తూలి పడిన రాజ్..పట్టుకుని వదిలేసిన కావ్య!
కావ్య ఆఫీసుకి బయలుదేరుతుంది..కనకం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. తండ్రి ఎదురై ఆటోకి డబ్బులున్నాయా అని అడిగితే ఉన్నాయి నాన్నా అంటుంది. పెళ్లిచేసి పంపించేస్తే బాధ్యత తీరిపోతుందని అనుకోలేదమ్మా అంటూ డబ్బులిస్తాడు కృష్ణమూర్తి
మీరు కావ్యకు తోడుగా ఉండడం సంతోషమే కానీ..అటు అల్లుడు గారు ఆఫీసులో బిజీ..ఇటు ఇది దీని ఉద్యోగంలో బిజీ...మరి వీళ్లిద్దరూ ఎప్పుడు కలుస్తారని ఆవేదన చెందుతుంది కనకం. కాలమే సమాధానం చెబుతుంది అనేస్తాడు కృష్ణమూర్తి..
రాజ్ ఆఫీసుకి బయలుదేరుతాడు..మరి నా కొడుకు సంగతేంటని కంగారుపడుతుంది రుద్రాణి.. రాజ్ ఇందిరాదేవి, అపర్ణ ఆశీర్వాదం తీసుకుంటాడు. జరగకూడవు అనుకున్నవన్నీ జరుగుతున్నాయ్..కావ్యను నువ్వే తీసుకొస్తావ్ అంటుంది అపర్ణ...
రుద్రాణి కంగారుగా అనామికకు కాల్ చేసి రాజ్ మళ్లీ ఆఫీసు బాధ్యతలు తీసుకున్నాడని చెబుతుంది. ఈ పాటికే దుగ్గిరాల వారి కంపెనీ కూల్చేందుకు రంగం సిద్ధం చేశానంటూ కావ్యను డిజైన్లు కొంటున్న విషయం చెబుతుంది అనామిక..
గుడిలో రాజ్ - కావ్య ఒకేసారి గంట కొడతారు.. ఒకర్నొకరు చూసి చికాకుగా మొహం పెడతారు. ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. పూజారిని పిలిచి రెండు గంటలు పెట్టమని రాజ్ అనడంతో..మీరిద్దరూ భార్య భర్తలా అని పూజారి అడుగుతాడు.
మీ ఆయన ఏం చేస్తాడని అడిగితే బూత్ బంగ్లాలో నివాసం ఉంటాడని పంచ్ వేస్తుంది. మీ భార్య అని పూజారి అడిగితే ఇంకా పెళ్లికాలేదని చెప్పేస్తాడు..ఏదైనా లోపమా డాక్టర్ కి చూపించోకమని సలహా ఇస్తాడు పూజారి
మా ఆయన బూత్ బంగ్లా ఊడుస్తాడు..నేను బొమ్మలతో సంపాదించిన డబ్బులు లాక్కుంటాడు. తాగేందుకు డబ్బులివ్వలేదని ఇంట్లోంచి పంపించేశాడు..చెప్పుడు మాటలు విని నన్నే తిడతారుని చెబుతుంది. ఆ దేవుడే బుద్ధి చెబుతాడు లేమ్మా అని పూజారి చెబుతాడు.
భక్తుల గుంపు రావడంతో ఇద్దరూ కలసి హారతి తీసుకుంటారు.. ఆ తర్వాత వెళుతూ అరటి తొక్కపై కాలేసి పడబోతున్న రాజ్ ని కావ్య పట్టుకుంటుంది. ఇలాంటి ట్రిక్స్ వద్దని రాజ్ అంటే..సరే అని వదిలేస్తుంది..కింద పడతాడు..
కంపెనీలో ఉద్యోగలంతా ఫుల్ ఫ్రీడమ్ ఫీలవుతుంటారు..ఇంతలో రాజ్ ఎంట్రీ ఇచ్చి శ్రుతి అని ఫైర్ అవుతాడు. నేను కఠినమైన నిర్ణయం తీసుకుంటే మీ స్థానంలో కొత్త స్టాఫ్‌ను తీసుకురాగలను అని రాజ్ వార్నింగ్ ఇస్తాడు.
పెద్ద కంపెనీతో డీల్ కుదుర్చుకున్నామని .. బెస్ట్ డిజైన్లు ఇవ్వాలని కావ్యను అడుగుతాడు మేనేజర్. మరోవైపు మీ కంపెనీని పడగొడతా అని రాజ్ తో సామంత్ ఛాలెంజ్ చేస్తాడు...