Trinayani Serial Today October 16th: 'త్రినయని' సీరియల్: నయని వైపు దూసుకొచ్చిన యమపాశం.. మధ్యలో గాయత్రీ పాప దగ్గర యూ టర్న్.. చనిపోయేది ఎవరు?
Trinayani Today Episode నయని వైపు యమపాశం రావడం తర్వాత పరీక్షించగా గాయత్రీ పాప వైపు వెళ్లడంతో విశాలాక్షి వచ్చి ఏం జరగుతోందో ఆలోచించండని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని జాతకం తీసుకొని తిలోత్తమ చూస్తుంది. హాసిని అక్కడికి వచ్చి నయని జాతకం చూపినా మీకు అర్థం కాదని అంటుంది. ఇక నయనిని పిలిచి నీ జాతకం తీసుకొని రా అంటుంది. నయని తీసుకొస్తుంది. ఇక తిలోత్తమ చేతిలో ఉన్న పేపర్ నయనికి చూడమని హాసిని అంటుంది. అది చూసి నయని ఇది మా చెల్లి సుమన జాతకం అని అంటుంది. దానికి తిలోత్తమ పొరపాటు పడ్డానని అంటుంది.
తిలోత్తమ: మొదట్లో ఈ జాతకం చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యారా ఈ జాతకం ఏంటి ఇంత దరిద్రంగా ఉందని అని.
వల్లభ: చిన్న మరదలిది కాబట్టి అలాగే ఉంటుంది.
నయని: అయినా మా జాతకాలతో మీకు ఏం పని అత్తయ్య.
తిలోత్తమ: ఒకసారి నీ జాతకం ఇటు ఇవ్వు నయని. తిలోత్తమ తీసుకొని చూస్తుంది. నయని జాతకంలో హఠాత్తుగా మరణం అని ఎక్కడా రాసి లేదు.
హాసిని: ఉండదు డియర్ అదంతా నయని చెల్లి బ్రాంతి.
నయని: అందుకేనా జాతక పేపర్లు తెమ్మన్నావు.
హాసిని: వీళ్ల బాధ చూడలేక తెమ్మన్నాను. పాపం నువ్వు హాయిగా విశాల్ ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నావ్. డిస్ట్రబ్ చేశా.
నయని: ఊహించని విపత్తు ఏదో జరగబోతుందని మీ అందరితో చెప్పినందుకు నాకు భరోసా ఇవ్వకపోగా ఇలా జాతకం తిరగేయడం ఏం బాలేదు అత్తయ్యా.
తిలోత్తమ: చూడటం మంచిందే అయింది నయని. ఇందులో అలా ఏం రాలేదు.
నయని: పంతులు ఎంత వరకు రాస్తారు అలాగే బ్రహ్మ రాత మనకు కనపడదు.
ఉదయం గాయత్రీ పాప హాల్‌లో ఆడుకుంటూ ఉంటుంది. నయని సర్దుకుంటూ ఉంటే నయని దగ్గరకు యమపాశం వస్తుంటుంది. అది సుమన చూసి పెద్దగా అరుస్తుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. ఏమైందని అంటే పాము అని సుమన చెప్తుంది. అందరూ అది పాము కాదు తాడు అని అందరూ అంటారు. ఇక నయని ఆ తాడుని తీసుకుంటుంది.
సుమన: అది పాకుతూ నీ వైపు రావడం చూసే నేను అరిచాను అక్క.
నయని: స్టోర్ రూంలో పెట్టేసి వస్తా.
విశాలాక్షి: ఎక్కడ దాచినా అది నీ దగ్గరకే వస్తుంది అమ్మ.
తిలోత్తమ: ఆ తాడు నయని దగ్గరకు వస్తుందని గారడీ పాప చెప్పింది అంటే సుమన చెప్పినట్లు అది నయని వైపే వచ్చింది.
విశాల్: తాడు రావడం ఏంటమ్మా.
విశాలాక్షి: అది విధి నాన్న విధి పరీక్షిస్తుంది. పొరపాటుని శిక్షిస్తుంది.
నయని: విశాలాక్షి నువ్వు ఏం అంటున్నావో అర్థం కావడం లేదమ్మా.
విశాలాక్షి: నువ్వు చేతిలోకి తీసుకుంది తాడు కాదమ్మా పాశం. యమపాశం. దాన్ని నువ్వు పడేసినా, దూరంగా విసిరేసినా అగ్నిలో పడేసినా, నీటిలో పడేసినా అది నాశనం కాదమ్మా ఎందుకుంటే అది ప్రాణాలు పట్టుకుపోయే అఖండమైన ఆత్మనే పాశం. అమ్మని పట్టుకోవడానికి వచ్చిన పాశాన్ని అమ్మే పట్టుకుంది.
సుమన: అంటే చేజేతులా మా అక్కే చావు తెచ్చుకుంటుందని అంటున్నావా.
విశాల్: షట్ అప్ పొరపాటున కూడా అలా అని సారీ చెప్పినా నేను క్షమించను సుమన.
సుమన: విశాలాక్షి ఉద్దేశాన్ని నేను చెప్పాను బావగారు.
నయని: విశాలాక్షి నిజమే చెప్తుందని నాకు అనిపిస్తుందని బాబుగారు.
తిలోత్తమ: విశాలాక్షి ఎప్పుడు ఏం చెప్పినా నిజమే చెప్తుందని నయనికి తెలుసు.
ఇక నయని తనకు తన ఫొటోకి దండ వేసి కనిపించినట్లు చెప్పినట్లు సుమన విశాలాక్షికి చెప్తుంది. ఇక వల్లభ ఇంతలో నయనిని దూరం జరగమని ఆ పాశం మళ్లీ నయని దగ్గరకు వెళ్తే అది నయని కోసమే వచ్చిందని నయనికి వచ్చిన కల నిజమవుతుందని అంటారు. విశాల్ వద్దు అన్నా మిగతా అందరూ నయనికి ఆ పరీక్షలో పాల్గొమంటారు. నయని కొంచెం దూరంగా వెళ్తుంది. దాంతో ఆ యమపాశం మళ్లీ ప్రయాణిస్తూ నయని దగ్గరగా వెళ్లి అక్కడే ఉన్న గాయత్రీ పాప దగ్గరకు వెళ్లి ఆగుతుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు.
పాప దగ్గరకు వెళ్లింది అంటే అది పాప ప్రాణాలు పోతాయేమో అని అంటుంది. విశాల్ మాత్రం ఇదంతా విశాలాక్షి చేసిన గారడీ అని చెప్తాడు. నా మాట తప్పు అని అంటారా అని విశాలాక్షి అడుగుతుంది. పాప వైపు ఎందుకు పాశం వచ్చిందో ఆలోచించండి అని చెప్పి వెళ్లిపోతుంది. అందరూ ఆలోచనలో పడతారు. విశాల్ గాయత్రీ పాపతో ఆరు బయట ఉంటే తిలోత్తమ, వల్లభలు యమపాశం తీసుకొని వస్తారు. నయని కూడా అక్కడికి వస్తుంది. గాయత్రీ పాప గురించి మాట్లాడుకుంటే మంచిదని తిలోత్తమ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.