‘బ్రహ్మముడి’ సెప్టెంబరు 21

పెద్ద స్కెచ్ వేసిన అనామిక - రాజ్ కి పోటీగా రంగంలోకి కావ్య!

Published by: RAMA

బ్రహ్మముడి

కావ్య లేకపోవడంతో ఇంటిల్లిపాది మంచి భోజనం లేదనుకుంటారు..ఆ ఆలోచనకు చెక్ పెట్టేందుకు పని మనిషికి ప్రమోషన్ ఇస్తాడు రాజ్. ఆమెను వంటచేయమంటాడు...ఇంట్లో అందరూ భయపడిపోతారు..

బ్రహ్మముడి

శాంత చేసిన వంట తినేందుకు ఎవ్వరూ ఉత్సాహం చూపించరు..మాకొద్దంటే మాకొద్దంటారు. తేరగా తినేందుకు వీళ్లద్దరూ ఉన్నారంటూ రుద్రాణి, రాహుల్ పై స్వప్న సెటైర్ వేస్తుంది

బ్రహ్మముడి

అందరకీ ఎందుకు..ఎవరు నిన్ను వంట చేయమని చెప్పారో తనకే వడ్డించు అంటుంది అపర్ణ. రాజ్ మాత్రం చాలా నమ్మకంగా తినేందుకు సిద్ధమవుతాడు...కానీ నోట్లో ముద్ద పెట్టుకోగానే అవాక్కవుతాడు

బ్రహ్మముడి

అప్పుడు అంతబాగా వంట చేసింది కదా అంటే..అప్పుడు నీ భార్య కళావతి వంటచేసింది..నువ్వు తినవని చెప్పి శాంత చేసిందని క్లారిటీ ఇస్తుంది అపర్ణ...

బ్రహ్మముడి

కావ్యను తీసుకొచ్చేందుకు నీకు ఎక్కవ టైమ్ ఇవ్వడం లేదు..అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నీకు ఇప్పుడు తెలియదు అని రాజ్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అపర్ణ..

బ్రహ్మముడి

బొమ్మల తయారీలో తండ్రికి సహాయం చేసేందుకు సిద్ధమవుతుంది కావ్య...అత్తింట్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడ మట్టి పనులు చేయడం ఏంటని కావ్యపై తల్లి కనకం కోప్పడుతుంది..

బ్రహ్మముడి

కంపెనీలోకి ఎంటరవుతున్న సామంత్ - అనామికను చూసి ఉద్యోగులు గుసగుసలాడుకుంటారు. అక్కడ మొగుడిని రోడ్డున పడేసింది.. ఇప్పుడు మన బాస్ ని రోడ్డున పడేస్తుందా అనుకుంటారు..

బ్రహ్మముడి

కాలేజీలో ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా పట్టించుకోలేదు..ఇప్పుడు నా నువ్వు నా చాంబర్లో ఉంటే నమ్మలేకపోతున్నా మిరాకిల్ లా ఉందంటాడు సామంత్. ఇద్దరం కలిస్తే వ్యాపారంలో చాలా మిరాకిల్స్ చేయొచ్చంటుంది అనామిక

బ్రహ్మముడి

వందేళ్ల కంపెనీని పడగొట్టడం అంత తేలిక కాదని సామంత్ అంటాడు. కావ్య అత్తింటినుంచి వచ్చేసి పుట్టింట్లో ఉంది..ఉద్యోగం కోసం వెతుక్కుంటోంది. గతంలో కావ్య డిజైన్లు అమ్మిపెట్టిన వ్యక్తితో మనం మాట్లాడితే ఆ డిజైన్లు మనకే వస్తాయని క్లారిటీ ఇస్తుంది అనామిక

బ్రహ్మముడి

సెప్టెంబరు 23 సోమవారం ఎపిసోడ్ లో... సైకిల్ పై వెళుతున్న కావ్యను చూసుకోకుండా కారుతో గుద్దేస్తాడు... కింద పడిన తనని లేపుదామని వెళ్లి కావ్యను చూసి ఆగిపోతాడు...కావ్య కూడా రాజ్ ను చూసి షాక్ అవుతుంది.