అన్వేషించండి

Nindu Manasulu Serial Today February 26th:నిండు మనసులు: ప్రేరణకు అవమానం.. సిద్దూ, మంజుల మధ్య దూరం.. అసలు ఏం జరిగింది?

Nindu Manasulu Serial Today Episode February 26th ప్రేరణ మంజులను సిద్ధూ ముందే నిలదీసి సిద్ధూని తనతో మాట్లాడొద్దని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ సూట్ కేస్ తీసుకొని సిద్ధూ ఇంటికి వచ్చి మంజుల గారు అని పిలుస్తుంది. మంజులతో పాటు సిద్ధూ కూడా ఇస్తాడు. ఏంటి ప్రేరణ కొత్తగా మా అమ్మని పేరుతో పిలుస్తున్నావ్ అంటే డబ్బుతో ఏమైనా కొనాలి అనుకున్న పెద్ద వాళ్లని ఇలాగే పిలవాలి కదా అంటుంది. ఇదిగోండి మీరు మా ఇంట్లో మర్చిపోయిన సూట్‌కేస్ అని అక్కడ పెడుతుంది. ఏంటి ఇది అని సిద్ధూ అడుగుతాడు. మీ కొడుకు అడిగాడు కదా చెప్పండి తనకు బాగా అర్థం అవుతుంది అని ప్రేరణ అంటుంది. 

 
విజయానంద్ ప్రేరణతో మేం ఏం తప్పు చేశాం అని ఇలా మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. దానికి ప్రేరణ మేం ఏం తప్పు చేశాం అని ఈ డబ్బు ఇచ్చారు అని అడుగుతుంది. సిద్ధూ షాకై అయి డబ్బు ఏంటి.. అని అడుగుతాడు. మంజుల గారు మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని అడుగుతుంది. ఆర్థిక ఇబ్బందిలో ఉందేమో అని సాయం చేశాం అని విజయానంద్ అంటే.. నిజంగా సాయం చేయాలి అంటే మాట సాయం చేసి ధైర్యం చెప్పేవాళ్లు కానీ మా అమ్మని తక్కువ చేసి తప్పుగా మాట్లాడరు అంటుంది. సిద్దూ తల్లితో ప్రేరణ ఏదేదో అంటుంది. నువ్వేం మాట్లాడటం లేదు.. ఏమైంది అని అడుగుతాడు. చెప్పడానికే ఇబ్బంది పడితే ఇలా చేయడానికి ఎలా మనసు వచ్చింది.. ఇన్నాళ్ల మన పరిచయంలో మీరు ఇంతే నన్ను అర్థం చేసుకున్నారా.. నీ మీద మీ అమ్మకి ఉన్న ప్రేమ మాకు వెలకట్టేలా చేసింది.. మా వల్ల నీకు ఏం అవుతుందో అనే భయంతో మాకు డబ్బు ఇచ్చి ఊరు వదిలి వెళ్లిపోమని చెప్పారు మీ అమ్మగారు అని అంటుంది. సిద్ధూ షాక్ అయిపోతాడు. అమ్మ ప్రేరణ చెప్పింది నిజమా అని అంటాడు.
 
మంజులతో మీరు డబ్బున్న వాళ్లు కాబట్టి ఏమైనా డబ్బుతో కొనేయొచ్చు అనుకుంటారు.. కానీ డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి.. అందులో నమ్మకం ఒకటి.. మీకు నా మీద నమ్మకం లేదు అని అర్థమైంది.. మీరు ఇచ్చిన ఈ డబ్బుతో నేను నన్ను నమ్మక ద్రోహం చేసుకోలేను.. నాది పొగరు అనుకోవద్దు.. మేం ఆత్మాభిమానం కలవారం.. ప్రాణాలు అయినా పణంగా పెడతా కానీ ఆత్మాభిమానం పోగొట్టుకోం.. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు.. చేసినా మా ఇంటికి రావొద్దు.. డబ్బు కోసం దిగజారే వాళ్లం కాదు మేం అని దండం పెట్టి వెళ్లిపోతుంది. 
 
సిద్ధూ తల్లిని ఏం అనకుండా అలా కోపంగా బాధగా చూస్తూ ఉంటాడు. ప్రేరణ ఇంటికి వెళ్లగానే ఇందిర ఏమైనా గొడవ అయిందా అంటే మనల్ని ఇలా అర్థం చేసుకునే వాళ్లతో మాట్లాడను అనుకుంటే ఇక గొడవ ఎందుకు పడతాను..వాళ్ల పొగరును వాళ్లకే తిరిగి ఇచ్చా.. మనం ఆత్మాభిమానం ఎందుకు పోగొట్టుకోవాలి.. అని అంటుంది. ఇందిర ఏడుస్తూ కూతుర్ని హగ్ చేసుకుంటుంది. ఇంతలో సిద్ధూ అక్కడికి వస్తాడు. ఏంటి సిద్ధూ ఈ సారి నువ్వు మమల్ని వెళ్లిపోమని చెప్పడానికి వచ్చావా అంటుంది. ఇది నా ప్రమేయం లేకుండా జరిగింది.. ముందే తెలుసుంటే ఇలా జరగనిచ్చే వాడిని కాదు.. మా అమ్మ తరుపున నేను క్షమాపణ చెప్తున్నా అంటాడు. సారీ చెప్తే గాయం మనదు కదా అని ఇందిర అంటే ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటా అంటాడు. డబ్బుతో మీ అమ్మ మమల్ని దిగజారి చూస్తే నువ్వు సారీ చెప్పడం ఏంటి అని అంటుంది. జరిగిన అవమానం నీ క్షమాపణతో సరిపెట్టుకోవాలా అంటుంది. ఏం చేయాలి అని సిద్ధూ అడిగితే ఇక నుంచి నువ్వు ఇక్కడికి రావొద్దు.. ఎప్పటిలా కలవొద్దు.. మేం ఇప్పుడు నుంచే దూరంగా ఉంటాను అంటుంది. నువ్వు మీ అమ్మని ఎలా ప్రేమిస్తావో నేను అలా మా అమ్మని ప్రేమిస్తాను.. ఇప్పటి వరకు స్నేహితుల్లా ఉన్న మనం శత్రువుల్లా మారకూడదు అంటే ఇప్పుడే విడిపోవాలి అంటుంది. 
 
సిద్ధూ ప్రేరణతో ఇద్దరం తప్పు చేయలేదు.. మరి ఇద్దరం ఎందుకు దూరం అయిపోవడం అని అంటుంది. మనం ముందులా ఉండా అంటే ప్రేరణ కుదరదు అనేస్తుంది. ఇంత చెప్పినా మీరు మీలా ఉంటే నేనేం చేయలేను. నేను మాత్రం నాలాగే ఉంటాను.. నేను నీతో ఎప్పటిలానే ఉన్నాను.. ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నా.. ఇంతకు ముందు ప్రేరణని ఎలా చూశానో ఇప్పుడు అలాగే చూస్తా. మారితే నాది తప్పు.. ఇక నువ్వు ఎలా ఉంటావో నీ ఇష్టం అని చెప్పి వెళ్లిపోతాడు. మంజుల ఆలోచిస్తూ ఉంటే విజయానంద్ ఎక్కువ ఫీలవుతున్నట్లు ఉన్నావ్ వదిలేయ్ అని అంటాడు. 
 
సిద్ధూ కోపంగా వచ్చి విజయానంద్ కాలర్ పట్టుకొని ప్రేరణ వాళ్లకి డబ్బు ఇవ్వాలి అన్న ఆలోచన నీదేనా అని అడుగుతాడు. మేం ఏం చేసినా నీ మంచే అని అంటాడు. ఏంటి మంచి.. నా ప్రాణాలు కాపాడిన ప్రేరణని ఇలా చేయడం మంచా,, లేదంటే గణ మాటలు నమ్మి ఇలా చేశారా.. నాకు చెప్పకుండా ఎందుకు ప్రేరణ ఇంటికి వెళ్లి డబ్బు ఇచ్చారు.. నీకు ఈ ఆలోచన రాదు అని నాకు తెలుసమ్మా,, ఈయనే నీతో ఈ తప్పు చేయించారు.. నువ్వు అయినా ప్రేరణ గురించి ఒక్క నిమిషం ఆలోచించుంటే బాగుండేది.. వాళ్లు డబ్బు మనుషులు అయ్యింటే ఈ పాటికే చాలా సూట్‌కేసులు పట్టుకెళ్లే వాళ్లు అని అంటాడు. నా ప్రేమ నీకు అర్థం కాలేదా అని మంజుల  అడిగితే ప్రేరణకు జరిగిన అన్యాయం ముందు నీ ప్రేమ తక్కువ అయిపోయింది అంటాడు. ప్రేరణ దగ్గర నమ్మకాన్ని మళ్లీ మనం నిలబెట్టుకోవాలిఉ అంటే చాలా కష్టం అంటాడు. వదిలేయ్ వాళ్లు మనకు అవసరం లేదు అని విజయానంద్ అంటే ఇదేమైనా బిజినెస్‌ డీలా నువ్వు నాశనం చేసినా తిరిగి నిలబెట్టడం నా బాధ్యత ఇంకోసారి నాకు తెలీకుండా ఏం చేయడానికి వీల్లేదు.. ప్రేరణ హర్ట్ అయితే నేను హర్ట్ అవుతా.. నేను హర్ట్ అయితే నువ్వు ఉండవు అని వార్నింగ్ ఇస్తాడు.  ఉదయం సిద్ధూ ప్రేరణని కేఫ్‌కి తీసుకెళ్లడానికి ఇంటికి వస్తాడు. సిద్ధూ లోపలికి వెళ్తే ఐశ్వర్య వచ్చి నేను కేఫ్కి వస్తా అంటుంది. ఇక నుంచి కేఫ్‌ పనులు చూసుకునేది నేనే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today march 14th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
Nindu Manasulu Serial Today March14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
నిండుమనసులు: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
Illu Illalu Pillalu Serial Today March 14th: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget