(Source: ECI/ABP News/ABP Majha)
Trinayani Serial Today January 1st Episode - నిజం చెప్పేసిన జీవం.. విశాలాక్షిని లోయలోకి విసిరేసిన తల్లీకొడుకులు!
Trinayani Today Episode జీవం నయనికి నిజం చెప్పినప్పటికీ అది అబద్ధం అని హాసిని చెప్పడం దానికి ఎద్దు సాక్ష్యం కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Telugu Serial Today Episode
విశాలాక్షి నోరు నొక్కేసి ఆమె కాళ్లు చేతులు పట్టుకొని తిలోత్తమ, వల్లభ అడవి వైపు తీసుకెళ్తుంటారు. అది చూసిన ఎద్దులయ్య.. ఏంటి విశాలాక్షమ్మ ఇలా చేశావ్ వాళ్లు ఏం చేసినా అడ్డుకోవద్దు అని నా చేతులు నోరు నొక్కేశావని బాధ పడతాడు. మరోవైపు సుమన జీవానికి నిజం చెప్పమని అడుగుతుంది.
జీవం: మాటిచ్చా కదా చెప్తాను సార్.. నేను చచ్చిపోతే నా పెళ్లం పిల్లల్ని మంచిగా చూసుకుంటారు కదా..
నయని: నీకేం కాదు అన్నా నేను ఉన్నా కదా..
మరోవైపు విశాల్, హాసిని జీవం ఎక్కడ నిజం చెప్పేస్తాడా అని చాలా టెన్షన్ పడుతుంటారు. అక్కడికి విశాలాక్షి వస్తుంది.(దేవత కాబట్టి రెండు చోట్ల ప్రత్యక్షమవుతుంది.) ఎద్దులయ్య వచ్చి అమ్మా ఇక్కడ ఉన్నావా అక్కడ ఉన్నది ఎవరు అని అడిగితే అక్కడున్నది నేనే అంటుంది విశాలాక్షి. ఇక విశాలాక్షి విశాల్‌ని నయని వాళ్ల దగ్గరకు తీసుకెళ్తుంది. మరోవైపు తిలోత్తమ, వల్లభలు విశాలాక్షిని లోయలోకి విసిరేస్తారు.
జీవం: విశాల్‌ను చూస్తూ.. చెప్తాను సారూ.. చెప్పేస్తా మేడం..
హాసిని: ఇంకేం చేస్తాం..
జీవం: చెప్పడం కంటే మీ కూతురు ఎక్కడ ఉందో చూపిస్తాను అమ్మా.. మరోవైపు విశాలాక్షి అచ్చం గాయత్రీ పాపలానే మారి గాయత్రి పాప పక్కనే నిల్చొంటుంది. ఇక జీవం తన చేతిని గాయత్రీ పాప వైపు చూపించి తనే నయని బిడ్డ అని చెప్తాడు. నయనితో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఇక నయని గాయత్రీ పాపను గుండెలకు హత్తుకుంటాడు. ఇక తిలోత్తమ, వల్లభలు అక్కడికి వస్తే సుమన వాళ్లకు గాయత్రీ పాపే గాయత్రి అత్తయ్య అని చెప్తుంది.
విశాలాక్షి: ఎద్దులయ్య.. నన్ను లోయలో పడేసి నా ప్రాణాలు తీశామన్న భ్రమలో తిలోత్తమ వాళ్లు ఉన్నారు. అలాగే ఉండని.. నేను ఇంటికి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి వాళ్ల ఆట కట్టిస్తాను.
ఎద్దులయ్య: అలాగే తల్లీ.. గాయత్రీ పాపని విశాల్ ఎత్తుకున్నప్పుడే మీరు గాయత్రీ పాపలా మారి అతను అసలైన గాయత్రీని కాకుండా మిమల్ని చూపించడం వల్ల అతని ప్రాణాలు పోలేదు. పైగా అతడు నిజం చెప్పినట్లు కూడా అయింది.
విశాలాక్షి: శరణు కోరిన వారిని కాపాడాలి కదా ఎద్దులయ్య.. వెళ్లు నందిగా వెళ్లి వాళ్లు అడిగిన ప్రశ్నలకు తల అడ్డంగా ఊపు నాటకం యథావిధిగా సాగుతుంది. త్వరగా వెళ్లు తిలోత్తమ వాళ్లు వచ్చారు అందరి ధ్యాస మార్చాలి నువ్వు.
నయని: నా బిడ్డ గాయత్రీనేనా అన్న నిజమే చెప్తున్నావా..
జీవం: నిజమే తల్లి రాఖీ కట్టిన చేయిని నెత్తిన పెట్టుకొని చెప్తున్నా..
హాసిని: శభాష్.. జీవం.. నీ నటన అద్భుతం. అబద్ధాన్ని గొప్పగా చెప్పిన జీవాన్ని మెచ్చుకోవాలి కదా. ఇక విశాల్ ఏంటి వదినా నువ్వు కూడా అలా అంటున్నావ్ అంటే కవర్ చేస్తున్నట్లు విశాల్‌కి సైగ చేస్తుంది హాసిని. దీంతో విశాల్ సైలెంట్ అయిపోతాడు.. అర్థం కాలేదా విశాల్.. ఇంటికి వచ్చిన గురువుగారు ఏమన్నారు.. ముగ్గురుకి గండాలు ఉన్నాయి ఇద్దరు పుటుక్కుమంటారు అన్నారు కదా.. ఎవరు పోయారు. విశాలాక్షి ఏది..
తిలోత్తమ: తనిక్కడే లేదులే నువ్వు ఏం చెప్పాలి అనుకున్నావో అది చెప్పు.
హాసిని: జీవం నిజం చెప్తే రక్తం కక్కుకొని చనిపోతాడు అన్నారే బతికేఉన్నాడు కదా..
సుమన: అంటే నువ్వు పచ్చి అబద్ధాన్నే అందంగా చెప్పావు అని. మా అక్క రాఖీ కడితే నిజం నీ గొంతు నుంచి రాలేక ఈ అనాథ పిల్ల వైపు వేలు చూపించావు.
నయని: జీవం అన్న మాటిచ్చి కూడా ఇలా ఎందుకు చెప్పావ్.
జీవం: లేదమ్మా అప్పుడు దవాఖానాలో నీ బిడ్డను ఎత్తుకెళ్లినప్పుడు ఒక ఎద్దు కూడా వచ్చింది.
హాసిని: ఇప్పుడు కూడా వచ్చింది. (ఎద్దులయ్య ఎద్దు రూపంలో అక్కడికి వస్తారు.) ఇక జీవం తాను పాపను ఎత్తుకెళ్లినప్పుడు ఈ ఎద్దే నన్ను పొడిచి పాపను తీసుకెళ్లింది అని చెప్తాడు. ఆ సీన్ చూపిస్తారు.. ఇక జీవం ఆ ఎద్దుకు నిజం తెలుసు అంటాడు.
నయని: ఒక్క నిమిషం అన్న మనుషుల్ని నమ్మడం కంటే మూగజీవాలను నమ్మడం ఎంతో మేలు.. నందీశా.. ఈ సందిగ్ధం నుంచి నువ్వే బయటపడేయాలి.. ఆ రోజు జీవం ఎత్తుకొచ్చింది ఈ గాయత్రీ నేనా.. చెప్పు నందీశా.. ఇక ఎద్దు కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది.
హాసిని: మనసులో.. విశాలాక్షి అమ్మ తల్లి రక్షించేశావ్.. ఇక ఎద్దు మరోసారి జీవాన్ని తరుముతుంది. దీంతో జీవం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: అలా అనిపించకుండా చేస్తాం అన్నారు - ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్ ఎక్స్‌పీరియన్స్ బయటపెట్టిన తృప్తి