Satyabhama Serial Today October 15th: సత్యభామ సీరియల్: మీడియా ముందు మామని ఇరికించేసిన సత్య.. ఇక నో వెపన్స్.. మైత్రి, హర్షల సరసాలు చూసేసిన నందిని!
Satyabhama Today Episode ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీంటిని సత్య మీడియా సమక్షంలో మహదేవయ్యతోనే పోలీసులకు ఇప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Serial Today Episode మహదేవయ్య ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు తమ భర్తలకు తలంటు స్నానం చేయిస్తారు. తర్వాత సత్య గదిలో క్రిష్ తల రుద్దుతుంటుంది. దానికి క్రిష్ భార్య భర్తకి ఇలా స్నానం చేయించి తల రుద్దు తుంటే స్వర్గం అంటూ సత్య నడుం చుట్టేస్తే సత్య ఇలాంటివి చేస్తే తల రుద్దనని అంటే ఏం చేయను అని అంటే సత్య అప్పుడు రుద్దుతుంది. ఇంతలో మళ్లీ క్రిష్ ఐలవ్‌యూ అని చెప్తూ హగ్ చేసుకుంటాడు. ఇంతలో జయమ్మ రావడంతో క్రిష్ తిడతాడు. ఇక డిస్ట్రబ్ చేస్తున్నావ్ అని అంటాడు. ఇక జయమ్మ సత్యకి పూజ ఉందని తీసుకెళ్లిపోతుంది.
మరోవైపు మైత్రి నందిని చీర కట్టుకొని ఆరు బయట పువ్వులు తెంచుతుంటుంది. అటుగా వచ్చిన హర్ష అది నందిని అనుకొని సైలెంట్‌గా వెళ్లి వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. మైత్రి అరవబోతే నందిని అని నోరు మూసేస్తాడు. ఇక ఈ చీరలో చాలా బాగుంటావని నాకు చాలా ఇష్టమని అంటాడు. ఇక ఇంతలో నందిని వచ్చి ఆ సీన్ చూసి హర్ష అని అరుస్తుంది. దాంతో హర్ష నోరు మూసేస్తే ఎలా అరుస్తున్నావ్ అని అంటాడు. దానికి నందిని అరచింది నేను అని నందిని అంటే అప్పుడు మైత్రిని చూసి షాక్ అవుతాడు. మైత్రికి సారీ చెప్తాడు. సారీ వల్లే ఇదంతా అని అంటాడు. మైత్రి ఏం పర్లేదు అని సారీ మార్చేస్తా ఇదంతా సారీ వల్లే అని అంటుంది. ఇక నందిని ఆ చీరని తగలబెట్టేయాలని అంటుంది.
మరోవైపు మహదేవయ్య ఇంట్లో పూజలో పెట్టడానికి ఆయుధాలన్నీ దేవుడి దగ్గర పెడతారు. సత్యని ఇరికించడానికి మహదేవయ్య ఆయుధ పూజ చిన్న కోడలు చేస్తుందని అంటాడు. దానికి భైరవి నేను చేయాల్సింది తను చేయడం ఏంటి అని కోప్పడుతుంది. ఆనవాయితీ తప్పొద్దని అమ్మతోనే చేయిస్తే మంచిదని కలిసొస్తుందని రుద్ర అంటాడు. జయమ్మ కూడా దానికి ఎందుకురా అంటాడు. దానికి మహదేవయ్య చచ్చుబుడ్డీ లాంటి చిన్న కోడలు చేస్తే బాగుంటుందని అంటాడు. ఇంతలో ఇంటికి మీడియా వాళ్లు వస్తారు. అందరూ మహదేవయ్య పిలిచాడేమో అని అనుకుంటారు. రుద్ర వాళ్లు ఆయుధాలు ఫొటో తీసి పేపర్‌లో టీవీలో వేస్తే ఇబ్బందని వెళ్లిపోమని చెప్తా అని వాళ్లని వెళ్లిపోమని అంటాడు. ఇంతలో సత్య వచ్చి నేనే పిలిచాను అని అంటుంది.
సత్య: ఒకప్పుడు మహదేవయ్య వేరు ఇప్పుడు మహదేవయ్య వేరు. ఒకప్పుడు రాతి గుండె ఉన్నమనిషి ఇప్పుడు మనసున్న మనిషి. తన కూతుర్ని ఓ పేదింటికి కోడలిగి పంపారు. పేద ఇంటికి చెందిన నన్ను ఈ ఇంటి కోడలిగా తెచ్చుకున్నారు. ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి. ఆయన మంచి ఆలోచనలు అక్కడితో ఆగలేదు. ఈ రోజు ఆయుధ పూజ సందర్భంగా ఈ ఇంట్లో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు.
మహదేవయ్య: మనసులో నేనేం తీసుకున్నా.
సత్య: సెక్యూరిటీని ఇచ్చే ఆయుధాలను వదిలేసి సింపుల్‌గా జనంతో కలిసి మెలిసి ఉండాలి అనుకుంటున్నారు.
రుద్ర: ఆ మాట బాపు ఎప్పుడు.
మహదేవయ్య: రేయ్ మీడియా వద్దు.
సత్య మామయ్యని మీడియా దగ్గర ఇరికించి ఇంట్లో ఉన్న ఆయుధాలన్నింటిని స్థానిక పోలీసులకు సరెండర్ చేస్తున్నారని చెప్ప మామని చూసి కనుబొమ్మలెగరేస్తుంది. ఇంతలో పోలీసులు వస్తారు. మహదేవయ్య చేతనే ఆయుధాలు పోలీసులకు ఇచ్చేలా చేస్తుంది. ఫొటోలు ఫోజు కూడా ఇప్పిస్తుంది. పోలీసులు కూడా గొప్ప నిర్ణయం తీసుకున్నారని పొగిడేస్తారు. ఇక మహదేవయ్య అనుచరులతోనే ఆయుధాలన్నీ మూట కట్టి ఇవ్వమని చెప్తుంది. పోలీసులు మీడియా వెళ్లిపోయిన తర్వాత రుద్ర సత్యతో ఆయుధాలన్నీ ఇచ్చేస్తావా ఆయుధాలు లేకుండా మాకు ఎలా నడుస్తుందని అనుకున్నావ్ అంతా నీ ఇష్టమేనా అని కోప్పడతాడు. భైరవి కూడా అంతా తన ఇష్టారాజ్యం అయిపోయిందని కోడలిని అంటుంది. ఇంతలో రేణుక ఆయుధాలు చేతిలో లేకుండా బతికితేనే బతుకు విలువ తెలుస్తుందని ఎదుటి వారి కన్నీటి విలువ తెలుస్తుందని అంటుంది. దానికి రుద్ర భర్తనే ఎదురిస్తావా అని రేణుకని కొట్టడానికి వెళ్తే క్రిష్ ఆపుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: వరసగా అదే అపశకునం.. నయనికి కనిపించని భవిష్యత్.. అసలేం జరుగుతోంది?