టీవీ స్టార్స్, యాంకర్స్ @ గణేష్ చతుర్థి

Published by: Satya Pulagam

ట్రెడిషనల్ లుక్కులో స్రవంతి

యాంకర్ స్రవంతి చొక్కారపు వినాయక చవితి లుక్ హైలైట్. ట్రెడిషనల్ శారీలో సంప్రదాయబద్ధంగా పూజ చేశారు. 

వినాయకునితో మంజూష సెల్ఫీ

గణేష్ చతుర్థి నాడు చవితి పూజ తర్వాత మంజూష వినాయకునితో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ప్రసాదాలు ఆరగిస్తున్న అనసూయ

అనసూయ ఇంట్లో వినాయక చవితి పూజ తర్వాత ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆవిడ ప్రసాదాలు ఆరగిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

యాంకర్ శ్యామల గణేషుడిని చూశారా?

వినాయక చవితి నాడు చేతిలో గణేశుడితో యాంకర్ శ్యామల ఈ విధంగా ఫోజులు ఇచ్చారు.

ఈటీవీలో రష్మీ గౌతమ్ సందడి

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఈటీవీలో ప్రసారమైన 'జై జై గణేశా'లో సందడి చేశారు. ట్రెడిషనల్ లుక్కులో అభిమానుల్ని ఆకట్టుకున్నారు.

మైసూరులో రీతూ చౌదరి

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్ వంటి షోలు చేసిన రీతూ చౌదరి వినాయక చవితికి కర్ణాటక వెళ్లారు. మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు.

టీవీ షోలో శ్రీముఖి

శ్రీముఖి ఇంట పూజ ఎలా జరిగింది అనేది పక్కన పెడితే... వినాయక చవితికి స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆవిడ యాంకరింగ్ చేసి సందడి చేశారు. ఆ ప్రోగ్రాంకు ఈ డ్రస్ లో అటెండ్ అయ్యారు.