అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today September 4th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: పూజలో గత జన్మ గుర్తు చేసుకున్న గౌరి, శంకర్ – శ్రావణి, సంధ్యలకు ప్రపోజ్ చేసిన పెద్దొడు, చిన్నోడు

Prema Entha Madhuram Today Episode: వరలక్మీ వ్రతంలో గౌరి, శంకర్ ఒక్కటయ్యేలా జ్యోతి ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  జ్యోతి చేస్తున్న వరలక్ష్మీ వ్రతానికి వచ్చిన గౌరి, శంకర్‌ లు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని అలా కలసి ఉండాలంటే మనమే ఇవాళే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటారు అకి, జ్యోతి. ఇంతలో శంకర్‌, గౌరీలకు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. మీరు ఈ ట్రెడిషనల్‌ డ్రెస్‌లో చాలా బాగున్నారని అకి అంటుంది. బెస్ట్‌ కపుల్‌ ఫ్రోంగ్రాం కన్నా ఇక్కడే బాగా కనిపిస్తున్నారు అని అకి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఇంతలో అకి తేరుకుని ఆ ఫ్రోగ్రాంలో ఉన్న వారికంటే మీరే చాలా బాగున్నారు అంటుంది. తర్వాత అందరూ లోపలికి వెళ్లిన తర్వాత జ్యోతి తలతిక్కగా ప్రవర్తిస్తూ యాదగిరికి బీపీ రేజ్‌ అయ్యేలా చేస్తుంది. మూడు జంటలకు మూడు పనులు చెప్తుంది. దీంతో ఎవరికి వారే పనులు చేయడానికి వెళ్తారు. తర్వాత జ్యోతి పంపించిన పూలు తీసుకెళ్లి శంకర్‌, గౌరి తలలో పెడతాడు.

గౌరి: అబ్బా ఏవీ కనిపించడం లేదేంటి?

శంకర్‌: ఏంటండి అంతలా వెతుకుతున్నారు.

గౌరి: కాఫీ పౌడర్‌, షుగర్‌ ఏవీ కనిపించడం లేదు.

శంకర్‌: అదిగో పంచదార కనిపించింది తీసుకోండి. ఇంకేంటి అన్నారు కాఫీ పొడా? ఆదిగోండి కాఫీ పొడి. అదేంటండి అంత పైన పెట్టారు. నాక్కూడ అందేట్లు లేదు.

యాదగిరి: పాపం నేను వెళ్లి ఇచ్చేసి వస్తాను.

జ్యోతి: ఎక్కడికి వెళ్లేది నేనే కావాలని పైన పెట్టాను. చూస్తూ ఉండండి.

యాదగిరి: ఎందుకే..

జ్యోతి: అబ్బా చూస్తూ ఉండండి అర్థంమవుతుంది.

 అని చాటు నుంచి యాదగిరి, అకి, జ్యోతి చూస్తుంటారు. ఇంతలో శంకర్‌ అది అందడం లేదు. ఇక్కడ స్టూల్‌ కూడా లేదు. సరే మీరు నన్ను ఎత్తుకోండి నేను అందుకుంటాను అనగానే గౌరి నేను మిమ్మల్ని ఎత్తుకోవడం ఏంటి నన్నే మీరు ఎత్తుకోండి అనగానే శంకర్‌, గౌరిని ఎత్తుకుంటాడు. తర్వాత గౌరి కాఫీ చేస్తుంది. మరోవైపు సంధ్య చిన్నొడు పులిహోర కలుపుతుంటాడు. పెద్దొడు, శ్రావణి అక్షితలు కలుపుతుంటారు.

చిన్నోడు: నేను నీకో మాట చెప్పొచ్చా.. ఈ డ్రెస్‌‌ లో నువ్వు చాలా బాగున్నావు.

సంధ్య: నువ్వు కూడా ఈ డ్రెస్‌ లో చాలా బాగున్నావు.

పెద్దొడు: మీరు ఏమీ అనుకోనంటే మీకో మాట చెప్పనా?

శ్రావణి: ఏంటి ఈ డ్రెస్‌‌ లో నేను చాలా బాగున్నావు అంటావు అంతేగా.

పెద్దొడు: కాదు.. మీరీ డ్రెస్‌ లో చాలా చాలా చాలా బాగున్నారు. నిజం చెప్పాలంటే ఈ డ్రెస్‌‌ కు మీ వల్లే అందం వచ్చిందనుకో..

   అంటూ అందరూ మాట్లాడుకుంటుంటే.. చాటు నుంచి వింటున్న యాదగిరి, అకి, జ్యోతి హ్యాపీగా ఫీలవుతుంటారు. వీళ్ల వాలకం చూస్తుంటే వాళ్ల కంటే ముందు ఈ రెండు జంటలే పెళ్లిపీటలు ఎక్కేసేలా ఉన్నారు. ఇంతలో పూజ రెడీ అవుతుంది. అందరూ వరుసగా పూజలో కూర్చుంటారు. జ్యోతి ప్లాన్‌ ప్రకారం గౌరి, శంకర్‌ ఒకరికొకరు కంకణాలు కట్టుకునేలా చేస్తుంది. ఇంతలో పంతులు గారు కంకణాలు దంపతులు మాత్రమే కట్టుకోవాలని చెప్పగానే గౌరి, శంకర్‌ షాక్‌ అవుతారు. పూజ అయిపోయిన తర్వాత గౌరి పాట పాడుతుంది.

యాదగిరి: చాలా బాగా పాడారు మేడం

అకి: మా అమ్మ గుర్తుకు వచ్చింది. చాలా బాగా పాడారు అమ్మా.. సారీ..   

శంకర్‌: గౌరి గారు ఓసారి నన్ను గిల్లండి. అబ్బా ఇది నిజమే.. మీలో ఇంత టాలెంట్‌ ఉందని నాకు అసలు తెలియదండి.

గౌరి: థాంక్యూ అండి..

శంకర్‌: నాకో గొప్ప ఐడియా వచ్చిందండి ఈసారి మనం ఈవెంట్‌ కమిట్‌ అయ్యే ముందు. స్పెషల్‌ ప్యాకేజీ కింద మీతో పాటల కచేరి ఉందని పెట్టేదాం

 అని శంకర్‌ అనగానే చాల్లేండి ముందు హారతి తీసుకోండి అని గౌరి చెప్తుంది. తర్వాత జ్యోతి తెలివిగా శంకర్‌తో గౌరికి ఆశీర్వచనాలు ఇప్పిస్తుంది. శంకర్‌ పాదాలు పట్టుకున్న గౌరికి, శంకర్‌ కు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిక్నిక్ వెళ్దామన్న అమర్ – ఏం జరగుతుందోనని భయపడ్డ గుప్త

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Embed widget