నీ ఈగో తగలెయ్యా.. భార్యని ఇలా పిలుస్తారా!
దుగ్గిరాలవారింటి పెద్దల ఆదేశం మేరకు రాజ్ ఎట్టకేలకు కావ్యను తీసుకెళ్లేందుకు అత్తారింటికి వెళతాడు. బొమ్మలకు రంగులేసుకుంటున్న కావ్య రాజ్ ను పట్టించుకోపోవడంతో..ఎప్పటిలా సెటైర్స్ వేస్తాడు...
ఏం కావాలని కావ్య అడిగితే..మా ఇల్లు చీకటిగా ఉందట నువ్వొచ్చి దీపం పెట్టాలట అని వ్యంగ్యంగా మాట్లాడుతాడు. అందుకు వేరేవారిని చూసుకోండని ఇచ్చిపడేస్తుంది కావ్య...
నువ్ కోరుకున్నట్టే వచ్చానుకదా..నీ కాళ్లు పట్టుకుని బతిమలాడుకుంటున్నా..ఇంటికి రా అని అడిగేందుకు వచ్చానని మరోసారి క్లారిటీ ఇస్తాడు రాజ్
మీ అమ్మ చెబితే వచ్చారా, నానమ్మ తాతయ్య చెబితే వచ్చారా అన్న ప్రశ్నకు సమాధానంగా..ఎందుకో అందుకు వచ్చి చచ్చానుగా రా అంటాడు రాజ్..చచ్చే వచ్చాను మళ్లీ వచ్చి చచ్చేంచ ఓపిక లేదంటుంది
నువ్వు రాకపోతే మా దుగ్గిరాలవారింటి పరువు ఏం కావాలి? నీ కాళ్లు పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వెటకారంగా మాట్లాడిన రాజ్ తో.. మీరు తప్పు చేశారని ఒప్పుకోవడం లేదన్నమాట అని నిలదీస్తుంది
నా బదులు ఈ బొమ్మను ఇస్తాను..మీరు ఏం అన్నా పడుతుంది..కాళ్లు విరగ్గొట్టి లోపల కూర్చోబెట్టినా ఏమీ మాట్లాడదు తీసుకెళ్లండన్న కావ్య మాటలకు రాజ్ లో ఈగో మరింత పెరుగుతుంది
నేను వచ్చి అడుక్కున్నా నువ్వు ఇలానే చెబుతావని తెలుసు అని రాజ్ అంటే..దయచేసి మీ విజ్ఞాన ప్రదర్శన ఆపి దయచేయండని చెప్పేస్తుంది
ఇంటికెళ్లి ఏం చెప్పమంటావ్ అని రాజ్ అడిగితే..మీకు దమ్ముంటే ఇక్కడ ఏం మాట్లాడారో అదే చెప్పండి అంటుంది కావ్య...ఫోన్ ఇస్తాను మా అమ్మకు నువ్వు రావట్లేదని చెప్పు అంటే నాకు అవసరం లేదనేస్తుంది
వాట్ టు డు వాట్ నాట్ డు....నాకు ఫుల్ క్లారిటీ ఉందన్న కావ్యతో నీకెందుకే ఇంత పొగరు అంటాడు రాజ్. హోల్డ్ యువర్ టంగ్.. రావే పోవే అంటే పడడానికి నేనిప్పుడు నీ పెళ్లాన్ని కాదంటుంది
ఏం సంబంధం లేదా అని రాజ్ షాక్ అయితే..అది చెప్పింది మీరే మహానుభావా అని క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తే ఇంటికొస్తావ్ అన్న రాజ్ తో తల్లకిందులా తపస్సు చేసినా రాను అనేస్తుంది..
నువ్వు మా ఇంట్లో కోడలిగా నటించేందుకు ఎంత కావాలని డబ్బు ఆఫర్ చేశాడు రాజ్.. కావ్యకు బాగా కాలింది... ఇది బ్రహ్మముడి సెప్టెంబరు 19 ఎపిసోడ్ లో...