నేను బిగ్ బాస్ కి వెళ్లడం లేదు!
గుప్పెడంతమనసు సీరియల్ లో జగతి మేడంగా నటించిన జ్యోతిరాయ్.. ఆ సీరియల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ షో స్టార్ట్ చేసింది
అప్పటివరకూ జగతి మేడంగా..కాలేజీ ప్రిన్సిపాల్ గా చాలా హుందాగా కనిపించిన జ్యోతిరాయ్ ని ఒక్కసారిగా చిట్టిపొట్టి దుస్తుల్లో చూసి ఫ్యాన్స్ అవాక్కయ్యారు.. సంప్రదాయ అభిమానులు హర్ట్ అయ్యారు..
సోషల్ మీడియాలో నిత్యం జ్యోతిరాయ్ గ్లామర్ షో కొనసాగుతూనే ఉంది. ట్రెడిషనల్, ట్రెండీ..ఏ డ్రెస్ వేసినా మేడం మేడం అంతే..
ఈ మధ్య బిగ్ బాస్ రియాల్టీ స్టార్ట్ కావడంతో ఆమె...హౌస్ లో ఓ కంటెస్టెంట్ గా అడుగుపెడుతుందనే వార్త హల్ చల్ చేసింది... దానిపై క్లారిటీ ఇచ్చేసింది జ్యోతిరాయ్..
తాను తెలుగు బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్...ఎందులోనూ పార్టిసిపేట్ చేయడం లేదని చెప్పేసింది జ్యోతిరాయ్
2025 లో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని చెప్పిన జ్యోతిరాయ్ మరికొన్ని ఆఫర్లతో బిజీగా ఉన్నానని చెప్పింది
ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని...ఎలాంటి రియాల్టీ షోస్, గేమ్ షోల్ లో పార్టిసిపేట్ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది..
మొత్తానికి స్మాల్ స్క్రీన్ పై డిగ్నిఫైడ్ గా వెలిగిన జగతిమేడం...సిల్వర్ స్క్రీన్ పై హాట్ షో తో ప్రేక్షకుల మతిపోగొట్టేందుకు సిద్ధమవుతోంది...