పరాయి పెళ్లాం - కిరాయి మొగుడు'
కావ్యను పిలిచేందుకు వెళ్లిన రాజ్..తన తప్పు ఉందని ఒప్పుకోకుండా ఈగో చూపిస్తాడు. కావ్య రాను అని చెప్పేసరికి డబ్బులతో బేరం పెట్టే ప్రయత్నం చేస్తాడు
మా ఇంట్లో కోడలిగా నటించేందుకు ఎంత కావాలి? బ్లాంక్ చెక్ ఇస్తాను...నెల నెలా తీసుకుంటావా , ఏడాదికోసారి తీసుకుంటావా అనేది పూర్తిగా నీ ఇష్టం అని ఆఫర్ ఇస్తాడు
ఆగండి సర్దుకుని వస్తానంటూ లోపలకు వెళ్లిన కావ్య చిన్న కవర్ తీసుకొస్తుంది..అందులో ఏముందని అడుగుతాడు రాజ్. మీ నెల జీతం ఎంత అని అడుగుతుంది
నేను కంపెనీ నుంచి ఖర్చులకోసం నెలకు 5లక్షలు తీసుకుంటాను అంటాడు. అప్పుడు కావ్య కవర్ లోంచి 5 లక్షలు విలువచేసే బంగారం తీసిచ్చి.. ఇది తీసుకుని మా ఇంట్లో నెల రోజులు మా ఇంట్లో అల్లుడిగా నటించండి అంటుంది
దుగ్గిరాల వంశ వారసుడిని నెల జీతానికి కొనాలని చూస్తున్నారా అని ఫైర్ అవుతాడు. మీరు ఎవరైతే ఏంటి అవసరం మీది అవకాశం నాది అని రివర్సవుతుంది కావ్య
నాతో మీకే అవసరం ఉందని క్లారటీ ఇచ్చిన కావ్య.. మీరు నటించడానికి సిద్ధమంటే నెల రోజుల పాటు మా ఇంటి అల్లుడిగా ఉండి ఇంట్లో పనులన్నీ చేయండి..వచ్చే నెల సేమ్ ప్యాకేజ్ తో నేను మీ ఇంటికి వస్తానంటుంది
నువ్వు నేను ఒక్కటేనా అని రాజ్ అంటే..నీకేమైనా కొమ్ములున్నాయా అని రివర్సవుతుంది..దుగ్గిరాల వారసుడు అయితే ఏంటి ఐ డోంట్ కేర్ అని ఇచ్చి పడేస్తుంది..
మీరు నోరు జారి ఓ మాట అంటే అంతకు మించి నేనంటాను ఇంకా ఇక్కడే ఉండకండి వెళ్లండి అంటుంది.. ఛీ అనుకుంటూ రాజ్ వెళ్లిపోతాడు
అదంతా విన్న తల్లిదండ్రులు వచ్చి ఏంటమ్మా ఇది అని అంటే..పెళ్లాన్ని కిరాయిగా రమ్మన్న భర్తకు ఇంతకన్నా సంస్కారంగా సమాధానం చెప్పడం నాకు రాదంటుంది. అక్కడ అపర్ణమాత్రం ఎలాగైనా కోడలిని ఇంటికి తీసుకురావాలనే పట్టుదలతో ఉంటుంది.