పూజలో రాజ్ - కావ్య, అప్పుకి కళ్యాణ్ అదిరిపోయే గిఫ్ట్!
వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నిందలు పడతారంటారు..నీ మొహం చూశాను ఎన్ని నిందలు పడాలో అని రాజ్ అంటే.. చంద్రుడిని లాంటి నా మొహం చూస్తే మీలాంటి అహంకారికి కూడా మంచే జరుగుతుందని కావ్య అంటుంది
షాప్ కి వెళ్లిన రాజ్ కి.. అక్కడున్న వినాయక విగ్రహాలు అన్నిటికన్నా కావ్య తయారు చేసిన విగ్రహమే నచ్చి..డబ్బులు ఎక్కువ చెల్లించిమరీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు
పూజకు అన్నీ సిద్ధం చేసేశానని రాజ్ అంటే.. కావ్యకు కాల్ చేయమని ఆర్డర్ వేస్తుంది ఇందిరాదేవి. భార్య లేకుండా పూజచేయకూడదని ... ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే కావ్య గుర్తుకురాలేదా అని అపర్ణ క్లాస్ వేస్తుంది
కావ్యకు నువ్వు కాల్ చేయి నేను కారు పంపిస్తానంటాడు రాజ్ తండ్రి. లేదంటే నేను వెళ్లి బతిమలాడుతాను, రానంటే లాగిపెట్టి తీసుకొస్తాను అని అపర్ణ అంటుంది. దేవుడి పూజ అని చెప్పి ఆ రాక్షసిని ఇంటికి తీసుకొచ్చేదేలేదు అంటాడు.
కావ్య చీర పక్కనపెట్టుకుని పూజ చేయి అంటుంది ఇందిరాదేవి. ఈ విగ్రహంలో జీవకళ చూస్తుంటే కావ్య తయారుచేసినట్టే ఉందంటుంది అపర్ణ. రాజ్ పూజ చేస్తుంటే.. అక్కడ కావ్య ఉన్నట్టు ఊహించుకుంటుంది అపర్ణ.
కళ్యాణ్-అప్పు కూడా వినాయకపూజ చేస్తారు. అప్పుకి పోలీస్ డ్రెస్ గిఫ్ట్ గా ఇస్తాడు కళ్యాణ్..నువ్వు పక్కనపెట్టిన గోల్ మళ్లీ మొదలెట్టాలంటాడు.
అనామిక అవమానించిందని ఇలా చేస్తున్నావా అని అప్పు అంటే..నా బాధ్యత నాకు గుర్తొంచిందని క్లారిటీ ఇచ్చి పోలీస్ డ్రెస్ గోడకు తగిలిస్తాడు..ప్రేమగా కళ్యాణ్ ను హగ్ చేసుకుంటుంది అప్పు
వదినగారూ అంటూ ఎంట్రీ ఇచ్చిన కనకంతో కావ్య కూడా వచ్చిందేమో అని రుద్రాణి కంగారుపడుతుంది.. ఏంటి పిలవని పేరంటానికి వచ్చి కూతురుని అత్తారింటికి పంపించి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నావా అంటుంది
నా కూతురికి అల్లుడుకి మధ్య బంధం ఇంకా ఉందని చెప్పేందుకు నా అల్లుడి పక్కనున్న నా కూతురి చీరే సాక్ష్యం అని కౌంటర్ ఇస్తుంది కనకం. అయినా కావ్య చేసిన దేవుడు ఈ ఇంటికి చేరాడు..నా కూతురు రాలేదా అంటుంది. రాజ్ కి పెద్ద షాకే ఇది...