Krishnamma kalipindi iddarini August 1st: 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' సీరియల్: తల్లిని గట్టిగా నిలదీసిన గౌరీ, రహస్యంగా నిజాలు తెలుసుకున్న సౌదామిని?
గౌరీ ఆదిత్య, అఖిల పెళ్లి గురించి తన తల్లి భవానిని గట్టిగా అడగటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishnamma kalipindi iddarini August1st: మన్మధ రావు తన ఇద్దరు మనవళ్ళకు ఫస్ట్ నైట్ గురించి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇక ఆ సలహాలు ఆదిత్య వినడానికి ఇష్టపడక అక్కడ నుండి వెళ్తుండగా వెంటనే తన తాత ఆపి బలవంతంగా వినిపిస్తాడు. కానీ ఆదిత్య అయిష్టంగా వింటాడు. అలా కొన్ని సలహాలు ఇస్తూ కాసేపు ఆట పట్టిస్తాడు.
మరోవైపు గౌరీ తన భర్తకు నిజం చెప్పలేకపోతున్నాను అని తెగ కుమిలిపోతూ ఉంటుంది. ఇక కండిషన్తో తన తల్లి ఆదిత్య, అఖిలల పెళ్లి చేయించింది అని కోపంతో ఎలాగైనా తనని ఈ విషయం అడగాలి అని అనుకుంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్తుండగా అప్పుడే అక్కడికి ఈశ్వర్ వచ్చి తాతయ్య సరదాగా ఆట పట్టించాడని.. తన తాత చెప్పిన మాటలు చెబుతూ ఉంటాడు.
ఇక గౌరీ మాత్రం తన మనసులో చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి దుర్గ భవాని ఇంటికి వెళ్తారు. ఇక గౌరీ ఈశ్వర్ ని పట్టుకొని కారులో నుండి దింపుతూ ఉండగా.. అది చూసి అఖిల కూడా ఆదిత్య చెయ్యి పట్టుకోవాలని చూస్తుంది. కానీ ఆదిత్య పర్వాలేదు వద్దు అని అంటాడు. కానీ అఖిల గట్టిగా అనటంతో ఏమీ అనకుండా మౌనంగా చేయిస్తాడు.
అఖిల కూడా ఆదిత్య చేయి పట్టుకొని వస్తుంది. ఇక దుర్గా భవాని వారికి దిష్టి హారతి పళ్లెం తీసుకొచ్చి దిష్టి తీస్తుండగా గౌరీకి తన అత్త మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. ఇక తన తల్లి వైపు సీరియస్ గా చూస్తుంది. వెంటనే భవాని గౌరీ తన వైపు సీరియస్గా చూడటం ఏంటి అని కాస్త భయపడుతూ కనిపిస్తుంది. ఇక వెంటనే ఆనందయ్య తన అల్లుళ్ళతో తమ ఇల్లు ఇరుకుగా ఉంటుంది కాస్త అడ్జస్ట్ చేసుకోమని చెబుతాడు.
దానికి ఈశ్వర్ మీ ఇల్లు ఇరుకుగా ఉన్న మీ మనసు మాత్రం విశాలంగా ఉంది మాట్లాడుతూ ఉంటాడు. కానీ వారితో వచ్చిన సౌదామిని మాత్రం ఆనందయ్యతో వెటకారంగా, పరువు తీసే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో భవానికి కోపం వస్తుంది. ఆ తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్ళగా తన తల్లి బయటికి వెళ్లడానికి చూసి గౌరీ బయటికి వెళ్తుంది. గౌరీని గమనించిన సౌదామిని కూడా గౌరీని ఫాలో అవుతుంది.
ఇక తన తల్లితో గట్టిగా అడిగేస్తుంది గౌరీ. ఆదిత్యతో అఖిల పెళ్లి జరిగితేనే మా పెళ్లి జరుగుతుందని అత్తయ్యతో కండిషన్ పెట్టావ్ అంటా అలా ఎందుకు పెట్టావు అంటూ కోపంతో అడుగుతుంది. వీరి మాటలు అన్ని సౌదామిని ఒక చోట నిలబడి వింటుంది. ఇక భవాని సునంద గారే పెళ్లి చేయమన్నారు అని అనటంతో వెంటనే గౌరీ తనకు నిజం తెలిసిపోయింది అంటుంది.
ఈ విషయాలన్నీ ఈశ్వర్ కి చెప్పలేక లో లోపల కుమిలిపోతున్నాను అంటూ.. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో అఖిల ఉన్నప్పుడు అత్తయ్య ఇచ్చిన డబ్బుల గురించి కూడా చెప్పలేనందుకు కుమిలిపోతున్నాను అని అనటంతో ఆ మాటలు విని సౌదామిని షాక్ అవుతుంది. పెళ్లి జరిగింది కదా ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు కదా మళ్లీ ఎందుకలా చేస్తున్నావు అని భవాని అనటంతో.. ఎందుకంటే ఆదిత్య ప్రేమిస్తున్నాడు అని మధ్యలో ఆపేస్తుంది. ఆదిత్య ప్రేమ గురించి తెలిస్తే అమ్మానాన్నలు తట్టుకోలేరు అని నిజానికి చెప్పకుండా దాచిపెడుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial