అన్వేషించండి

Triptii Dimri: అలా అనిపించకుండా చేస్తాం అన్నారు - ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్ ఎక్స్‌పీరియన్స్ బయటపెట్టిన తృప్తి

‘యానిమల్’లో జోయా పాత్రలో కనిపించి ప్రేక్షకులను కట్టిపడేసింది జోయా. ఇక ఆ మూవీలో ఇంటిమేట్ సీన్ ఎక్స్‌పీరియన్స్ గురించి తను తాజాగా బయటపెట్టింది.

కొన్ని సినిమాల్లో పాత్రల నిడివి చిన్నగా ఉన్నా.. ఆ పాత్ర చేసిన ఆర్టిస్ట్‌కు మాత్రం మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ‘యానిమల్’ మూవీ వల్ల తృప్తి దిమ్రీకి కూడా విపరీతమైన క్రేజ్ లభించింది. బాలీవుడ్‌లో తను ఒక సెన్సేషన్‌లాగా మారిపోయింది. చాలామంది క్రష్ లిస్ట్‌లో యాడ్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్’కు చాలామంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మూవీలో తృప్తి నటించిన ఇంటిమేట్ సీన్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఆ సీన్‌కు ముందు రణబీర్ తనతో ఏం చెప్పాడో చెప్పుకొచ్చింది.

భాభీ 2 అంటూ ట్యాగ్..
ఇప్పటికీ ‘యానిమల్’ మూవీ థియేటర్లలో విడుదలయ్యి నెలరోజులు అయ్యింది. అయినా ఇంకా ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడడం కోసం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. సినిమాలో కాసేపే సెకండ్ హీరోయిన్‌గా కనిపించిన తృప్తిని ‘భాభీ 2’ అని పిలిచేస్తున్నారు ప్రేక్షకులు. ఇక రణబీర్ కపూర్‌తో తృప్తి చేసిన బోల్డ్ సీన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో కేవలం నలుగురు మాత్రమే రూమ్‌లో ఉన్నారని, తను సౌకర్యంగా ఉందా లేదా అని హీరో, డైరెక్టర్ పదేపదే అడిగారని ఇప్పటికే పలుమార్లు బయటపెట్టింది తృప్తి. ఇక తాజాగా ఈ సీన్ షూటింగ్‌కు ముందు రణబీర్ కపూర్.. తనతో ఏం చెప్పాడని విషయాన్నే రివీల్ చేసింది భాభీ 2.

అలా అనిపించకుండా చేస్తాం..
‘‘తన చుట్టూ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. తను నా ఫేవరెట్ యాక్టర్ అని తనతో మాత్రమే చెప్పాను. సపోర్ట్‌గా ఉండే కో యాక్టర్ ఉంటే చాలా సహాయంగా ఉంటుంది. అలాంటి సీన్స్ చేయాలంటే ముందుగా చాలా సౌకర్యంగా ఉండాలి. నీకు అసౌకర్యంగా అనిపించిన ప్రతీసారి మాకు చెప్పు.. అలా అనిపించకుండా చేస్తాం అని సందీప్, రణబీర్, డీఓపీ చెప్పారు. మనల్ని మనిషిగా గుర్తించి, మన ఆలోచనలకు గౌరవం ఇచ్చే వారి మధ్య ఉండడం చాలా ముఖ్యం. మనం ఆ సందర్భంలో ఏం పని చేస్తున్నాం అనేది మాత్రమే ముఖ్యం. ఇంకేమీ కాదు’’ అంటూ ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది తృప్తి.

వచ్చి వెళ్లిపోతుందని అనుకున్నాను..
‘‘సినిమాలోని మిగతా సీన్స్‌లాగా ఆ సీన్ షూటింగ్ కూడా తేలికగా జరిగిపోయింది. దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ముఖ్యంగా ఆ సీన్‌లో నా సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. అది కథలో భాగమే. మనం కో యాక్టర్లతో, డైరెక్టర్లతో కంఫర్టబుల్‌గా ఉన్నంతవరకు ఇంకేదీ ముఖ్యం కాదు. కానీ కొంతమందికి కంఫర్ట్ ప్రత్యేకంగా కావాల్సి ఉంటుంది. అది మనిషికి, మనిషికి మారుతూ ఉంటుంది. మొదటి రోజు నేను చాలా ఇబ్బందిపడ్డాను. సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్న కానీ జోయాకు ఈవిధంగా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ఇది చిన్న పాత్ర కదా.. వచ్చి వెళ్లిపోతుందిలే అనుకున్నాను. ఇంత ఆదరణ లభిస్తుందని, దీనిని గమనిస్తారని కూడా ఊహించలేదు’’ అంటూ తన సంతోషాన్ని బయటపెట్టింది జోయా అలియాస్ తృప్తి దిమ్రీ.

Also Read: ఊహించని విధంగా ‘బిగ్ బాస్’ శోభాశెట్టి ఎంగేజ్‌మెంట్ - మళ్లీ ఎప్పుడూ రానన్న ప్రియుడు యశ్వంత్

టాప్ హెడ్ లైన్స్

Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
Lenin Trailer: లెనిన్ ట్రైలర్ రివ్యూ... అఖిల్ అక్కినేని విశ్వరూపం... కుమ్మేశాడంతే! 
లెనిన్ ట్రైలర్ రివ్యూ... అఖిల్ అక్కినేని విశ్వరూపం... కుమ్మేశాడంతే!
Akhil Raj Delivery Boy: తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ
తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ
Rahul Ravindran: రాహుల్ రవీంద్రన్ మెడకు కేతన్ - సియా ఘోయల్ మర్డర్ మిస్టరీ... ట్విట్టర్‌కు టాటా
రాహుల్ రవీంద్రన్ మెడకు కేతన్ - సియా ఘోయల్ మర్డర్ మిస్టరీ... ట్విట్టర్‌కు టాటా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget