అన్వేషించండి

Satyabhama Serial Today May 7th : సత్యభామ సీరియల్: అగ్నికి ఆహుతైపోయిన క్రిష్, సత్యల వారసత్వ ముడుపు.. తాళి తీసేసిన నందిని.. అడ్డుకున్న విశాలాక్షి!

Satyabhama Serial Today Episode : వారసుల కోసం క్రిష్ సత్యలతో కట్టించిన ముడుపు సత్య వెలిగించిన దీపం వల్ల కాలి బూడిదవ్వడంతో అందరూ సత్యని తిడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode : హర్ష నందిని కోసం చికెన్ తీసుకొని వెళ్తే నందిని భర్తని అవమానిస్తుంది. దీంతో హర్ష తన తండ్రి చెప్పాడు కాబట్టి నీ కోసం వచ్చి తప్పు చేశానని నువ్వు అస్సలు మారవని అనేసి పడుకుండి పోతాడు. ఇక నందిని మధ్యరాత్రి లేచి చికెన్‌ చూసి హర్ష చూడకుండా తినాలని అనుకుంటుంది. ముసుగు వేసుకొని చికెన్‌ దుప్పట్లో దూరి చికెన్ లాగించేస్తుంది. ఇంతలో హర్ష వాటర్ అందిస్తాడు. నీరు తీసుకున్న నందిని హర్షని పట్టించుకోకుండా చికెన్ తింటూనే ఉంటుంది. దీంతో హర్ష లైట్ వేస్తాడు. నందినిని చూసి నవ్వుతాడు. 

మరోవైపు సత్య ఇంట్లో పూజ చేస్తుంటుంది. క్రిష్ నానమ్మ సత్యను పాట పాడమని అంటుంది. సత్య తన గొంతు బాలేదు అంటుంది. అయినా పాడమని గంట కొడితే మహదేవయ్య పెద్దావిడ అన్ని సార్లు అడుగుతుంటే బతిమాలించుకోవడం ఎందుకు పాడమని అంటాడు. దీంతో సత్య మనసులో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినప్పటి నుంచి క్రిష్ మీద అతని కుటుంబం మీద విరక్తి వస్తుందని అనుకొంటుంది. ఇంతలో క్రిష్ అక్కడికి వస్తాడు. సత్య పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. ఇంతలో దీపం ముడుపు మీద పడిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. భైరవి ఏడుస్తుంది. క్రిష్, రుద్ర మంటను ఆపుతారు.

భైరవి: శని.. శని దేవత.

మహదేవయ్య: క్రిష్ నానమ్మ గంట కొట్టడంతో.. అమ్మా నువ్వు ఆపుతావా. దీని నిర్లక్ష్యం వల్ల ఏం జరిగిందో చూశావు కదా. దీపం వెలగాల్సిన ఇంట్లో మంట వచ్చింది. నైవేద్యం పెట్టాల్సిన స్థానంలో అది కట్టిన ముడుపు నైవేద్యంగా మారింది. హారతి కర్పూరం అయిపోయింది. బూడిద మిగిలింది చూశావు కదా. 

సత్య: ఆ మంటలు ఎలా అంటుకున్నాయో ఆ ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు మామయ్య.

భైరవి: కళ్లు నెత్తిన పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది. ప్రతీ సారి తప్పు చేసి ఆ తప్పు ఒప్పుకోకపోవడంలో కూడా లోపమే. ఇన్ని సంవత్సరాల మన ఇంట్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా చెప్పయ్యా. వారసుల కోసం కట్టిన ముడుపు కాలి బూడిద అయిపోయింది. అమ్మవారు నీకే కాదు వంశానికే శాపం పెట్టినట్లు అవుతుంది నీ వల్ల. అంతా నీ వల్లనే.

క్రిష్: అమ్మా..

రుద్ర: రేయ్ నువ్వు ఆగు.. ఈ ఇంట్లో నీ కంటే పెద్దొళ్లకి సూక్తులు చెప్పడానికి నోరు లెగుస్తుంది. అందరి తప్పులు ఎత్తి చూపడానికి నోరు లేస్తుంది. తన వరకు వచ్చే సరికి బుద్ధిమంతురాలిగా ముఖం పెడుతుంది. నీ పెళ్లాం నన్ను మాటలు అంటుందిరా ఒకసారి అడుగు అంటే అప్పుడేమన్నావ్. నాకు సంబంధం లేదు అన్నావ్. నువ్వు ఆమె మాట్లాడుకోండి అన్నావా లేదా ఇప్పుడు ఎందుకు మధ్యలో వస్తున్నావ్. 

భైరవి: దీని వల్ల ఎవరికీ ప్రశాంతత లేదు నా కూతురితో సహా. ఎక్కడ నుంచి దాపరించిందో ఏంటో. నువ్వెందుకు ఏడుస్తున్నావే.. ఏడ్వాల్సింది మేము. నువ్వేందయ్యా ఏం మాట్లాడవు.

మహదేవయ్య: నా కొడుకు తప్పు చేస్తేనే వదలను. కాల్చిపారేస్తా. ఆడది కాబట్టి నా కోడలు కాబట్టి చేతులు ముడుచుకొని కూర్చొన్నా లేదంటే కాలిపోయిన ముడుపు జాగాలో నువ్వుండేదానివి. భైరవి ఆ పంతులికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. 

మరోవైపు నందిని చిరాకు పెడుతుంది అని తాళి తీసేయాలి అని తీయబోతే విశాలాక్షి వచ్చి అడ్డుకుంటుంది. దీంతో నందిని అత్త మీద ఫైర్ అవుతుంది. దాంతో విశాలాక్షి కోడలికి నచ్చచెప్పి ఒక్క రోజు ఓపిక పట్టమని చెప్తుంది. దీంతో నందిని సరే అంటుంది. విశాలాక్షి భర్త దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది. 

విశ్వనాథం: అవును రేపు పదహారు రోజుల పండగ కదా. సత్య సంగతి ఏంటి. ఒకసారి వియ్యపురాలికి ఫోన్ చేసి కనుక్కో ఆవిడ ఇక్కడికి వస్తుందేమో.

విశాలాక్షి: ఆవిడ దేనికి సరిగా సమాధానం చెప్పదు.  

విశ్వనాథం: ఏం చేస్తామ్ మన బాధ్యత మనం చేయాలి కదా.

విశాలాక్షి: సరే చేస్తాను..  

మరోవైపు మహాదేవయ్య ఇంటికి పంతులు వస్తారు. వారసుడి కోసం కట్టిన ముడుపు అలా అవ్వడం మామూలు విషయం కాదని అరిష్టమని అంటాడు. క్రిష్, సత్యల గ్రహబలం మాంగల్య బలం చాలా బలహీనంగా ఉందని అంటాడు. జాతకం ప్రకారం వాళ్లకి గడ్డు కాలం నడుస్తుందని అంటాడు. దానికి క్రిష్ మనసులో అది చెప్పడానికి జాతకం చూడాల్సిన పనిలేదు మా ముఖాలు చూస్తే సరిపోతుందని అనుకుంటాడు. ఇక పరిహారం చేయాలని పంతులు చెప్తాడు. ఇంతలో భైరవికి విశాలాక్షి కాల్ చేస్తుంది. దీంతో గుడికి రమ్మని పూజలు పరిహారాలు అక్కడే చేద్దామని మహాదేవయ్య చెప్పమని అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : ముకుంద డబుల్ గేమ్ తెలుసుకున్న కృష్ణ.. మురారి పక్కన చూసి రచ్చ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?
Embed widget