మహదేవయ్యకు గట్టి షాక్ ఇచ్చిన సత్య..
సీరియల్స్ అంటే ఇప్పటివరకు అత్తా, కోడలి మధ్య జరిగే గొడవలే చూపించారు. కానీ సత్యభామ సీరియల్‌తో ఆ స్టీరియోటైప్స్కి బ్రేక్ పడింది. ఈ సీరియల్లో మావ, కోడలి మధ్య యుద్ధం జరుగుతోంది.
క్రిష్.. సత్య ఎప్పుడెప్పుడూ కలుస్తారా? అనే ఆడియన్స్ క్యూరియాసిటీ తీరేలా వారిద్దరూ ఇప్పుడు ఓ జట్టై పోయారు. కానీ క్రిష్‌కి తెలియకుండా అదే ఇంట్లో పెద్ద డ్రామ జరుగుతోంది.
మహదేవయ్య, రుద్ర కలిసి.. క్రిష్‌ని ఎలా వాడుకుంటున్నారో తెలుసుకున్న సత్య.. వారితో కనిపించని యుద్ధం చేస్తుంది. వారి ప్లాన్స్‌ని అడ్డుకుంటూ ముందుకు వెళ్తోంది.
సత్యను తన పర్సనల్ జోలికి రావొద్దంటూ తన భార్యను చంపేస్తానంటూ రుద్ర.. సత్యకు గన్ గురిపెట్టి భయపెడతాడు. దీంతో సత్య మాస్టర్ ప్లాన్ వేస్తుంది.
ఆయుధ పూజ సమయంలో పోలీసులు, మీడియాను పిలిచి.. మహదేవయ్య ఆయుధ పూజ సందర్భంగా.. తమ గన్స్‌ని ఇచ్చేస్తున్నట్లు పోలీసులకు ఇచ్చేయడంతో రుద్ర, మహదేవయ్య షాక్ అవుతారు.
సత్య, వదిన చేసినదాంట్లో తప్పు ఏంటి అంటూ.. రుద్రని క్రిష్ అడుగుతాడు. బాపు ధైర్యం ఎంత ఇష్టమో.. సత్య తెలివి అంత ఇష్టమంటూ చెప్తాడు.
క్రిష్‌ని మెల్లిగా తన దారిలోకి తెచ్చుకుంటున్నందుకు సత్య.. మహదేవయ్యని కనులు ఎగరేస్తూ చూస్తుంది.
సత్య ప్లాన్‌ని మహదేవయ్య ఎలా తిరిగి కొడతాడు.. సత్య ఎలాంటి ప్లాన్స్‌తో మహదేవయ్య నిజస్వరూపాన్ని బయటపెడుతుందో రానున్నరోజుల్లో చూడాల్సిందే.
మహాదేవయ్య తండ్రి కాదని.. క్రిష్‌కి తెలిస్తే.. బాపుకి సపోర్ట్ చేస్తాడో.. సత్యను సమర్థిస్తాడో అనే క్యూరియాసిటీ సత్యభామ సీరియల్ ప్రేక్షకుల్లో ఎక్కువైంది.