున్నావని నాకు తెలుసని అంటుంది. ఇక విహారి, సహస్ర ఇద్దరినీ నిశ్చితార్థం కోసం పూజ చేయడానికి తీసుకొస్తారు. లక్ష్మీ దగ్గర రింగులు ఉండిపోవడంతో యమున టెన్షన్ పడుతూ ఉంటుంది. ఉంగరాలు లేకపోతే ఏం గొడవ చేస్తారో అని అనుకుంటుంది. పంతులు రింగులు అడుగుతారు. సహస్ర యమునను రింగులు తీసుకురమ్మని చెప్తుంది. దానికి యమున టెన్షన్ పడుతూ లక్ష్మీ ఇంట్లో లేదని చెప్తుంది. దానికి పద్మాక్షి ఉంగరాలు తీసుకురమ్మని అంటే లక్ష్మీ లేదు అంటావేంటి అని అడుగుతుంది.
దాంతో యమున ఉంగరాలు లక్ష్మీ దగ్గరే ఉందని చెప్తుంది. తనకు ఎందుకు ఇచ్చావని అందరూ అడిగితే నేను సమంగళిని కాదు కాబట్టి తనకు జాగ్రత్త చేయమని ఇచ్చామని అంటుంది. ఎవరి పని వాళ్లకి చెప్పాలి కానీ రింగులు పనామెకి ఇవ్వడం ఏంటని సహస్ర అడుగుతుంది. ఇంట్లో ఇంత మంది ఉండగా లక్ష్మీకే ఎందుకు ఇచ్చావని విహారి అడిగితే వీళ్లు నాకు ఆ బాధ్యత అప్పగించారు కాబట్టి లక్ష్మీకి ఇచ్చానని చెప్తుంది. ఇక పద్మాక్షి నిశ్చితార్థం ఆపడానికే ఇలా చేశారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య మీద సంజయ్ కళ్లు, వంకర మాటలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి భర్తకి కంప్లైంట్ ఇచ్చిన సత్య!