Guppedantha Manasu August 2nd: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు, కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?
రౌడీలు రిషి ని చంపడానికి ప్రయత్నించటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది తెలుసుకుందాం.
Guppedantha Manasu August 2nd: ఫ్లెక్సీ షాప్ దగ్గర ఉన్న రిషి ఇంట్లో ఉండాల్సిన ఫోటోలు అటెండర్ చేతికి ఎలా వచ్చాయి అని ఆలోచనలో పడతాడు. అంటే వసు చెప్పింది నిజమేనా.. మరి ఎటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. అన్ని వదిలేసుకొని దూరంగా వచ్చేసాక ఇంకా తన దగ్గర ఏముంది అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అటువైపు పరిగెత్తుకుంటూ వస్తున్న అటెండర్ రిషిని చూసి శైలేంద్రకు ఫోన్ చేసి ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లాగేసుకున్నాను అని.. ఇప్పుడు ఫ్లెక్సీ షాప్ దగ్గర రిషి ఉన్నాడు అని ఏం చేయాలో అర్థం కావట్లేదని అంటాడు.
వెంటనే శైలేంద్ర ఇప్పుడు అందరికీ నిజం తెలిసింది కాబట్టి ఎటువంటి భయం లేదు వాడిని చంపేసేయు అని అంటాడు. అంతేకాకుండా రౌడీలను కూడా పంపిస్తున్నాను అని అంటాడు. ఇక వసు బాగా టెన్షన్ పడుతూ ఉండగా మహేంద్ర వచ్చి జరిగిన విషయం తెలుసుకుంటాడు. వెంటనే వసు ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి రిషి గురించి అడగటంతో ఏం జరిగింది అని ప్రిన్సిపల్ కంగారు పడతారు.
ఇక ఏమీ లేదని చెప్పి వెంటనే మహేంద్ర తో సర్ ఎక్కడున్నారో తెలిసింది అని చెప్పగా ఇక ఇద్దరూ బయలుదేరుతారు. రిషి కోసం రౌడీలు అక్కడికి వచ్చి రిషిని బలవంతంగా చేతులు కట్టి కారులో తీసుకుని వెళ్తారు. బయట ఏం జరుగుతుందో అని ఫ్లెక్సీ షాప్ యజమాని బయటికి రావటంతో అప్పటికే రౌడీలు అతన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అదే సమయంలో వసు వాళ్ళు అక్కడికి రాగా ఫ్లెక్సీ షాప్ యజమాని వసు ను గుర్తుపట్టి మీతో ఉన్న అతడిని ఇప్పుడే రౌడీలు తీసుకెళ్తున్నారు అని చెప్పడంతో వాళ్ళు షాక్ అవుతారు.
దాంతో వాళ్లు కూడా ఆ రౌడీలను ఫాలో అవుతారు. వెంటనే మహేంద్ర వసుధారతో పోలీసులకు ఫోన్ చేయమని చెబుతాడు. ఇక పోలీసులకు వసు ఫోన్ చేయగా వాళ్ళు కూడా వెంటనే బయలుదేరుతారు. ఇక రిషి కార్లో ఉన్న వాళ్ళందర్నీ బయటికి నెట్టి ఫైట్ చేస్తాడు. కానీ వాళ్ళు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో స్పృహ కోల్పోతుండగా ఇక వాళ్ళు కత్తితో పొడుస్తున్న సమయంలో మహేంద్ర, వసు వచ్చి రక్షిస్తారు.
ఇక పోలీసులు రావటంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. వెంటనే పోలీసులు రౌడీలను ఫాలో అవుతారు. ఇక రిషిని విశ్వనాథం ఇంటికి తీసుకు వెళ్దామని మహేంద్ర అనటంతో వసు వద్దని మా ఇంటికి తీసుకెళ్దాము అని బ్రతిమాలుతుంది. జగతి మహేంద్ర కు ఫోన్ చేయగా రిషి సేఫ్ గా ఉన్నాడు అని చెప్పటంతో జగతి ఊపిరి పీల్చుకుంటుంది.
ఇక తమ ప్లాన్ సక్సెస్ కాకపోవటంతో శైలేంద్ర రౌడీలపై ఫైర్ అవుతాడు. వసు తన ఇంటికి తీసుకొచ్చిన రిషికి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక స్పృహలో నుండి బయటకి వచ్చిన రిషి ఏం జరిగిందని ఎక్కడికి వచ్చాము అనటంతో వసు ఇంటికి వచ్చాము అంటాడు మహేంద్ర. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని కోపంతో అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial