అన్వేషించండి
Advertisement
Seethe Ramudi Katnam August 22th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత తండ్రికి జబ్బు నయంకావడానికి విద్యాదేవి కారణమని తెలుసుకున్న మహాలక్ష్మీ ఏం చేసింది..?
Seethe Ramudi Katnam August 22th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతియే విద్యాదేవి రూపంలో ఇంట్లో తిరుగుతోందని మహాలక్ష్మీ అనుమానిస్తుంది. ఆమెపై ఓ కన్నేసి ఉంచమని అర్చనకు చెబుతుంది.
Seethe Ramudi Katnam August 22th: సుమతి గురించి రామ్ పేపర్‌లో ప్రకటన ఇచ్నినా రెస్పాన్స్ రాకపోవడంతో మహాలక్ష్మీ ఇంట్లో అందరితో కలిసి చర్చిస్తుంటుంది. సుమతి ఈ ప్రకటన చూసిందో లేదోనని అనుకుంటారు, అసలు సుమతి బతికి ఉందో లేదో అనుకుంటారు. సుమతి గురించి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారని రేవతి అడగ్గా....సుమతి మహాలక్ష్మీ ప్రెండ్ అని ఆమె భర్త చెబుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన విద్యాదేవి సుమతిపై మహాలక్ష్మీ వేసిన నిందను అందరికి చెబుతుంది. దీనిపై మహాలక్ష్మీ మండిపడుతుంది. అందరూ మర్చిపోయిన విషయాన్ని మళ్లీ ఎందుకు రేపుతున్నారంటుంది. సాటి ఆడదానిగా సుమతి గురించి బాధపడుతున్నాని...మహాలక్ష్మీని చూసి సిగ్గుపడుతున్నాని విద్యాదేవి అంటుంది. ఈ మాటలకు మహాలక్ష్మీ బిగ్గరగా అరుస్తూ మండిపడుతుంది.
మహాలక్ష్మీ: విద్యాదేవిగారు...హద్దుదాటి మాట్లాడుతున్నారు. నా ఇంట్లోనే ఉండి...నన్నే అవమానిస్తున్నారు.
రేవతి: సుమతి వదిన స్థానంలో ఉండి మీరు సుమతి వదినను అవమానించలేదా వదినా.. అనరాని మాటలు అనలేదా..?
చలపతి: ఒకవేలు ఎదుటి వాళ్లవైపుచూపిస్తే...మూడు వేళ్లు మనవైపు చూపిస్తాయి..సుమతి అక్క గురించి నువ్వు అన్నమాటలు ఎప్పటికీ మర్చిపోలేం.
అర్చన: వీళ్లేదో సుమతి అక్క లాయర్స్ అయినట్లు వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు.
మహాలక్ష్మీ: ఈ ఇంట్లో లాయర్ అయినా జడ్జీ అయిన నేనే...నో మోరు డిస్కషన్స్..టాఫిక్ ఓవర్
అంతలోనే బయటి నుంచి రామ్,సీత(Seetha) అక్కడికి చేరుకుంటారు. దీంతో మీ నాన్నకు ఎలా ఉంది పొద్దున్నే ఆస్పత్రికి వెళ్లారని రేవతి వాళ్లను అడుగుతుంది. నాన్నగారికి ఏ సమస్య లేదని డాక్టర్ చెప్పారని సీత చెబుతుంది. డిశ్చార్చ్ అయ్యి ఊరు కూడా వెళ్లిపోయారని చెబుతారు. దీంతో మహాలక్ష్మీ కల్పించుకుని అదేంటి నిన్న కండీషన్ సీరియస్‌గా ఉంది...వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారుగా అంటుంది. సుమతి అక్కను కలవరిస్తున్నాడని చెప్పారు.
సీత: మేం కూడా అదే ఆశ్చర్యపోయాం...రాత్రికి రాత్రి ఏదో అద్భుతం జరిగిందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు
మహాలక్ష్మీ: నిన్న నిజంగా మీ నాన్నకు స్ట్రోక్ వచ్చిందా లేక డ్రామా ఆడారా
సీత: డ్రామాలు ఆడాల్సిన అవసరం మా నాన్నకు లేదత్తయ్యా.. కావాలంటే మీరు ఆస్పత్రికి వెళ్లి విచారించండి.
రామ్: నిన్న నీను కూడా మామయ్య రిపోర్ట్‌లు చూశాను పిన్ని...ఆయనకు వచ్చింది సివియర్ హార్ట్‌స్ట్రోక్.
చలపతి: కొంపదీసి రాత్రి సుమతి అక్క వచ్చి శివకృష్ణ అన్నయ్యను కలిసి వెళ్లిందేమో
రేవతి; నాకు తెలిసి అదే జరిగి ఉంటుంది. సుమతి అక్క రావడం వల్లే శివకృష్ణ కోలుకుని ఉంటారు.
సీత: లేదు పిన్ని....సుమతి అత్త రాలేదు. వచ్చి ఉంటే అమ్మానాన్న మాకు చెప్పి ఉండేవాళ్లు కదా
రామ్; వాళ్ల ఊరి అమ్మవారే కాపాడిందని అత్త, మామయ్య అన్నారు.
సీత: మా ఊరి అమ్మవారు తలుచుకుంటే ఆగిపోయిన గుండె కూడా కొట్టుకుంటుంది.
అందరూ వెళ్లిపోగా అక్కడ అర్చన(Archana), మహాలక్ష్మీ చర్చించుకుంటారు. శివకృష్ణకు గుండెనొప్పి అయినా రాకపోయి ఉండాలి లేదా గ్యాస్ పెయిన్ అయినా అయి ఉండాలి అంటుంది. లేకపోతే సుమతి వచ్చిం ఉండాలి అనగానే...ఆస్పత్రి వద్ద మనం పెట్టిన రౌడీలు సుమతి వచ్చినట్లు చెప్పాలి కదా అని అర్చన అంటుంది. దీంతో మహాలక్ష్మీ ఆస్పత్రి వద్ద ఉన్న రౌడీలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఆదేశిస్తుంది. వాళ్లు వచ్చి సుమతి రాలేదని...శివకృష్ణ(Siva krishna) మాత్రం డిశ్చార్చి అయి వెళ్లిపోయాడని చెబుతారు. అప్పుడే అక్కడ విద్యాదేవిని చూసిన రౌడీలు ఆమె ఆస్పత్రికి వచ్చిన విషయాన్ని చెబుతారు. శివకృష్ణను ఆమె కలిసి మాట్లాడరని చెబుతారు. దీంతో మహాలక్ష్మీ వారిని అక్కడి నుంచి పంపివేస్తుంది. ఈ విద్యాదేవి ఆస్పత్రికి ఎందుకు వెళ్లిందని మహాలక్ష్మీ అంటుండగా....సీత అంటే ఆమెకు ఇష్టం కాబట్టి వాళ్ల నాన్నని చూడడానికి వెళ్లి ఉంటుందిలే అని అర్చన సముదాయిస్తుంది. కానీ నాకు ఏదో డౌట్ వస్తుందని అని మహాలక్ష్మీ అనుమానిస్తుంటుంది.
ఇంతలోనే సీత వచ్చి విద్యాదేవికి థ్యాంక్సు చెబుతుంది . మా నాన్నకు ఏం కాలేదని మీరు ధైర్యం చెప్పారని అంటుంది. ఈ మాటలు విన్న మహాలక్ష్మీ, అర్చన..విద్యాదేవి ప్రవర్తనపై అనుమానిస్తారు. సీతకు ధైర్యం చెప్పిన విద్యాదేవి...ఆస్పత్రికి వెళ్లి వాళ్ల నాన్నను కలిసిన సంగతి మాత్రం ఎందుకు చెప్పలేదని అనుకుంటారు.
మహా: ఈ విద్యాదేవి ఇంచుమించు సుమతిలా ప్రవర్తిస్తోందని మహా అంటుంంది. అప్పుడప్పుడు సుమతిలా మాట్లాడుతోంది.
అర్చన: సుమతికి విద్యాదేవి తెలిసి ఉంటుంది. ఆ సుమతే ఈమెను ఇక్కడికి పంపించి ఉంటుంది.
మహా: సుమతికి విద్యాదేవికి మనకు తెలియని ఏదో కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ శివకృష్ణ, లలితకు తెలిసి ఉంటుంది. అందుకే ఆస్పత్రికి వెళ్లింది
అర్చన: అయితే సుమతి ఎక్కడ ఉందో ఈ విద్యాదేవికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది
మహా: ఆ విషయం పక్కాగా తెలియాలి అంటే..ముందు ఈ విద్యాదేవి ఎవరో...ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఈమెపై ఫోకస్ పెట్టాలి.
అర్చన: కానీ ఆవిడ తన గురించి ఏం చెప్పట్లేదు కదా మహా...
మహా: ముందు ఈవిడ కేరాఫ్ అడ్రస్ కనుక్కుంటే అన్ని విషయాలు అవే బయటకు వస్తాయి.
అర్చన: అలాగే మహా...ఇకపై నా ఫోకస్ మొత్తం విద్యాదేవిపైనే ఉంచుతా
సుమతి కొత్త రూపంలో తనవాళ్లమద్యే ఉండటంపై శివకృష్ణ లలిత చర్చించుకుంటారు. మహాలక్ష్మీ వల్లే సుమతికి ఈ గతి పట్టిందని అనుకుంటారు. ఇంతలో సీత ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంది. అంతా బాగానే ఉందని చెప్పగా...నీకు గుండెనొప్పి వచ్చిందని చెప్పినా సుమతి అత్త రాలేకపోవడంపై సీత కోప్పడుతుంది. ఇదంతా పక్కనే ఉండి విద్యాదేవి వింటుంది. మా నాన్న చావుబతుకుల మధ్య ఉన్నా అత్తమ్మ రాలేదని సీత అనగా...మీ అత్తమ్మ ఏ పరిస్థితుల్లో ఉండి రాలేకపోయిందోనని ఆమె అంటుంది. ఇవన్నీ ఆలోచించకుండా సుమతిపై ద్వేషం పెంచుకుంటే ఎలా సీత అని అంటుంది. ఇంతలో అక్కడికి రామ్ వస్తాడు. మీ అమ్మ తప్పకుండా రావాల్సిన టైంకి వస్తుందని అతనితో విద్యాదేవి అంటుంది.
ఈ మాటలన్నీ పక్కనే ఉండి అన్నీ మహాలక్ష్మీ వింటుంది. సుమతి ఎందుకు రాలేకపోయిందో ఈ విద్యాదేవికి తెలుసు అనుకుంటుంది. ఈ విద్యాదేవి నిజంగా సుమతి మారురూపం కాదుకదా అని అనుమానిస్తుంది.
సీత డబ్బులు సర్దుబాటు చేస్తానని చెప్పింది కానీ...మళ్లీ ఆ వియమే ఎత్తకపోవడంతో వాళ్ల అక్క మదనపడుతుంది. నాన్నకు హార్ట్‌స్ట్రోక్ రావడంతో ఈ విషయమే మర్చిపోయాం అనుకుంటుంది మధు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆమె తోడికోడలు...సీత డబ్బులు పంపకపోవడంపై దెప్పిపొడుస్తుంది. వెంటనే మహాలక్ష్మీకి ఫోన్ చేసి ఆమె ఏం చెబితే అది చేశావంటే..ఆమె చిటికెలో డబ్బులు పంపుతుందని సలహా ఇస్తుంది. దీంతో మధు తోడికోడలుపై మండిపడుతుంది. ఇన్నాళ్లు ఆవిడ చెప్పినట్లు చేశావ్ కదా...ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావ్ అనగానే...బుద్దిగడ్డి తిని ఇన్నాళ్లు ఆమె చెప్పినట్లు చేశాను. మళ్లీ అలాంటి తప్పుడు పనులు చేయను అంటుంది. ఇంకా ఏదో చెప్పబోతుండగా...ఇంకోసారి మహాలక్ష్మీ ప్రస్తావన నా దగ్గర తెచ్చావంటే గరిట కాల్చి నోటిపై వాతలుప పెడతానని హెచ్చరించడంతో ఈ రోజు ఏపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion