Trinayani Serial Today May 3rd: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాప వేసుకున్న చున్నీతో పోలీస్ ప్రాణాలు కాపాడిన పెద్దబొట్టమ్మ.. విశాల్ దొరికిపోతాడా!
Trinayani Serial Today Episode : పోలీస్ చంద్రశేఖర్‌ని కాటేసిన పెద్దబొట్టమ్మ గాయత్రీ దేవి వస్త్రం ఉపయోగించి అతడి ప్రాణాలు కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode : పెద్దబొట్టమ్మ కళ్లలో సుమన కారం కొడుతుంది. దీంతో పెద్దబొట్టమ్మ కోపంతో పోలీసు చంద్ర శేఖర్‌ను కాటేసి వెళ్లిపోతుంది. పెద్దబొట్టమ్మే వచ్చి విషం పీల్చితేనే పోలీసు బతుకుతాడన్న నయని ఉలూచి పాపని ఎత్తుకొని వెళ్లి పెద్దబొట్టమ్మని పిలుస్తుంది. నయని ఉలూచిని పెద్దబొట్టమ్మ చేతిలో పెడుతుంది. పెద్దబొట్టమ్మ థ్యాంక్స్ చెప్పడంతో పోలీసు చంద్రశేఖర్‌ని కాపాడమని అంటుంది. దీంతో చూడలేను ఎలా కాపాడగలనని పెద్దబొట్టమ్మ అంటే నేను తీసుకెళ్తానని నయని పెద్దబొట్టమ్మని నడిపిస్తుంది. మరోవైపు పోలీసుని పట్టుకొని అందరూ టెన్షన్ పడుతుంటారు.
నయని: రా పెద్దబొట్టమ్మ, చూడు నీకు ఏ హాని తల పెట్టని పోలీసన్నని కాటేశావు.
పెద్దబొట్టమ్మ: క్షమించయ్యా నా కళ్లలో కార కొట్టిందన్న కోపంతో ఆ సుమనను కాటేద్దాం అనుకున్నా మిమల్ని అడ్డుపెట్టి తను తప్పించుకుంది.
సుమన: ఎలా ఉంది గుంటూరు కారం.
విక్రాంత్: పెద్దబొట్టమ్మ విషం పీల్చి పడేయ్.
తిలోత్తమ: కళ్లలో కారం పడి విలవిల్లాడుతుంది. ఎలా పీల్చుతుంది.
పెద్దబొట్టమ్మ: పీల్చుతానమ్మా.. గాయత్రీ దేవి వస్త్రం కావాలి.
హాసిని: చీరనా నేనే తీసుకొస్తా ఉండు.
పెద్దబొట్టమ్మ: లేదు హాసిని నేనే వెళ్లాలి. అది చీరనా ఇంకేమైనా పర్లేదు అది గాయత్రీ అమ్మ తలను తాకి ఉండాలి. అప్పుడే తలకెక్కిన విషాన్ని కూడా లాగేయగలను. నాకు ఎవరి సాయం అక్కర్లేదు తీసుకొస్తాను. తలను తాకిన వస్త్రం ఉంటే చాలు వాసన పసిగట్టి తీసుకొస్తా.
విశాల్: తలను తాకిన వస్త్రం అంటే ఏం తీసుకొస్తుంది.
పెద్దబొట్టమ్మ లోపలికి వెళ్లి గాయత్రీ పాపకు గోపికమ్మలా చుట్టిన చున్నీని తీసుకొని వస్తుంది. విశాల్, హాసినిలు షాక్ అయిపోతారు. చున్నీ గురించి వల్లభ ప్రశ్నించడంతో విశాల్ అడ్డుకుంటాడు. ఇక పెద్దబొట్టమ్మ ఆ చున్నీని పోలీస్ తలకు కడుతుంది. పెద్దబొట్టమ్మ పాముగా మారుతుంది. దీంతో నయని పాముని పోలీస్‌ని కాటేసిన చోటుకి తీసుకెళ్లడంతో పాముగా ఉన్న పెద్దబొట్టమ్మ విషం పీల్చేస్తుంది. ఇక నయని విక్రాంత్ వాళ్లు పోలీస్ ముఖం మీద ఉన్న చున్నీని తీసేస్తారు. పోలీస్ బతకడంతో అందరూ సంతోషిస్తారు.
పోలీస్: నయనమ్మా ఒక్కసారి ఆ వస్త్రం ఇవ్వమ్మా. విశాల్ గారు ఇది మీ అమ్మ గారి తల మీద ఉంచుకున్న వస్త్రం అన్నారు. ఆ తల్లి ఎంత గొప్ప భక్తురాలో దీన్ని నా తలమీద ఉంచినప్పుడు అర్థమైంది. మళ్లీ ముడి విప్పి తీసేంత వరకు నాకు గాయత్రీ మంత్రం వినిపిస్తూనే ఉంది. నిజం ఇంత అనుభూతిని నేను ఎప్పుడూ పొందలేదు.
వల్లభ: ఈ వస్త్రం గాయత్రీ పెద్దమ్మదే అన్న గ్యారెంటీ ఏంటి.
పోలీస్: పెద్దబొట్టమ్మ చెప్పింది కదా.
వల్లభ: ఒక్కసారి దాన్ని తెరచిపట్టుకోండి. మమ్మీ చిన్నపిల్లల చున్నీలా ఉంది అది. ఇంత చిన్న సైజు ఉన్నదాన్ని పెద్దమ్మ వాడుతుందా.
తిలోత్తమ: కరెక్టేరా నాకు ఆ ఆలోచన రాలేదు.
సుమన: నాకు గుర్తొచ్చింది. నిన్న గాయత్రీ అత్తయ్య పసిపిల్ల ఛాయ కనిపించింది కదా అప్పుడు ఇలాంటి చున్నీనే వేసుకుంది.
హాసిని: చిట్టీ సమయం సందర్భం లేకుండా మాట్లాడకు. పోలీసన్న బతికారు కదా దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటారు సార్..
పోలీస్: నేను అయితే ఈ చున్నీ వల్లే బతికాను. ఆ తల్లి దీన్ని ఎప్పుడు వాడిందో కానీ నన్ను బతికించడానికి ఉపయోగించి మీరు మంచి పని చేశారు.
తిలోత్తమ: అది సరే నయని కానీ ఈ చున్నీ ఇక్కడ ఎందుకు ఉంది.
విక్రాంత్: పెద్ద బొట్టమ్మ కూడా ఇది గాయత్రీ పెద్దమ్మ తలకు పెట్టకున్నారు అంది అంటే సంథింగ్ రాంగ్.
పోలీస్: ఇది ఈ ఇంట్లో దొరికింది అంటే ఆ చిన్న పిల్ల కూడా ఇక్కడే ఉండాలి. నీడ పడింది అంటే కచ్చితంగా పాప ఉంటుంది. చర్య లేకుండా ప్రతి చర్య ఉండదు. బింబం లేకుండా ప్రతిబింబం లేనట్లే ఇది కూడా.
వల్లభ: అంటే గాయత్రీ పెద్దమ్మ పసిబిడ్డగా ఉండి ఈ చున్నీ వేసుకొని వచ్చిందని అంటారు కదా.
మాటల మధ్యలోనే విశాల్, హాసినిలు పోలీస్ చంద్ర శేఖర్‌ని డ్రాప్ చేసేస్తారు. ఇక సుమన తనని పాము కాటేయడానికి వస్తే తనని కాపాడలేదని విక్రాంత్‌ని అంటుంది. దీంతో విక్రాంత్, హాసినిలు సుమనను తిడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.