Trinayani Serial Today December 22nd Episode - 'త్రినయని' సీరియల్: ఫలించిన కోరలమ్మ పూజలు, గాయత్రీ పాప వల్ల తిలోత్తమకు గండం తప్పదా!
Trinayani Today Episode కోరలమ్మకు పూజచేసి ఇంట్లో ఎవరికి అపమృత్యు గండం ఉందో తెలుసుకోవాలని నయని కుటుంబం ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Telugu Serial Today Episode : నయని, హాసినిలు హాల్‌లో పూజకు సిద్ధం చేస్తుంటే ఎద్దులయ్య వచ్చి యమపాశం పెట్టేవరకు ఆగండి అని చెప్పి తాడు పెడతాడు. ఇంతలో ఇంట్లో వాళ్లు అందరూ అక్కడికి వస్తారు. ఇక పావనా మూర్తి మట్టి కుండలు తీసుకొస్తారు. వాటిని తాడు చుట్టూ పెడతారు.
విశాల్: ఈ రోజు చాలా స్పెషల్ డే.. దత్తాత్రేయ స్వామి వారి జయంతి జరుపుతారు.
ఎద్దులయ్య: లలితా దేవి జయంతి కూడా ఈరోజే మాతా.
హాసిని: చాలా విషయాలు చెప్పారు కానీ అపమృత్యుభయం ఎవరికి ఉందో చెప్పలేదు అక్క.
నయని: అలాంటి భయాలు రాకుండా ఉండాలి అనే కోరుకుందాం చెల్లి.
తిలోత్తమ: కోరుకుంటే సరిపోదు నయని.. ఫలితం ఉండాలి.
ఎద్దులయ్య: తప్పక ఉంటుంది మాతా. మీరు కోరలమ్మకు హారతి ఇవ్వగానే అర్థమవుతుంది. అపమృత్యు ఆభరణాన్ని వేసుకుంది ఎవరో తేలిపోవాలి అంటే కోరలమ్మ నైవేద్యం పెట్టే ముందు కుండలలో కొబ్బరి పీసు పెట్టండి.
నయని: ఎద్దులయ్య అపమృత్యువుని ఆభరణంతో పోల్చావు కానీ దాన్ని ధరించే సాహసం ఎవరు చేస్తారు.
సుమన: చావుని మెడలో వేసుకునేది ఎవరు.
విశాల్: మనమే.. ఎంత ఆరోగ్యం ఉన్నా మృత్యువు మన వెంటే ఉన్నప్పుడు చావు మ వెంటే వస్తుంది.
సుమన: నేను తిలోత్తమ అత్తయ్య అయితే గట్టెక్కినట్లే. ఎందుకంటే నా మీద పూలకుండి పడింది. అత్తయ్య చేతికి బులెట్ తగిలింది. అందుకే మా ఇద్దరి గండాలు తొలగిపోయినట్లే. ఇక మిగిలిన మీలో ఒకరికే ఈ మృత్యువు వస్తుంది.
తిలోత్తమ: ముందు హారతి ఇవ్వండి. టెన్షన్ పెట్టి చంపేస్తున్నారు.
ఎద్దులయ్య: ముందు హారతి వెలగించండి. తర్వాతి గాయత్రీ పాప చేత హారతి కర్పూరం ఈ కుండల్లో వేయించండి.
సుమన: ఆ పిల్లే ఎందుకు వేయాలి.
ఎద్దులయ్య: దోష భూయిస్టమైన జాతకం కదా.. గాయత్రీ పాప చేత కుండల్లో అగ్నిని రగిలింపజేయాలి.
విశాల్: గాయత్రీకి దోషమా..
నయని: ఏం దోషం ఎద్దులయ్య.
ఎద్దులయ్య: నీకే తెలియాలి మాతా..
ఇక నయని హారతి ఇస్తుంది. విశాల్ గాయత్రీ పాపతో కుండల్లో కర్పూరం వేయిస్తాడు. ఇక నయని కోరలమ్మను మొక్కుకుంటుంది. మరోవైపు కుండల్లో అగ్గి దానంతట అదే వెలుగుతుంది. అందరూ షాక్ అవుతారు. మంట ఎవరూ పెట్టకుంటా ఎలా అగ్గి వచ్చిందని అందరూ ఎద్దులయ్యకి అడుగుతారు. ఇక తిలోత్తమ నీరు వేసి మంటలు ఆర్పేయమంటే సూర్యాస్తమయం అయి పున్నమి చంద్రుడు వచ్చే వరకు అగ్గి మండుతూనే ఉంటుందని ఆగదని ఎద్దులయ్య చెప్తాడు. ఇక ఆ మంట యమపాశానికి కూడా తాకుంతుంది. ఆ యమపాశం ఇళ్లంతా తిరుగుతూ.. మెట్లపై నుంచి పైకి వెళ్తుంది. పైన పిల్లలు ఉన్నారు దీంతో అందరూ షాక్ అయి పరుగున పైకి వచ్చి తాడు ఎక్కడికి వెళ్లిందని ఆశ్చర్యం అవుతారు.
నయని: ఎద్దులయ్య ఎక్కడ ఉంది యమపాశం.
ఎద్దులయ్య: చుట్టే ఉంది మాతా..
విశాల్: చుట్టూ ఉందా..
ఎద్దులయ్య: కాదు చుట్టే ఉంది.
సుమన: అర్థమయ్యేలా చెప్తావా లేదా..
ఇక ఎద్దులయ్య అటు చూడండి అంటే ఆ తాడు టీవినీ చుట్టి ఉంటుంది. ఇక హాసిని ఎద్దులయ్యకి ఆ తాడు తీసేమని చెప్తుంది. తాడు తీయగానే టీవీలో గాయత్రీ పాప ఫొటో కనిపిస్తుంది. అందరూ పాప అంటూ షాకైపోతారు. ఇక సుమన తనకు అర్థమైందని అంటుంది. అందరూ ఏంటో చెప్పమని అడిగితే.. ఆ అపమృత్యు గండం ఏదో గాయత్రీ పాపకే రావొచ్చని చెప్తుంది. అలా జరగదు అని విశాల్ గట్టిగా చెప్తాడు. అయితే నయని గాయత్రీ పాపని మాత్రమే చూశారు మీరు అక్కడ ఇంకెవరో ఉన్నారు అని నయని అంటుంది. అది చూస్తే తప్ప స్పష్టం రాదని నయని చెప్తుంది. వాళ్లు ఎవరో తాను తెలుసుకోవాలని నయని అంటుంది. ఇక విక్రాంత్ ఎద్దులయ్యే అది ఎవరో చెప్పగలడు అంటాడు. దీంతో ఎద్దులయ్య ఆరు కుండల్లో మంటలు ఆర్పితేనే స్పష్టత వస్తుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: రైతుబిడ్డ అరెస్ట్ కరెక్టే, హీరోలను కూడా అలా చెయ్యాలి - తమ్మారెడ్డి భరద్వాజ