రాజ్ vs కావ్య..ఆట మొదలైంది
దుగ్గిరాల వారింటికి వచ్చిన సీతారామయ్య ఫ్రెండ్..తన మనవడు స్వరాజ్ కంపెనీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని సామంత్ తో చేయికలిపాడని చెబుతాడు. రాహుల్ అవమానించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని క్లారిటీ ఇస్తాడు
ఎన్నోసార్లు మెయిల్ చేసినా, కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు..అందుకే నేరుగా కలిసేందుకు వచ్చనానని చెబుతాడు. కావాల్సిన డిజైన్స్ పంపించిన తర్వాత కలవడం ఎందుకని రాహుల్ రూడ్ గా మాట్లాడాడు అని చెబుతాడు
నువ్విచ్చే డబ్బులకు మేం ఇస్తున్న డిజైన్లు చాలా ఎక్కువ అన్న రాహుల్..నచ్చితే తీసుకో లేదంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకో అన్నాడని అందుకే తన మనవడు శ్రీకాంత్...మీ కంపెనీతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడని చెబుతాడు
రాజ్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని శ్రీకాంత్ అన్నప్పటికీ..ఇక్కడ అన్నీ నేనే గెటౌట్ అన్నాడని అవమానిస్తాడు రాహుల్. ఇదేంటని తాతయ్య, సుభాష్ నిలదీస్తే..రాహుల్ కవర్ చేయాలని చూస్తాడు
నిన్ను నమ్మి చేతిలో కంపెనీ పెడితే ఇలాగా చేసేది..నీవల్ల ఎంత నష్టం జరిగిందో అర్థమవుతోందా అంటూ డ్రామా క్రియేట్ చేస్తుంది రుద్రాణి. నీ డ్రామాలు ఆపు రుద్రాణి అని ఫైర్ అవుతుంది ఇందిరాదేవి.
రాజ్ ని కంపెనీకి వెళ్లమని ఇంట్లో అందరూ అంటే..పిన్ని చెబితే కానీ వెళ్లనంటాడు రాజ్. తన కొడుకును ఇంటికి తీసుకురావాలన్నది నా కోరిక.. నా కొడుక్కి న్యాయం జరగాలి. రాజ్ కంపెనీకి వెళ్లడంలో నాకేం అభ్యంతరం లేదంటుది ధాన్యలక్ష్మి.
రాజ్ కంపెనీకి వెళుతున్న విషయం కనకానికి తెలియడంతో సంతోషంగా భర్తకి, కావ్యకి చెబుతుంది.. కానీ కావ్య సెటైర్స్ వేసేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది
అందరి ముందూ తిట్టినందుకు రాహుల్ కి సారీ చెబుతుంది రుద్రాణి. వాళ్ల నక్కజిత్తుల మాటలు విని ఎంట్రీ ఇచ్చిన స్వప్న.. రాహుల్ ని ఏకిపడేస్తుంది. కనకం సింహాసనంపై కుక్కను కూర్చోబెడితే అదే బుద్ధి చూపించినట్లు నీ బుద్ధి చూపించావ్ అంటుంది స్వప్న.
నువ్వు రాత్రి పగలు చదివేసి పోలీస్ అయిపోతే గర్వంగా చెప్పుకుంటా అంటాడు కళ్యాణ్... ఇంకా చదవలేదు అప్పుడే కలలు కంటున్నావా అంటుంది అప్పు. కోచింగ్ సెంటర్లో జాయిన్ అవమని కళ్యాణ్ అంటే..డబ్బులు కట్టలేం అంటుంది అప్పు... ఎపిసోడ్ ముగిసింది..
సెప్టెంబరు 27 ఎపిసోడ్ లో కావ్య - రాజ్ ఇద్దరూ గుడిలో కలుసుకుంటారు.. రాజ్ ఆఫీసుకి వెళుతుంటే.. కావ్య మొదటిరోజు ఉద్యోగానికి వెళుతోందన్నమాట... ఇకపై మొదలవుతుంది మరో ఆట...