(Source: ECI/ABP News/ABP Majha)
Ammayi garu Serial Today October 5th Episode: అన్ని వైపుల నుంచి ముంచుకొస్తున్న ముప్పు.. సూర్యకి నిజం తెలుస్తుందా? రాజుకి పెళ్లి జరిగిపోతుందా?
Ammayi garu Today Episode రాఘవని దీపక్ కిడ్నాప్ చేయడం రూప విలేకర్‌తో జీవన్ ఆడించిన నాటకం వీడియో తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode జీవన్ చేసిన కుట్ర గురించి రాజు తెలుసుకుంటాడు. రాజు రూపకి కాల్ చేసి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. రూప కూడా నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అని రాఘవ కోమా నుంచి లేచాడని అంటుంది. రాజు చాలా సంతోషిస్తాడు. రాఘవని తీసుకొని వస్తానని అమ్మ చెప్పిందని అంటుంది.
రూప: నాన్నని గుడి దగ్గరకు రమ్మని చెప్తే వాళ్లనే ఇంటి దగ్గరకు రమ్మని చెప్తున్నారు. ఇప్పుడేం చేద్దాం రాజు నాన్న రారు.
రాజు: పెద్దయ్యా గారు కచ్చితంగా వస్తారమ్మా అమ్మాయి గారు కానీ అంత కంటే ఓ ముఖ్యమైన విషయం చెప్తాను.. మన ఆర్ ఆర్ కంపెనీ కూల్చేయడానికి ఆదేశాలు ఇచ్చింది పెద్దయ్య గారే అయినా అలా ఇచ్చేలా చేసింది మాత్రం జీవన్, శ్వేతలే.
రూప: రాజు ఈ విషయం నాన్నకి తెలిసినా వాళ్ల మీద కోపంతో అయినా వస్తారు.
రాజు: అమ్మాయి గారు జీవన్ ఆ విలేకర్‌తో మాట్లాడటం నేను చూశాను ఆయన కలెక్టర్‌ని కలవడానికి వెళ్లారు. నువ్వు వాళ్లని ఫాలో అయితే మనకు సాయం అవుతుంది.
రూప: సరే రాజు.
విరూపాక్షి: రాఘవ నీకు ఇబ్బందిగా లేదుగా పోయిన సారి నువ్వు దొరికనట్లే దొరికి మాయం అయ్యావ్ ఇప్పుడు అలా అవ్వకూడదు. నువ్వు చెప్పే నిజం నా జీవితంతో పాటు రూప జీవితం కూడా బాగుపడుతుంది. సూర్యని చూసి భయపడకు.
రాఘన: సరే అమ్మగారు. నేను బతికున్నదే పెద్దయ్య గారికి నిజం చెప్పడానికి అమ్మాయి గారు. ఆ దేవుడి సమక్షంలో నా దేవుడికి నిజం చెప్తానమ్మగారు. దేవత లాంటి మీ మీద నా వల్ల పడిన నింద చెరిపేస్తానమ్మాగారు.
రూప విలేకర్‌ని ఫాలో అవుతుంది. మరోవైపు రాజు పెళ్లి పీటల మీద కూర్చొంటాడు. విరూపాక్షి వాళ్లు వస్తుంటారు. విజయాంబిక రూప గదిలో ఉందో లేదో చూడటానికి వెళ్తుంది రూప కనిపించకపోవడంతో సూర్యప్రతాప్‌కి విషయం చెప్తుంది. రాజు దగ్గరకు వెళ్లుంటుందని రెచ్చగొడుతుంది. దాంతో సూర్య ప్రతాప్ రాజుని తలచుకొని చచ్చావ్రా నా చేతిలో అనుకుంటూ వెళ్తాడు. రూప రాజుకి కాల్ చేస్తే ముత్యాలు ఫోన్ తీసుకుంటుంది. ఇక విలేకర్‌కి జీవన్ తాలూక ఆఫీసర్ డబ్బు ఇస్తాడు. కావాలనే ఆర్ ఆర్ కంపెనీ కూల్చేసినట్లు చేయడం ఇవన్నీ బయటకు రాకూడదని అంటాడు. ఆ మాటల్నీ రూప వీడియో తీస్తుంది. ఇంతలో రౌడీలు రూపని కిడ్నాప్ చేస్తారు. రాజు రూపకి విషయం చెప్పడం జీవన్ విని కావాలనే రౌడీలతో రూపని తీసుకెళ్లమని చెప్తాడు. ఇక అప్పలనాయుడు తన ఫోన్ నుంచి రూపకి కాల్ చేస్తే రూప ఎత్తదు.
రాజు టెన్షన్ పడతాడు. మరోవైపు రూప ఫోన్ స్విచ్ ఆప్ వస్తుండటంతో విరూపాక్షి టెన్షన్ పడుతుంది. ఇక రాఘవ తనని విజయాంబిక చంపేస్తుందని అనుకుంటాడు. విరూపాక్షి కూడా తనకు ఏదో కీడు శంకిస్తుందని అంటుంది. శ్వేత కూడా పెళ్లి జరుగుతుందో లేదో అని టెన్షన్ పడుతుంది. శ్వేత కూడా పెళ్లి పీటల మీద కూర్చొంటుంది. ఇక విరూపాక్షి వాళ్లు గుడి దగ్గరకు రావడం ఇంతలో విరూపాక్షి దిగగానే రాఘవని తీసుకొని వ్యాన్ డ్రైవర్ వెళ్లిపోతాడు. వ్యాన్ డ్రైవర్‌గా దీపక్ వస్తాడు.. దీపక్‌ని చూసి రాఘవ షాక్ అయిపోతాడు. మా అమ్మ గురించి నిజం చెప్పి దేవుడు అయిపోవాలి అనుకుంటున్నావా అని రాఘవ అంటే దీపక్ రాఘవని కొట్టేస్తాడు. ఇక రాఘవ తన దగ్గరే ఉన్నాడని దీపక్ తల్లికి చెప్తాడు. విరూపాక్షి గుడి దగ్గరకు వెళ్లి రాజు, శ్వేతలను చూసి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.