అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today May 7th: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : ముకుంద డబుల్ గేమ్ తెలుసుకున్న కృష్ణ.. మురారి పక్కన చూసి రచ్చ!

Krishna Mukunda Murari Serial Today Episode : ముకుందని కారులో ఇంటికి తీసుకొచ్చిన మురారి మీద కృష్ణ సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode  : ముకుంద సరోగసి మదర్ తానే అని మురారికి చెప్పేస్తుంది. ఇక మురారి ఇంటికి బయల్దేరుతాడు. అది చూసిన ముకుంద తానే తమ బిడ్డని మోయబోతున్నా అని తెలిసి కూడా ఇంటికి తీసుకెళ్తానని పిలవడం లేదని ఫీలవుతుంది. ఇంతలో మురారి ముకుందని పిలుస్తాడు. 

ముకుంద సంతోషంగా మురారి దగ్గరకు వెళ్తుంది. మురారి తాను ఇంటికే వెళ్తున్నా డ్రాప్ చేస్తా అంటాడు. లోపల ముకుంద సంతోషపడినప్పటికీ పైకి మాత్రం వద్దు అనేస్తుంది. 

మురారి: నాకెందుకు ఇబ్బంది నేను ఏమైనా మోసుకెళ్తానా. వాస్తవానికి నువ్వే మా బిడ్డని మోయబోతున్నావ్. నిన్ను కాలు కింద పెట్టకుండా మేం చూసుకోవాలి. అంటూ ముకుంద చేయి పట్టుకొని తీసుకెళ్లి కారులో కూర్చొపెడతాడు. 

సంగీత డల్‌గా హాల్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మధు వచ్చి సంగీతని ఫొటోలు తీస్తాడు. దాంతో సంగీత ఏంటి బావ ఏడుపు ముఖానికి ఫొటోలు తీశావ్ డిలీట్ చేయ్ అంటుంది. 

మధు: చూశావా ఏడుపు ముఖంలో ఫొటోలు ఏడ్చినట్లున్నాయ్. అవును ఈ ఏడుపు ముఖానికి కారణం ఏంటి.

సంగీత: ఏం చెప్పమంటావ్ బావ ఎప్పుడూ ఉన్నదే. ఆదర్శ్ బావ నన్ను చూడట్లేదు అంటే ఎలా అయినా వలలో వేసుకో అంటుంది మా అమ్మ. 

మధు: నేను నీకు ఏం చెప్పాను. నిన్ను బాగా చూసుకునే వాడినే పెళ్లి చేసుకోమన్నాను కదా. 

సంగీత: మా అమ్మ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు బావ. 

మధు: ఓ పని చేయు సంగీత. ఈ అమ్మ చూసినప్పుడు ఆదర్శ్ దగ్గరకు వెళ్లు తిడతాడు కదా అప్పుడు మీ అమ్మకి అర్థమవుతుంది.

సంగీత: నేను అదే అనుకున్నా కానీ ఆ మీరా ఉంది కదా మా అమ్మకి మాట ఇచ్చింది. ఆదర్శ్‌తో నీ కూతురు పెళ్లి చేస్తా అని.

మధు: ఏంటి మీరా నీకు ఆదర్శ్‌కి పెళ్లి చేస్తా అందా..

సంగీత: అవును బావ. తనేమో ఆదర్శ్‌తో క్లోజ్‌గా ఉంటుందని మా అమ్మ ఆవిడని నిలదీసింది. దాంతో ఆవిడ ఆదర్శ్ బావకి తనకు మధ్య ఏం లేదన నాతో పెళ్లి చేస్తానని మాటిచ్చింది. చెప్పు బావ వాళ్లిద్దరినీ చూస్తే ఇద్దరి మధ్య ఏదో ఉందని నీకు డౌట్ రావడం లేదా. వస్తుంది కదా మా అమ్మేమో పిచ్చిదానిలా దాని మాట వింటుంది. 

మధు: సర్లే నాలుగు రోజులు ఆగితే అంతా బయట పడుతుంది. నువ్వు ఆ విషయం వదిలేయ్.. మనసులో.. ఈ మీరా ఇంత పని చేస్తుందా వెంటనే కృష్ణకు చెప్పాలి. 

కృష్ణ బయట మురారి కోసం ఎదురు చూస్తుంటుంది. అక్కడికి మధు వచ్చి విషయం కృష్ణతో చెప్తాడు. కృష్ణ తనకు ముందే తెలుసని అంటుంది. ఆదర్శ్‌ మీరాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉండటం వల్ల అందరూ చూసి కూడా ఏమీ అనడం  లేదు మరి ఇదేంటి కృష్ణ అని మధు అడుగుతాడు. 

కృష్ణ: మీరా ఎందుకు ఇలా చేస్తుంది మధు తప్పు కదా.

మధు: తప్పు కాదు ఇలా డబుల్ గేమ్స్ ఆడటం దారుణం. అటు ఆదర్శ్‌ ఇటు సంగీత ఇద్దరూ మీరా మీద ఆశలు పెట్టుకున్నారు కదా. సంగీతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే ఇప్పుడు వరకు క్లోజ్‌గా ఉండి ఒక్క సారి పక్కన పెడితే ఆదర్శ్ ఏమైపోతాడు. అలా అని ఆదర్శ్‌ని పెళ్లి చేసుకుంటే తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని రజిని అత్త ఏడుస్తుంది కదా. 

కృష్ణ: మీరా ఇలాంటిది అని అస్సలు ఊహించలేదు మధు. ఆదర్శ్‌ కాకపోతే సంగీత పెళ్లి ఇంకొకరితో జరిపించొచ్చు. కానీ క్లోజ్‌గా ఉండి ఆశలు పెట్టి ఒక్కసారి వదిలేస్తే ఆదర్శ్‌ ఏమైపోతాడు. ఒకప్పుడు ఇలాగే ముకుంద మీద ఆశలు పెంచుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ ముకుంద మీద ప్రేమ చావక ఈ మీరాకు ముకుంద అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరా మోసం చేస్తే పిచ్చివాడు అయిపోతాడు. ఏదో ఒకటి చేయాలి.

మధు: నువ్వే ఏదో ఒకటి చేయు కృష్ణ నేను ఆదర్శ్‌ విషయంలో వేలు పెట్టను. 

మధు లోపలకి వెళ్లిపోతాడు. కృష్ణ అక్కడే ఉంటే రేవతి వస్తుంది. ఏంటి కృష్ణ ఇక్కడ ఉన్నావ్ అనుకుంటుంది. ఇంతలో ముకుంద, మురారి కలిసి రావడం చూస్తారు. కృష్ణ మనసులో ఈవిడేంటి ఏసీపీ సార్‌తో వస్తుందని అనుకుంటుంది. 

రేవతి: ఏంట్రా నువ్వు కడుపుతో ఉన్న దాన్ని ఒంటరిగా పంపించి ఏమీ లేని దాన్ని కారులో తీసుకొస్తావా. 

మురారి: నేను వస్తుంటే మీరా ఎండలో కనిపించింది. అందుకే లిఫ్ట్ ఇచ్చా.

రేవతి: నువ్వు ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వరా కానీ కృష్ణని ఒంటరిగా వదలకు. 

ముకుంద: మనసులో.. నేను కారులో మురారి పక్కన కూర్చొవడం చూసి అత్తాకోడళ్లకి మండినట్లుంది. ఇకపై ఈ మంట ఎక్కువవుతుంది. 

మురారి: ముకుంద వెళ్లిపోవడంతో.. తను ఫీలైందమ్మ. ఎవరైనా అలా ముఖం మీద అంటారా. నేను ఎందుకు అలా చేశానో కృష్ణకు తెలుసు నేనేమైనా చేస్తే కృష్ణ ఊరుకుంటుందా. లోపలికి వచ్చిన కృష్ణతో.. నేను బయట నుంచి రాగానే వెళ్లిన పని ఏమైందని ఎంతో సంతోషంగా అడుగుతావు అనుకుంటే ఇలా అలిగి వచ్చేశావ్ ఏంటి. 

కృష్ణ: ఆవిడ ఏ ఆటోలోనో క్యాబ్‌లోని వచ్చుండేది కదా.

మురారి: మీ ఆడవాళ్లకు ఎన్ని సమస్యలు ఉన్నా మొగుడి పక్కన మరో ఆడదాన్ని చూస్తే అదే పెద్ద సమస్య అయిపోతుంది కదా. ఏయ్ తింగరి తను ఎండలో ఉంటే లిఫ్ట్ ఇచ్చా అంతే. 

కృష్ణ: తప్పుడు మనుషులకు సాయం చేయడం కూడా తప్పే. 

మురారి: మీరా తప్పుడు మనిషా.. అసలు మీరా మనకోసం ఏం చేసిందో తెలుసా.. (సరోగసి మదర్ మీరా అని చెపుదాం అనుకుంటే మీరా మీద తప్పుడు అభిప్రాయంతో ఉంది ముందు ఆ అభిప్రాయం మార్చాలి.)

కృష్ణ: తను చాలా తేడా.. తనకు దూరంగా ఉండండి. ఇలా అందరూ మంచిది మంచిది అనడం వల్లే ఆవిడ ఎక్స్‌ట్రాలు చేస్తుంది. తనకు దూరంగా ఉండండి. 

ఇక కృష్ణ సరోగసీ మదర్ గురించి అడిగితే మురారి ఇంకా తెలీదు అనేస్తాడు.  మరోవైపు భవాని ఇంటికి తన ఫ్రెండ్ డాక్టర్ అమృత వస్తుంది. ఇక తన కోడలు ప్రెగ్నెంట్ అని అందుకే పిలిపించానని అంటుంది. ఇక కృష్ణ మురారిలు కూడా అక్కడికి రావడంతో భవాని తన ఫ్రెండ్‌ని కృష్ణకు పరిచయం చేస్తుంది. ఆవిడ టెస్ట్‌లు చేసి ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తుందని అనడంతో కృష్ణ షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమకు గుర్రం కాళ్లతో షాక్ ఇచ్చి భయపెట్టిన గాయత్రీ పాప.. వాయు చావు వెనక కుట్ర నయని తెలుసుకుంటుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Embed widget