అన్వేషించండి

Satyabhama Serial Today October 7th: సత్యభామ సీరియల్: అయ్యో క్రిష్.. ఫస్ట్ నైట్ కోసం ఎన్ని తిప్పలొచ్చాయ్ నీకు?.. ఆస్తిలో వాటా ఇస్తారా అని ప్రశ్నించిన సత్య!

Satyabhama Today Episode సత్య తన ఫ్రెండ్ హాస్టల్ అడ్రస్ చెప్పి తన గది నెంబరు కనుక్కుంటే మన ఫస్ట్ నైట్ అని క్రిష్‌కి మరో టాస్క్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య పుట్టిన నెల తెలుసుకోవడం కోసం క్రిష్ చాలా తిప్పలు పడతాడు. ఇక చివరగా తన బామ్మ జయమ్మ పురాణాలు చదువుతుంది కదా తనకు తెలుగు నెలలు తెలుస్తాయని అనుకొని వెళ్లి అడుగుతాడు. అర్జునుడిని తలచుకోగానే గుర్తొచ్చే నెల ఏది అని అడుగుతాడు. 

జయమ్మ: ఈ తెలుగు నీ బుర్రకి రాదు కానీ ఈ ప్రశ్న నీకు ఎవరు అడిగారు.
క్రిష్: సత్య
జయమ్మ: అది సంగతి.. అర్జునుడికి మరో పేరు ఫాల్గుణ ఫాల్గుణ మాసం అంటే మార్చి నెల. 
క్రిష్: చెప్పావులే సమాధానం. నీ పురాణాలు నువ్వు చదువుకో.
సత్య ఇంత ఫిటింగ్ పెట్టావా వస్తున్నా. ఏయ్ సత్యా అంటూ తీన్మార్ డ్యాన్స్ వేసుకొని గదిలోకి వెళ్తాడు. 

సత్య ఏమైందని అడిగితే మార్చి నీ పుట్టిన నెల అని చెప్తాడు. బాగానే తెలుసుకున్నావ్ అని సత్య అంటుంది. ఇక క్రిష్ సత్యతో ఇక మన ఫస్ట్ నైట్ అని అంటాడు. దానికి సత్య బెడ్‌కి ఒక చివర కూర్చొని క్రిష్‌ని మరో చివర కూర్చొబెట్టి ఇదే మన ఫస్ట్ నైట్ అంటుంది. దానికి క్రిష్ ఇదేమైన వంట గది అనుకున్నావా నువ్వు ఓ చివర నేను ఓ చివర కూర్చొంటే ఫస్ట్ నైట్ ఏంటి అని అడుగుతాడు.  దానికి సత్య సగం సగం తెలుసుకుంటే ఇలాగే ఉంటుందని అంటుంది. క్రిష్‌ షాక్ అయిపోతాడు. దానికి సత్య పుట్టిన సంవత్సరం, నెల తెలుసుకుంటే సరిపోదు డేట్ కూడా తెలుసుకోవాలని అంటుంది. క్రిష్ తల పట్టుకుంటాడు. ఫస్ట్ నైట్ పేరుతో తనతో ఆడుకుంటున్నావని అంటాడు. నా శాపం నీకు తగులుతుందని అంటాడు. దానికి సత్య పాపమో శాపమో మిగిలిన ఆ ఒక్కటీ కనుక్కొ అని క్రిష్‌ని కావాలనే కవ్విస్తుంది. 

ఇక క్రిష్‌ క్లూ అడుగుతాడు. దానికి సత్య తన ఫ్రెండ్ ఫొటో చూపిస్తుంది. దానికి క్రిష్ కత్తిలా ఉంది అంటే సత్య కోపంగా చూస్తుంది. ఇక తన ఫ్రెండ్ ఉండే హాస్టల్ అడ్రస్ చెప్పి తన గది నెంబరే నా పుట్టిన రోజు అని అంటుంది. క్రిష్ ఛాలెంజ్ ఒప్పుకుంటాడు. మరోవైపు మైత్రి తన ఫ్రెండ్ సంగీతతో మాట్లాడుతుంది. ఇంతలో హర్ష అక్కడికి వచ్చి సంగీతతో మాట్లాడుతాడు. ఇక మైత్రితో మాట్లాడాలని సంగీత అంటే రేపు తనని తీసుకొని వస్తానని చెప్తాడు. రేపు ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు డ్రాప్ చేసి వచ్చేటప్పుడు పిక్ చేసుకుంటా అని చెప్తాడు. ఇక క్రిష్ సత్య చెప్పిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ దగ్గరకు తన గ్యాంగ్‌తో వెళ్తాడు. లోపలికి వెళ్దామని అంటే బాబీ ఆపి సెక్యూరిటీ ఉన్నాడని లోపలికి వెళ్లడం కష్టమని అంటాడు. డైరెక్ట్‌గా వెళ్దామని క్రిష్ అంటే బాబీ తనని సెక్యూరిటీ కొట్టినట్లు ఊహించుకొని ఆగిపోతాడు. తర్వాత ఇద్దరూ వెళ్తే సెక్యూరిటీ ఇద్దరిని ఆపేస్తాడు. ఓ అమ్మాయిని కలవడానికి వెళ్తామంటే సెక్యూరిటీ వెళ్లనివ్వడు. క్రిష్ ఎంత కాకా పట్టిన ప్రయోజనం ఉండదు. ఇద్దరినీ గెంటేస్తాడు. రాత్రి గోడ దూకి గది నెంబరు తెలుసుకుందామని అంటాడు. 

ఇక మహదేవయ్య ఇంట్లో అందరూ రేణుక సీమంతం కోసం అందరూ చీరలు సెలక్ట్ చేసుకుంటారు. రేణుక కోసం రుద్రకి చీర సెలక్ట్ చేయమని అంటుంది సత్య. ఇక మహదేవయ్య వచ్చి మాల్‌కి తీసుకెళ్లమంటే ఇంట్లోకి తెప్పించి చూపిస్తావేంట్రా అంటాడు. దానికి రుద్ర నా పెళ్లం అంత అందగత్తె కాదు దానికి ఇదే ఇక్కువ అంటాడు. ఆ మాటతో సత్య భార్యని అందరిలో కించపరచకూడదని బావగారికి క్లాస్ ఇస్తుంది. వాడేదో సరదాగా అన్నాడని భైరవి కవర్ చేస్తుంది. ఇక భైరవి ఓ చీర సెలక్ట్ చేస్తుంది. సత్య ఆ చీర బాగుందని చెప్పి బావగారు ఈ చీర ఎలా ఉందని అడుగుతుంది. ఇక సత్య మామని చూసి భైరవితో మీ చిన్న కొడుకుకు వారసుడు వచ్చే టైంకి మామయ్య ఇంత హంగామా చేస్తారా అని అడుగుతుంది. తాత ఆస్తిలో ఆ వారసుడికి వాటా ఉంటుందా అని అడుగుతుంది. దాంతో భైరవి ఆలూ లేదు సూలు అప్పుడే ఆస్తిలో వాటా కావాల్సి  వచ్చిందా అని అంటుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అన్ని వైపుల నుంచి ముంచుకొస్తున్న ముప్పు.. సూర్యకి నిజం తెలుస్తుందా? రాజుకి పెళ్లి జరిగిపోతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget