అన్వేషించండి

Trinayani July 29th: విక్రాంత్ ను కాపాడిన శివ.. ప్లాన్ ఫెయిల్ అయిందని చిరాకులో ఉన్న తిలోత్తమా?

విక్రాంత్ ను సమయానికి శివ వచ్చి కాపాడటంతో సీరియల్ ఇంట్రెస్ట్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani july 29th: ఇక నయని సుమనను తులసి కోట దగ్గర దీపం పెట్టమని అంటుంది. వెంటనే సుమన శ్రీమంతం చేయకుండా ఈ పూజలు పెట్టుకున్నారా అని కోప్పడుతుంది. తులసి అమ్మవారికి దీపం పెట్టుకుంటే సౌభాగ్యం కలుగుతుందని చెబుతుంది నయని. తిలోత్తమా కూడా కొన్ని మంచి మాటలు చెప్పి దీపం పెట్టమని సలహా ఇస్తుంది. దాంతో సుమన దీపం పెట్టాక.. వెంటనే నయని బిడ్డ ఆరోగ్యంగా పుట్టడంతో పాటు సౌభాగ్యంగా ఉండమని దండం పెట్టుకోమంటుంది.

వెంటనే సుమన ఎటువంటి నొప్పులు లేకుండా డెలివరీ మంచిగా అయ్యి బిడ్డ పుట్టాక తన కోటీశ్వరాలు అవ్వాలి అని అంటుంది. ఇక విక్రాంత్ కోప్పడతాడు. ఆ తర్వాత సుమన కుర్చీలో కూర్చుంటుంది. గాయత్రి పాపా పాపర్స్ వైపు అదే పనిగా చూడటంతో విశాల్ వల్లభ చేతి నుండి ఒకటి తీసుకుంటాడు. ఇక వల్లభ అలా ఎలా తీసుకుంటారు అనటంతో తిలోత్తమా కంట్రోల్ చేస్తుంది.

ఇక మొదట తిలోత్తమా సుమనకు బొట్టు పెట్టి అక్షంతలు చల్లుతుంది. ఆ తర్వాత వల్లభ దంపతులు కూడా తనను ఆశీర్వదిస్తారు. ఇక వల్లభ ఎవరు ఉన్నా లేకున్నా నువ్వు బతికే ధైర్యం తెచ్చుకోవాలి అనటంతో ఆ మాట విని అందరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత విశాల్ దంపతులు కూడా బొట్టు బట్టలు పెట్టి ఆశీర్వదిస్తారు. ఇక తిలోత్తమా విక్రాంత్ ను వెళ్ళమని అనటంతో అప్పుడే పాపర్స్ చల్లడానికి సిద్ధంగా ఉండమని అంటుంది తిలోత్తమా.

వెంటనే నయని మీరు పాపర్స్తో రంగుల కాగితాలు వెయ్యాలని చేస్తే నేను మరొక ప్రయోగం చేశాను అనటంతో వెంటనే సుమన నా మీద ఏమైనా ప్రయోగం చేసావా అని అంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటూ.. అంత ఆ పైవాడి దయ అని.. తులసమ్మ తోడుగా ఉంటే ఎటువంటివి రావు అని కొన్ని డైలాగులు కొడుతుంది.

ఆ తర్వాత విక్రాంత్ సుమనకు బొట్టు పెట్టి, గాజులు పెట్టి అక్షింతలు చల్లుతాడు. అప్పుడే పాపర్స్ కొట్టడంతో వెంటనే నయని శివ అని పిలుస్తుంది. ఇక రామచిలుక వచ్చి సుమన దంపతులపై తులసి ఆకులు చల్లుతుంది. అదంతా చూసి అందరూ మురిసిపోగా తిలోత్తమా తన ప్లాన్ పాడయింది అని మండిపడుతూ కనిపిస్తుంది. ఇక శివ సుమనను పలకరిస్తాడు. కానీ సుమన మాత్రం వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.

ఇక అందరం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని శివ అక్కడి నుంచి ఎగిరిపోతాడు. విశాల్ కూడా సుమన సీమంతమని నయని రకరకాల వంటకాలు చేసింది అని ఎటువంటి డైట్ లేకుండా బాగా తిందాం అని అంటాడు. ఆ తర్వాత సుమన బెడ్ రూమ్ లో నాగ పాము విగ్రహానికి పూజ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే అక్కడికి వచ్చిన విక్రాంత్ బెడ్రూంలో పూజ ఏంటి అనటంతో.. సీమంతమయ్యాక ఒక అరగంట పడుకున్నప్పుడు తనకు కలలో నాగరాజు వచ్చి పూజ చేయమని అన్నాడని అంటుంది. దాంతో విక్రాంత్ తన ప్రవర్తనకు చిరాకు పడుతూ ఉంటాడు.

also read it : Janaki Kalaganaledhu July 28th: ఇంట్లో నిప్పు పెట్టడానికి ప్లాన్ చేస్తున్న మల్లిక.. వెన్నెలపై అనుమానం పడుతున్న జ్ఞానంబ?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Karthika Deepam 2 Serial Today July 25th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
Illu Illalu Pillalu Serial Today July 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అంబరాన్ని అంటిన సంబరాలు..! రామరాజు ఇంట్లో సందడి మామూలుగా లేదుగా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అంబరాన్ని అంటిన సంబరాలు..! రామరాజు ఇంట్లో సందడి మామూలుగా లేదుగా!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget