Trinayani Serial Today November 9th: ‘త్రినయని’ సీరియల్: ఐసీయూలో సీరియస్ కండీషన్ లో నయని – తన వల్లే యాక్సిండెంట్ జరిగిందన్న విశాల్
trinayani Today Episode: ఎలా జరిగిందని విక్రాంత్ అడగ్గానే నా వల్లే యాక్సిడెంట్ జరిగిందని విశాల్ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
trinayani Serial Today Episode: ఐసీయూలో నయనికి డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటారు. విశాల్ బయటి నుంచి చూస్తూ ఏడుస్తుంటాడు. విక్రాంత్, హాసిని ఏడుస్తూ పరుగెత్తుకొస్తారు. సుమన మామూలుగా వస్తుంది. మనం కూడా పరుగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్లకపోతే ఫీలవుతారేమో మమ్మీ అని వల్లభ అంటాడు. ఇప్పుడు అంత లేదులే కానీ నువ్వు కామ్ గా ఉండు అని తిలొత్తమ్మ చెప్తుంది. దగ్గరకు వెళ్లిన విక్రాంత్, హాసిని బాధపడుతుంటే వాళ్లను బాధపడొద్దని చెప్తాడు విశాల్.
విక్రాంత్: అసలు ఎలా జరిగింది బ్రో..
విశాల్: ఇదంతా నావల్లే జరిగింది. నేనే నయనిని దేవీపురంలో సెంటర్‌కు రమ్మన్నాను అక్కడ ఏదో వెహికిల్ గుద్ది వెళ్లిపోయింది. ఒక్క నిమిషంలో ఇదంతా జరిగిపోయింది.
వల్లభ: గారడీ పాప విశాలాక్షి ఆరోజే చెప్పింది. విశాల్ వల్లే పెద్దమరదలుకు ప్రాణగండం వస్తుందని.
సుమన: అసలు మా అక్క సరిగ్గా చూడలేకపోయింది. మా ఆయనే ఊరికే అవన్నీ పట్టుకొచ్చి హడావిడి చేశాడు.
హాసిని: పాపం విక్రాంత్‌ను అలా బలి చేయోద్దు చెల్లి.
సుమన: మీరు అలా అనకండి మా ఆయన ఆ గుడి అడ్రస్ తీసుకురాకుండా ఉండి ఉంటే ఇదంతా జరిగేదే కాదు.
విశాల్: అలా అనకు సుమన
విక్రాంత్: పర్లేదు బ్రో సుమన అన్న దాంట్లో తప్పేం లేదు. వదినకు ఇలా అవ్వడానికి నేను కూడా కారణం అనిపిస్తుంది. ఆ పాపం నాకే తగలాలి. నాకేదైనా జరిగితే నా అయుష్షు కూడా వదినకే ఇవ్వాలని కోరుకుంటాను.
తిలొత్తమ్మ: పిచ్చి మాటలు మాట్లాడకురా..? మనం ఏదేదో అనుకుంటే సరిపోతుందా..?
అసలు డాక్టర్లు ఏం చెప్పారు అని వల్లభ అడుగుతాడు. ఇంకా ఐసీయూలోంచి బయటకు రాలేదని విక్రాంత్ చెప్తాడు. అప్పుడే ఊర్లో స్పృహ కోల్పోయిన తన బామ్మను తీసుకుని హాస్పిటల్ వస్తుంది త్రినేత్రి
విక్రాంత్: వదినను వేరే హాస్పిటల్ కు ఏమైనా తీసుకెళ్దామా..? బ్రో
విశాల్: ఏమీ వద్దు ఇక్కడ మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు కాబట్టి బెటర్ ట్రీట్‌మెంట్ ఇక్కడే ఉంటుంది.
తిలొత్తమ్మ: ఇప్పుడు విశాలాక్ష్మి అమ్మవారి మీద భారం వేయడం తప్పా మరో దారి లేదు మనకు
వల్లభ: ఈ టైంలో ఎక్కడికి వెళ్లుంది మా మమ్మీ.. నువ్వు ఇలా పక్కకు వస్తే వాళ్లు ఏమనుకుంటారు మమ్మీ..
తిలొత్తమ్మ: ఇప్పుడు ఎవ్వరూ ఎవరి గురించి ఏమీ అనుకోవడానికి లేదు వల్లభ.
వల్లభ: మనం కారు బ్రేకులు ఫెయిల్ చేశామని మన మీద ఎవరికీ అనుమానం రాలేదంటావా..? మమ్మీ.
తిలొత్తమ్మ: నయనికి యాక్సిడెంట్ అయింది. వేరే వెహికిల్ వల్ల. అప్పుడు మన మీద ఎందుకు అనుమానం వస్తుంది. రేపే మాపో ఆ కారు బ్రేకులు ఫెయిల్ అవ్వొచ్చు కాబట్టి అవి బాగు చేయించడం మంచిది.
హాసిని వాళ్ల దగ్గరకు వస్తుంది. యాక్సిడెంట్ మీరే చేయించారా అని అనుమానంగా అడుగుతుంది. దీంతో వల్లభ ఏదో బ్రేకులు ఫెయిల్ అయి యాక్సిడెంట్ అయినట్టు అడుగుతావేంటి అంటాడు. దీంతో వల్లభను తిలొత్తమ్మ తిడుతుంది. హాసిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. స్పృహ కోల్పోయిన త్రినేత్రి వాళ్ల బామ్మ స్పృహలోకి వస్తుంది.
బామ్మ: నేను ఎక్కడున్నాను.
త్రినేత్రి: పట్నం హాస్పిటల్ లో ఉన్నావు బామ్మ.
బామ్మ: నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు..?
త్రినేత్రి: తీసుకురాకుంటే నిజంగానే చచ్చిపోయేదానివే బామ్మ.
బామ్మ: నేనెందుకు చస్తానే.. నీ పెళ్లి చూడనిదే నా ప్రాణాలు తీసుకెళ్లడానికి స్వర్గంలో ఉన్న నా మొగుడు రాడు. నరకంలో ఉన్న ఆ యముడు రాడు.
అంటూ వెటకారంగా మాట్లాడుతూ డాక్టర్ ను తిడుతుంది బామ్మ. మరోవైపు సుమన సిస్టర్ దగ్గరకు వెళ్లి త్రినయని బతికే చాన్స్ ఉందా? అని అడుగుతుంది. అదంతా నాకు తెలియదని వెళ్లిపోతుంది సిస్టర్. సుమన మాటలు విన్న విక్రాంత్ వెళ్లి సుమనను తిడతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!