అన్వేషించండి

Krishna Mukunda Murari July 31st: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: మురారి దంపతులపై అనుమానం పడుతున్న భవాని, పెద్దత్తకు నిజం చెప్పటానికి సిద్ధమైన ముకుంద?

మురారి, కృష్ణల మధ్య సఖ్యత లేదని భవానికి అనుమానం రావటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishna Mukunda Murari July 31st: కృష్ణను ఈ డబ్బు నువ్వే ఉంచుకో అని మురారి అనటంతో నేనెందుకు మిమ్మల్ని మర్చిపోతాను. మీరే నా దేవుడు అని బ్యాగు పక్కకు పెట్టి గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది. దాంతో కృష్ణ ప్రేమ దక్కట్లేదు అని మురారి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏదో ఒక రోజు నా ప్రేమ నీకు అర్థమవుతుంది అని బాధపడుతూ ఉంటాడు. కృష్ణ కూడా పడుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.

మరోవైపు కృష్ణ, మురారి ఒకరికొకరు తోడుగా ఉండాలని ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలి అని దేవుడిని వేడుకుంటుంది రేవతి. భవాని వచ్చి డోర్ కొట్టడంతో మురారి డోర్ తీస్తాడు. ఇక భవాని కింద పడుకొని ఉన్న కృష్ణని చూసి షాక్ అవుతుంది. మురారి కూడా కంగారు పడుతూ ఉంటాడు. పెద్దమ్మ మీరేంటి అంటూ కంగారుపడుతూ కనిపిస్తూ ఉంటాడు.

మురారి చెయ్యి తగిలి బాటిల్ కృష్ణ తల మీద పడటంతో కృష్ణ గట్టిగా అరిచి లేచి తన అత్తను చూసి షాక్ అవుతుంది. ఇక రేవతి చెప్పింది నిజమే ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉంది అని అనుకుంటుంది భవాని. కాఫీ ఏమైనా తాగుతారా అని వెంటనే కృష్ణ అడుగుతుంది. వెంటనే భవాని మీరిద్దరు ఫామ్ హౌస్ లో ఎన్ని రోజులు ఉన్నారని అడగటంతో రెండు రోజులని కృష్ణ, మూడు రోజులని మురారి అంటాడు.

ఆ తర్వాత ఇద్దరు సరి చేయడానికి ప్రయత్నం చేయడంతో.. రాజ నర్స్ మొత్తం చెప్పిందని భవాని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ నిజం మొత్తం తెలిసిపోయింది ఏమో అని కంగారు పడతారు. ఇక భవానికి మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య ఉంది అని ఫిక్స్ అవుతుంది. ఇక చిన్న చిన్న సమస్యలను సరిదిద్దుకోవాలి అని.. తను ఎలా చెబితే అలా వినాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది.

ముకుంద ఇద్దర అత్తయ్యలు కృష్ణ, మురారిని కలిపేటట్టు చేస్తున్నారేమో అని కంగారు పడుతూ ఉంటుంది. వాళ్ళు దాస్తున్న నిజం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య రావటంతో కృష్ణ, మురారి ల విషయం ఎంత వరకు వచ్చింది అని అడుగుతుంది. వాళ్ళు ఇద్దరు అలా మోసం చేయడం కరెక్ట్ కాదని అంటుంది. ఈ అలేఖ్య మా మధు వారిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పొద్దని ఒప్పుకున్నాడు అని లేదంటే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేదాన్ని అని అంటుంది.

కానీ ఇటువంటివి వెంటనే చెప్పేసేయాలి అని అంటుంది. పెద్ద అత్తయ్య కు ఈ విషయం చెబితే తన చిన్న కోడలు కుటుంబం పరువు బయటపడకుండా ముందే తనకు విషయం చెప్పింది అని అనుకోని నిన్ను మెచ్చుకుంటుంది అని అంటుంది. ఇక మధ్యలో వచ్చిన కృష్ణ మధ్యలోనే వెళ్లిపోతుంది అని అంటుంది. అలేఖ్య  కూడా ఎలాగైనా ఈ విషయాన్ని పెద్దతయ్యకు చెప్పాలి అని ఫిక్స్ అవుతుంది.

భవాని కృష్ణ, మురారి గురించి అలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రేమ గా ఉన్నారా లేదా అని ఆలోచిస్తుంది. ఇక ముకుంద ను పిలిచి కృష్ణ, మురారి ల గురించి ఏదో చెప్పాలనుకున్నావు కానీ మధ్యలో ఆపేసావు ఏంటి అని అడుగుతుంది. దాంతో అవకాశం దొరికింది అని నిజం చెప్పేస్తుంది. వారిద్దరి మధ్య సఖ్యత లేదు అని అంటుంది. వాళ్ళ మధ్య ఏదో ప్రాబ్లం ఉందన్న అనుమానం ఉంది అని చెబుతుంది.

వాళ్ళు ఎప్పుడు బాగానే కలిసి ఉంటారు కదా నాకు ఇప్పుడు అలా అనిపించలేదు అని అంటుంది భవాని. కానీ ముకుంద వాళ్ల మధ్య గ్యాప్ ఉందని.. అంతేకాకుండా వారిద్దరు బెడ్ పై కూడా పడుకోకుండా ఒకరికొకరు దూరంగా పడుకుంటున్నారు అనటంతో  అప్పుడే ఉదయం చూసిన సంఘటన గుర్తుకు చేసుకుంటుంది. ఇక వారద్దరి మధ్య ఎటువంటి సఖ్యత లేదు అని చెబుతూ ఉంటుంది.

అప్పుడే అలేఖ్య, మధు అక్కడికి వచ్చి ముకుందా వాళ్ళని చూస్తారు. ఇక మధు ముకుందా అగ్రిమెంట్ విషయం గురించి చెబుతుందేమో అని ఊహించి అలేఖ్యను అక్కడి నుంచి టిఫిన్ తీసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు. ఇక మధు వాళ్ళ దగ్గరికి వెళ్లి వారిని ఆ టాపిక్ మాట్లాడకుండా చేస్తాడు. మురారి షూ వేసుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చి తల తుడుచుకుంటున్న కృష్ణ నడుము చూసి ఫిదా అవుతాడు. ఏం చేయాలో అర్ధం కాక అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక కృష్ణ కూడా సిగ్గుపడుతూ కనిపిస్తుంది.

మళ్లీ తన పోలీస్ క్యాప్ తీసుకొని వచ్చి తనను అదేవిధంగా చూస్తూ ఉంటాడు మురారి. తరువాయి భాగంలో రేవతి ఫ్రిజ్లో దోశ పిండి ఉందని దోశలు వేయమని కృష్ణకు చెబుతుంది. ఇక కృష్ణ సరే అని అక్కడికి వెళ్లగా ఫ్రిజ్లో బాటిల్ కు తన నల్లపూసలు ఇరికిపోవడంతో పూసలన్నీ కింద పడిపోతాయి. ఇక అది చూసి భవాని కృష్ణ అని గట్టిగా అరుస్తుంది. ఇక ఇంట్లో వాళ్లంతా షాక్ అవ్వగా.. కృష్ణ కూడా నల్లపూసల చేతిలో పట్టుకొని బాధపడుతూ కనిపిస్తుంది.

 

also read it: Trinayani July 29th: విక్రాంత్ ను కాపాడిన శివ.. ప్లాన్ ఫెయిల్ అయిందని చిరాకులో ఉన్న తిలోత్తమా?

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget