‘బ్రహ్మముడి’ సీరియల్‌ సెప్టెంబరు 25 ఎపిసోడ్

అనామిక కంపెనీలో చేరిన కావ్య..పెద్ద స్కెచ్చే వేసిన రుద్రాణి!

Published by: RAMA

‘బ్రహ్మముడి’

వినాయక పూజ జరిగిన తర్వాత వచ్చిన కనకాన్ని అవమానిస్తుంది రుద్రాణి. అడ్డుపడిన అపర్ణతో..వదిలేయండి వదినా పట్టించుకోవద్దు అంటుంది కనకం

‘బ్రహ్మముడి’

కనకాన్ని అవమానిస్తుంటే చూసి రాజ్, స్వప్న ఇద్దరూ రియాక్టవుతారు..రుద్రాణికి ఇచ్చిపడేస్తారు. స్పందించిన కనకం నేను వదినగారిని పలకరించేందుకు వచ్చాను..మీరు ఎవర్నీ పట్టించుకోకండి ..భగవంతుడు అందర్నీ చల్లగా చూస్తాడు అంటుంది కనకం

‘బ్రహ్మముడి’

అయినా ఏ మొహం పెట్టుకుని వచ్చావంటూ రుద్రాణి రెచ్చిపోతుంది. అపర్ణ, సుభాష్ చెప్పినా రుద్రాణి విననే వినదు. కూతుర్ని కాపురానికి పంపించాలని వచ్చిందంటూ అభాండాలు వేస్తుంది..ధాన్యలక్ష్మి కూడా వంతపాడుతుంది

‘బ్రహ్మముడి’

నేను ఏ ఉద్దేశంతోనూ రాలేదు..కేవలం మా వదినను పలకరించేందుకే వచ్చాను. నా చిన్న కూతురు ధాన్యలక్ష్మి రమ్మన్నా రాదు.. నా పెద్ద కూతురు రుద్రాణి పొమ్మన్నా పోదు..కావ్య సంగతి ఆ వినాయకుడే చూసుకుంటాడు అని క్లారిటీ ఇస్తుంది

‘బ్రహ్మముడి’

కావ్య డిజైన్లు అమ్మిపెట్టే వ్యక్తితో మాట్లాడిన అనామిక...కావ్యకు తెలియకుండా ఆ డిజైన్లు కావాలని అంటుంది. అదే కంపెనీకి కావ్య ఇంటర్యూకి వస్తుంది.

‘బ్రహ్మముడి’

సందీప్..కావ్యను ఆ కంపెనీ మేనేజర్ కి పరిచయం చేస్తాడు..కావ్యకు జాబ్ ఇస్తామంటారు.. అనామిక సంబరపడుతుంది. కావ్య ఇంటికెళ్లి ఉద్యోగం వచ్చిందని చెబుతుంది.

‘బ్రహ్మముడి’

నువ్వు పుట్టింట్లో ఉండడం నాకు ఇష్టం లేదు.. మగాడికి అహంకారం..ఆడదానికి ఆత్మాభిమానం ఉంటుంది.. కానీ వారిద్దరి మధ్య బంధం ఉంటుందని క్లాస్ వేస్తుంది. మీకు భారంగా అనిపిస్తే వెళ్లిపోతానంటుంది కావ్య

‘బ్రహ్మముడి’

స్వతంత్రంగా బతకాలి అనుకుంటే అత్తింటికి దూరమైపోతావ్..ఆ ఇంట్లో ఒకరిద్దరు తప్ప అందరూ నువ్వు రావాలని కోరుకుంటున్నారంటుంది కావ్య. ఆయన రావాలని కోరుకుంటాడనే నమ్మకం నాకులేదు అంటుంది కావ్య

‘బ్రహ్మముడి’

సీతారామయ్య ఫ్రెండ్ దుగ్గిరాలవారింటికి వస్తాడు.. నా మనవడు మొన్నటివరకూ నీ మనవడు రాజ్ తో కలసి బిజినెస్ చేశాడు కదా. ఇప్పుడు అది క్యాన్సిల్ చేసుకుని సామంత్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చాడని చెబుతాడు. రాజ్ షాక్ అవుతాడు..