'గుప్పెడంతమనసు' శుభం

'గుప్పెడంత మ‌న‌సు' సీరియల్ కి రెండోసారి ఎండ్ కార్డ్

Published by: RAMA

'గుప్పెడంతమనసు' శుభం

గుప్పెడంతమనసు సీరియల్ కి రెండోసారి ఎండ్ కార్డ్ అని ఆశ్చర్యపోవద్దు..ఈసారి ఎండ్ కార్డ్ పడింది కన్నడ గుప్పెడంతమనసుకి

'గుప్పెడంతమనసు' శుభం

తెలుగులో గుప్పెడంతమనసు నెలరోజుల క్రితమే ముగియగా..కన్నడలో అక్టోబరు 03తో సీరియల్ కి శుభం కార్డు పడింది

'గుప్పెడంతమనసు' శుభం

క‌న్న‌డంలో హోంగ‌నాసు పేరుతో వచ్చిన ఈ సీరియల్ లోనూ ముఖేష్ గౌడ - రక్షా గౌడ అదేనండీ మన రిషిధారలే హీరోహీరోయిన్లు

'గుప్పెడంతమనసు' శుభం

రిషి రీఎంట్రీ తర్వాత సీరియల్ మాంచి జోరుగా సాగుతున్న టైమ్ లో తెలుగు గుప్పెడంతమనసుకి శుభం కార్డ్ వేశారు. అయితే అర్థాంతరంగా ముగించేయకుండా పద్ధతిగా క్లోజ్ చేశారు

'గుప్పెడంతమనసు' శుభం

కన్నడలో హెంగనాసు పేరుతో వచ్చిన ఈ సీరియల్ అయిపోయిందంటూ స్టార్ సువ‌ర్ణ ఛానెల్‌ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. తెలుగుకి - కన్నడకి నెల రోజులు గ్యాప్ వచ్చింది

'గుప్పెడంతమనసు' శుభం

ఈ సీరియల్ లో హీరో హీరోయిన్లు ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ ఇద్దరూ కన్నడవారే కావడంతో అక్కడ కూడా బాగా హిట్టైంది. తెలుగులో కార్తీకదీపం తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది గుప్పెడంతమనసు

'గుప్పెడంతమనసు' శుభం

తెలుగు, కన్నడమే కాదు.. త‌మిళం, మ‌ల‌యాళం, బెంగాళీ, మ‌రాఠీతో పాటు మ‌రికొన్ని భాష‌ల్లో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ రీమేక్ అయ్యింది. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో మాత్ర‌మే రిషిధారలు నటించారు

'గుప్పెడంతమనసు' శుభం

త్వరలోనే గుప్పెడంతమనసు సీక్వెల్ వస్తుందని రక్షాగౌడ్ క్లారిటీ ఇచ్చింది..మరి అందులోనూ సేమ్ టీమ్ రిపీట్ అవుతుందే లేదో చూడాలి

'గుప్పెడంతమనసు' శుభం

సీరియల్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై వెళ్లిన ముఖేష్ గౌడ.. సినిమాలపై ఫోకస్ చేశాడు.. గీతాశంకరం మూవీలో నటిస్తున్నాడు. కన్నడలోనూ ఓ మూవీకి సైన్ చేశాడు. ర‌క్షా గౌడ కూడా సినిమాల్లో ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది..