బ్రహ్మముడి సెప్టెంబరు 23 ఎపిసోడ్

రాజ్ - కావ్య టామ్ & జెర్రీ వార్ మళ్లీ మొదలు!

Published by: RAMA

బ్రహ్మముడి

దుగ్గిరాల వారి వ్యాపారాలకు చెక్ పెట్టేందుకు అనామిక వేసిన ఉచ్చులో కావ్య పడేట్టే ఉంది. ఎందుకంటే ఎవరి ద్వారా అయితే కావ్య డిజైన్లు అమ్ముతుందో ఆ వ్యక్తిని కొనేశారు అనామిక అండ్ సామంత్..

బ్రహ్మముడి

ప్రస్తుతం పుట్టింట్లో ఉన్న కావ్యకు ఉద్యోగం చాలా అవసరం..ఆ వేటలోనే ఉంది. ఇదే అవకాశంగా కావ్యకు జాబ్ ఆఫర్ చేసింది అనామిక. ఆ విషయం నేరుగా చెప్పకుండా తను డిజైన్లు అమ్మే సందీప్ ద్వారా కాల్ చేయిస్తుంది

బ్రహ్మముడి

తనకు తెలియకుండానే అనామిక - సామంత్ కి సహకరించేలా ఉంది కావ్య.. మరి ఈ విషయం కావ్యకు ముందే తెలుస్తుందా..ఈ కుట్రకు చెక్ పెడుతుందా చూడాలి

బ్రహ్మముడి

మరోవైపు ఈ సారి వినాయకచవితి వేడుకలు నీ చేతుల మీదుగానే జరగాలని రాజ్ కి చెప్పింది ఇందిరాదేవి. మంచి విగ్రహం తీసుకురావాలన ఆదేశించింది

బ్రహ్మముడి

వినాయక విగ్రహం వేటలో రాజ్ ...దారిలో వెళుతూ వెళుతూ చూసుకోకుండా సైకిల్ పై వస్తున్న కావ్యను కారుతో గుద్దేస్తాడు.. కారు దిగి వచ్చిన తర్వాత కూడా కిందపడింది కావ్య అని చూడడు

బ్రహ్మముడి

వినాయక విగ్రహం వేటలో రాజ్ ...దారిలో వెళుతూ వెళుతూ చూసుకోకుండా సైకిల్ పై వస్తున్న కావ్యను కారుతో గుద్దేస్తాడు.. కారు దిగి వచ్చిన తర్వాత కూడా కిందపడింది కావ్య అని చూడడు

బ్రహ్మముడి

సీరియల్ ఆరంభంలో కూడా రాజ్..వినాయక బొమ్మకోసం వెళుతూనే కావ్యను కారుతో గుద్దేస్తాడు...ఇద్దరి పరిచయం మొదలైంది ఈ సీన్ తోనే..

బ్రహ్మముడి
ఇప్పుడు రాజ్ ను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిన కావ్యను తీసుకొచ్చేదే లే అని రాజ్..నేను రాను అని కావ్య భీష్మించుకు కూచున్నారు.. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది


బ్రహ్మముడి

ఇక మంచి వినాయక విగ్రహం అంటే కావ్య తయారు చేసినదే కదా .... ఇప్పటికే ఓ విగ్రహం కూడా సిద్ధం చేసింది కావ్య. ఆ వినాయక బొమ్మనే రాజ్ కొనే అవకాశం ఉంది...