అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu February 26th Episode: పూలగంపతో ముళ్లకంప ముచ్చట్లు! వీడియో కొట్టేస్తూ బాలుకి దొరికిపోయిన రోహిణి - గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 26 ఎపిసోడ్

Gunde Ninda Gudi Gantalu 2025 February 26 Episode: ప్రభావతి ఇంట్లో బొమ్మల కొలువు సందడి మొదలైంది... రోహిణి - గుణ కలసి బాలు మీనాని టార్గెట్ చేశారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Gunde Ninda Gudi Gantalu 2025 February 26 Episode Telugu Serial

ఇంట్లో ఏం జరిగిందో సుశీలమ్మకు చెబుతారు మీనా-బాలు. అంతా విన్న సుశీలమ్మ..నా కోడలిని బాగానే వెర్రిబాగులదాన్ని చేశారుగా అంటుంది. నువ్వు పెళ్లిచేసుకుని వచ్చిన కొత్తలో నా కోడిలితో ఎలా వేగుతావో అనుకున్నా కానీ..తెలివైనదానివే అంటుంది. 
 
పందెంలో ఓడిపోయిన ప్రభావతిని తీసుకెళ్లి పూలకొట్టు దగ్గరుంచుతారు. చాలా టెన్షన్ పడిపోతుంది ప్రభావతి. బలవంతంగా పూలకొట్టు ముందు నిల్చోబెట్టి పూలమ్మిస్తారు. ఇంత అవమానమా అని బాధపడుతూ ఒక్కసారిగా ఉలిక్కిపడిలేస్తుంది. ఇదంతా కలా అని తెలిసి ప్రభావతి హమ్మయ్య అనుకుంటుంది. ఆ తర్వాత నిద్రలేచివస్తుంది.. బాలుగాడు నిజంగానే నాతో పూలు అమ్మిస్తాడని భయపడుతుంది ప్రభావతి. పందెం వేశావ్ కదా అంటుంది సుశీలమ్మ. నీకెందుకే అంత కక్ష అని ఫైర్ అవుతుంది ప్రభావతి. అవును మీరు పూలమ్మడం నేను చూడాలి, ఫొటోలు వీడియోలు తీయాలి, లోకమంతా చూసేలా ఇంటర్నెట్ లో పెట్టాలి అంటుంది మీనా. అత్తయ్యా మీ కోడలు పూలమ్మితే మీకు పరువుతక్కువ కాదా అని సుశీలమ్మ దగ్గరకు వెళుతుంది. అదేం తప్పుకాదంటుంది సుశీలమ్మ. బాలు ఇకపై నీ పెళ్లాన్ని ఏమీ అనను అంటుంది ప్రభావతి. తప్పదు పూలావతి పద అంటాడు బాలు. పద వర్జ్యం వచ్చేస్తోంది అని కంగారుపెడతాడు బాలు. 20 మూరలు ఇవి గంప నెత్తిన పెడుతుంది మీనా. పూలమ్మా పూలు అంటూ అరుస్తుంది. వెంటనే ఆ గంప తీసి కిందపెట్టేసి మీతో పూలమ్మనిస్తానా అంటుంది మీనా. మొదటిసారి నువ్వు నా కంటికి మధుర మీనాక్షిలా కనిపిస్తున్నావ్ అంటుంది ప్రభావతి. ఇంకెందుకు వీడియో తీస్తావ్ అని రవిపై అరుస్తుంది..అదిగో మళ్లీ గయ్యాళి గంగావతిగా మారిపోయింది అంటుంది శ్రుతి

 
అంతాకలసి యాగం కోసం బయలుదేరుతారు. మీనాక్షి ఫ్రెండ్ ఫామ్ హౌస్ కి వెళతారు. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు ఫారెన్ నుంచి తెప్పించిందే అంటూ గొప్పలు చెబుతుంది. ఓవైపు యాగానికి ఏర్పాట్లు జరుగుతుండగా గుణ విద్యకు కాల్ చేసి రోహిణితో వెంటనే మాట్లాడాలి అంటాడు. ఈ రోజు ఎలాగైనా బాలు ఫోన్ నుంచి వీడియో పంపించకుంటే దినేష్ గాడి సంగతి నేను పట్టించుకోను అంటాడు గుణ. ఇక బాలు నుంచి ఫోన్ తీసుకునే ప్లాన్ లో ఉంటుంది రోహిణి. పూజా కార్యక్రమాలు జరుగుతుండగా..మీనాక్షి వచ్చి పూలగంప తీసుకురా బాలు అంటుంది. బాలు వెళ్లి మీనాను ఎత్తుకుని తీసుకొచ్చి ఇదిగో పూలగంప అంటాడు. అంతా నవ్వుతారు. ప్రభానతి పూలగంప పట్టుకోగానే పూలమ్మా పూలు అంటూ ఆటపట్టిస్తాడు. పూలు ఇమ్మంటే ఇవ్వవేంటి అంటుంది సుశీలమ్మ. మీనా నువ్వు ఇవ్వు అంటుంది..నేనంటే లెక్కలేదా అని ప్రబావతిపై కోప్పడుతుంది సుశీలమ్మ. 

అంతా సందడిగా సాగుతున్న సమయంలో సుశీలమ్మ... రోహిణిని పిలిచి ముందు నీకు గర్భస్రావం జరిగిందంట కదా నాకు చెప్పలేదు అంటుంది. మీనానే చెప్పి ఉంటుందని ప్రభావతి, రోహిణి కోపంగా మీనావైపు చూస్తారు. సత్యం కలుగజేసుకుని ఆ విషయం మా అమ్మకు నేనే చెప్పాను అంటాడు. ఇంత చిన్న విషయం చెప్పాలా అని ప్రభావతి కోప్పడుతుంది. మా అమ్మతో నాకు దూరం లేదు ప్రతి విషయం పంచుకుంటా అంటాడు సత్యం. ఇలాంటి విషయాలు ముందుగా తెలిసి ఉంటే ఇలా జరిగేది కాదుకదా అని ప్రభావతిపై చురకలు వేస్తుంది. ఈ యాగానికి నాకు తెలిసిన డాక్టర్ ను పిలిచాను..నిన్ను పరీక్షించి సరైన సూచనలు ఇస్తుంది అంటుంది సుశీలమ్మ. షాక్ అవుతుంది రోహిణి. 
  
బాలు తన ఫోన్ చార్జింగ్ పెడతాడు.. ఆతర్వాత మీనా వచ్చి ఏదో అడుగుతుంది..ఓసారి కాల్ చేసి కనుక్కో అంటాడు బాలు. ఫోన్ కోసం వెళ్లి చూస్తే అక్కడ కనిపించకపోవడంతో షాక్ అవుతారు. మీనా ఫోన్ నుంచి కాల్ చేస్తాడు బాలు.. రోహిణి చేతిలో ఉన్న ఫోన్ మోగుతుంటే కట్ చేస్తుంటుంది. ఇద్దరూ కలసి ఫోన్ కోసం వెతుకుతుండగా ఓ మూలన రోహిణి చేతిలో బాలు ఫోన్ కనిపిస్తుంది. రోహిణి ప్లాన్ బయటపడుతుందేమో చూడాలి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today March 9th: తన బిడ్డ బతికే ఉందని తెలుసుకున్న ప్రియంవద ఏం చేసింది..? భర్తను పనోడిగా సింధూ చెబుతున్న అబద్ధం స్నేహితురాళ్లకు తెలిసిపోయిందా..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: తన బిడ్డ బతికే ఉందని తెలుసుకున్న ప్రియంవద ఏం చేసింది..? భర్తను పనోడిగా సింధూ చెబుతున్న అబద్ధం స్నేహితురాళ్లకు తెలిసిపోయిందా..?
Jagadhatri Serial Today March 9th: : శ్రీవల్లి కేదార్‌ సొంత చెల్లెలు అని అందరికీ తెలిసిపోయిందా..? వైజయంతిని సుధాకర్‌ మెడపట్టి ఎందుకు బయటకు గెంటేశాడు...?
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి కేదార్‌ సొంత చెల్లెలు అని అందరికీ తెలిసిపోయిందా..? వైజయంతిని సుధాకర్‌ మెడపట్టి ఎందుకు బయటకు గెంటేశాడు...?
Podharillu Serial Today March 9th:  నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
పొదరిల్లు: నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
Nindu Manasulu Serial Today March9 th:  ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
నిండుమనసులు: ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget