అన్వేషించండి
Advertisement
Trinayani Serial Today August 19th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ తెచ్చిన కుంకుమ పెట్టుకున్న నయనీకి జరిగిన నష్టమేంటీ? విశాల్‌వర్మకు ఎలాంటి కష్టం వచ్చింది?
Trinayani Today Episode: మంత్రగాడు ఇచ్చిన కుంకుమ పెట్టుకున్న త్రినయనికి ఎలాంటి అపద వచ్చింది..గండరగండుడి ప్రయోగం ఫలించిందా..?
Trinayani Serial Today Episode: త్రినయనీ ప్రతిసారీ మూడోకంటితో ఆపదన గ్రహిస్తుండటాన్ని గమనించి తిలోత్తమ స్వామిజి గజగండని కలిసి చెబుతుంది. దీంతో ఆయన మంత్రించిన కుంకుమ ఆమెకు ఇస్తాడు. ఈ కుంకుమ త్రినయనీ నుదుటన పెట్టుకునేలా చేస్తే తాను ఆపద వచ్చేది ముందుగా చూడలేదని చెబుతాడు.
పూజ అయిపోగానే హారతి ఇద్దామని త్రినయనీ అనకుంటుండగా...తిలోత్తమ , వల్లభ ఇంకా రాకపోవడంతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వస్తున్న తిలోత్తమ...గజగండ మంత్రించి ఇచ్చిన ఈ కుంకుమ నయనీ నుదుటన విశాల్ పెట్టేలా నేనే చేస్తాను...మిగిలిన వారికి మామూలు కుంకుమ పెట్టమని వల్లభకు చెప్పి వారి వద్దకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారని సుమన అడుగుతుంది. ఈ గుడిలో చాలా మంది దేవుళ్లు, దేవతలు ఉన్నారని అన్నీ ఒకసారి చూసొద్దామని వెళ్లామని చెబుతుంది.
కుంకుమ తీసుకుని నయనీ నుదుటన పెట్టమని విశాల్ కు ఇస్తుంది. అతను నయనీ నుదుటన బొట్టు పెట్టబోతుండగా....అక్కడే ఉండి గమనిస్తున్న మాంత్రికుడు గజగండ ఆనందంతో నవ్వుతాడు. ఇక ఈరోజు మొత్తం నీకు ఎదురయ్యే ప్రమాదాలను నయనీ చూడలేదను విశాల్‌వర్మ అంటూ వికటహట్టహాసం చేస్తాడు. అందరూ బొట్టుపెట్టుకోగానే...నయనీ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా...అది జారి మెట్లపైకి వెళ్లిపోతుంది. కిందపడిపోయిన టెంకాయ తీసుకోకూడదని చెప్పడంతో....నయనీ ఇంకో టెంకాయ తీసుకుని అమ్మవారికి కొట్టబోతుండగా...మాంత్రికుడు మళ్లీ ఆ టెంకాయ కిందపడేలా చేస్తాడు. నయనీ మళ్లీ మూడోకాయ తీసుకుని దేవునికి దణ్ణం పెట్టుకుంటుంది. అప్పుడు గజగండా నువ్వు రెండుచేతులతో కొబ్బరికాయ పట్టుకున్నా....కొట్టలేవు నయనీ అంటూ వికటహట్టహాసం చేస్తాడు. అలా మూడో కొబ్బరి కాయ కూడా నయనీ చేతుల్లో నుంచి జారిపోతుంది.
Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరుకు వాయనం ఇచ్చిన మిస్సమ్మకు – ఆరు ఆత్మను కళ్లారా చూసిన మనోహరి
హసినీ: అయ్యొయ్యో...ఎందుకు ఇలా జరుగుతుంది.
వల్లభ: మాయ చేస్తే జరగదా.?
తిలోత్తమ: నోర్మూయ్...
విశాల్: మాయ ఎవరు చేశారు..?
తిలోత్తమ: ఇంకెవరు..? ఉందిగా పెద్దబొట్టమ్మా
పెద్దబొట్టమ్మ: అమ్మా అలా అనకండి..? నేనేం చేయలేదు...అమ్మవారికి కొబ్బరికాయ నివేదించకుండా నేను అడ్డుకుంటానా..? పొరపాటున కూడా అలా అనకండి.
సుమన: ఒకటి కాదు రెండు కాదు...మూడుసార్లు అలాగే జరిగింది. దాన్ని మాయ అనరా..?
పెద్దబొట్టమ్మ: అంటే అన్నారు గానీ నన్ను అనకండమ్మా..
నయనీ: ఇందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన పనిలేదు. పూజలోనే ఏదో అపశ్రుతి జరిగి ఉంటుంది. ఆ తల్లినే క్షమించమని వేడుకుంటాను
మరోసారి పూజ చేసి కొబ్బరికాయ కొట్టేందుకు నయనీ ప్రయత్నించగా...మళ్లీ కొబ్బరికాయ డొర్లుకుంటూ కర్రవద్దకు వెళ్లిపోతుంది.
విక్రాంత్ ఆ కాయను తీసుకొస్తానని వెళ్లోతుండగా నయనీ ఆపుతుంది. ఇది మాయ కాదు...మర్మం అంటుంది. ఏంటదని విశాల్ అడగగా...అది తెలుసుకునేందుకే ఇలా జరుగుతోందని నయనీ సమాధానమిస్తుంది. అక్కడికే వెళ్లి తెలుసుకోవాలని చెబుతుంది. సరేనంటూ అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. దీంతో చాటుగా ఉండి అన్ని గమనిస్తున్న...మాంత్రికుడు అన్నీ అనుకున్నట్లే జరగబోతున్నాయని సంతోషిస్తాడు. తేలు వేలును కుట్టబోతుందని ఆనందపడతాడు. నయనీ అక్కడికి చేరుకుని...ఇదే నా కల్లో కనిపించిన కర్ర అని గుర్తుపడుతుంది. ఈ బట్ట ఎందుకు కట్టారు..ఇది దేన్ని సూచిస్తో తెలియడం లేదే అంటుంది. ఆ కర్రను వాళ్లు పట్టాలి...అది పట్టే దోషం వారిని చుట్టుముట్టాలి అని మాంత్రికుడు ఉబలాటపడుతుంటాడు.
Also Read: ‘జగధాత్రి’ సీరియల్: భూపతి మనుషులను చితక్కొట్టిన ధాత్రి, కేదార్ – హ్యాపీగా ఫీలయిన పరంధామయ్య
ఇంతలో పెద్దబొట్టమ్మ కొబ్బరికాయను తీసుకుని ఏం చేసుకుంటాం..అది కిందపడిపోయింది కాబట్టి పనికిరాదంటుంది. అందరూ ఆ కర్రను చూస్తుండగా....ఎవరో గొర్రెల కాపరులు ఈ కర్ర పెట్టి ఉంటారులే అని విశాల్ అంటాడు. ఎవరో ప్రయోగాలు చేయడానికి ఇలా పెట్టి ఉంటారని సుమన అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇంతలో ఈ కర్రలో ఏముండదు లే అని విశాల్ కర్రపట్టుకుని పీకిపారేయడానికి ప్రయత్నించగా..అందులో ఉన్న తేలు అతన్ని కుడుతుంది. నయనీ కంగారుపడిపోతుండగా....వెనకే ఉన్న మాంత్రికుడు తన పథకం ఫలించినందుకు ఆనందపడిపోతుంటాడు.
బాధతో విశాల్ అరుస్తుండగా....కిందపడి ఉన్న తేలును చూసిన హాసిని విశాల్‌ను తేలు కుట్టిందని చెబుతుంది. నయనీ ఆ తేలును చంపేయమని చెప్పగానే....అక్కడి నుంచి ఆ తేలు మాయమైపోతుంది. ఇలా కనిపించి అలా మాయమైపోయిందని పెద్దబొట్టమ్మ చెబుతుంది. ఇంతలో తేలు కుట్టిన చోట పసుపు వేసి నయనీ కట్టుకడుతుంది. చెట్టుపక్కనే ఉండి ఇందంతా చూస్తున్న మాంత్రికుడి నెత్తిమీద కొబ్బరికాయపడుతుంది. దెబ్బ తగిలినా పర్వాలేదు కానీ...విశాల్ వర్మకు తేలుకుట్టింది అదే నాకు చాలు అనుకుంటాడు. నా ప్రయోగం ఫలించబోతోందని ఆనందపడుతుండటంతో ఈ రోజు ఏపిసోడ్ ముగుస్తుంది.
Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: శంకర్, గౌరిల మధ్య చిచ్చు పెట్టిన ఇంటి ఓనరు – ఓనరు ను చితక్కొట్టిన అకి
Also Read: సత్యభామ సీరియల్: మైత్రీ, హరి మధ్య ఉన్న సంబంధం గురించి నిలదీసిన భార్యకు హరి ఏం సమాధానం చెప్పాడు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
తిరుపతి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion