అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today September 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిక్నిక్ వెళ్దామన్న అమర్ – ఏం జరగుతుందోనని భయపడ్డ గుప్త

Nindu Noorella Saavasam Today Episode: అందరితో కలిసి అమర్ పిక్నిక్ కు వెళ్దామని చెప్పడంతో గుప్త భయపడతాడు ఏదో అనర్థం జరగబోతుందని షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  బయటకు వాకింగ్‌ కు వెళ్లిన అమర్‌ రాగానే ఆరు పరుగెత్తుకెళ్లి పిల్లల్ని పిక్నిక్‌ కు తీసుకెళ్లండని చెప్తుంది. ఏదో వినబడినట్లు అమర్‌ కొద్దిసేపు ఆగి వెళ్లిపోతాడు.  ఆరు హ్యాపీగా చూస్తుండిపోతుంది. ఇంతలో గుప్త దగ్గరకు రావడంతో చూశారా? గుప్త గారు మా ఆయనకు నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఆయనకు వెంటనే అర్థం అయిపోతుంది. అని చెప్తుంది. ఇంట్లోకి వెళ్తున్న అమర్‌ ను డోర్‌ దగ్గర ఆపిని మనోహరి ఏదో చెప్పబోయి ఆగిపోతుంది. లోపలికి వెళ్లిన అమర్‌కు మిస్సమ్మ కాఫీ ఇస్తుంది.

ఆరు: ఏంటి గుప్త గారు లైబ్రరీ లాగా ఈ సైలెంట్‌ ఏంటి? ఎవరో ఒకరు ఆయనకు పిక్నిక్‌ గురించి గుర్తు చేయోచ్చు కదా?

గుప్త: నీకు అన్నింటికీ ఆత్రమే బాలిక. నువ్వు ఆగుము.

శివరాం: అమ్మా మిస్సమ్మా ఇవాళ ఆదివారం కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు గుడికి వెళ్లి రాకూడదూ..

మిస్సమ్మ: గుడికా ఇంత పొద్దున్నే పిల్లలు లేవరు మామయ్య. పిల్లలు లేచే టైంకు గుడికి వెళ్లితే బాగుండదు. సాయంత్రం వెళతానులెండి.

నిర్మల: అవునండి అయినా గుడికేం వెళతారు. ఇంకెక్కడికౌనా వెళ్లండి.

అమర్: మిస్సమ్మ అందరూ రెడీ అవండి. పిక్నిక్‌‌ వెళ్దాం.

 అని అమర్‌ చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. నిర్మల, శివరాం, మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతుంది. ఆరు సంతోషిస్తుంటే గుప్త తిడతాడు. మరోవైపు రూంలోకి వెళ్లిన మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది.

మనోహరి: ఆరును కూడా ఇలాగే అడ్డు తొలగిద్దామని ఆలోచిస్తూ కూర్చుంటే.. వాళ్లిద్దరి పెళ్లి ప్రేమకు దారి తీసింది. విడదీయరాని బంధంగా మారింది. ఇప్పుడు కూడా అలాగే పిక్నిక్‌ లు అని పోనిస్తే వాళ్లిద్దరి మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది. ఎలాగైనా వాళ్లను ఆపాలి.

 అని పిల్లలను ఎవరినైనా మెట్లపై నుంచి తోసేయాలని అనుకుంటుంది. అందరిలో కెళ్లా ఆకాష్‌ను కిందకు తోసేయాలనుకుంటుంది.  మరోవైపు మిస్సమ్మ వెళ్లి పిల్లలను నిద్ర లేపుతుంది. మీ డాడ్‌ అందర్ని పిక్నిక్‌ కు తీసుకెళ్తామన్నారు అని మిస్సమ్మ చెప్పగానే పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అంజు థాంక్యూ అమ్మా అంటూ మిస్సమ్మను హగ్‌ చేసుకుంటుంది.

అమ్ము: అంజు నువ్వు మిస్సమ్మను అమ్మా అన్నావు..

 అనగానే అంజు మిస్సమ్మను వదిలి దూరంగా వెళ్తుంది.

మిస్సమ్మ: అవును అంజు నువ్వు నన్ను అమ్మా అని పిలిచావా?

అంజు: లేదు నేనేం అమ్మా అనలేదే..? మిస్సమ్మా అన్నాను. అయినా నిన్ను మా అమ్మ స్థానంలోకి ఎలా రానిస్తాను అనుకున్నావు.

అమ్ము: ఏయ్‌ అంజు పిలవలేదంటే పిలవలేదని చెప్పు. దానికెందుకు ఎక్స్‌ ట్రా మాట్లాడుతున్నావు. పాపం మిస్సమ్మ ఎంత బాధపడుతుందో..

అంజు: ఎవరో బాధకు నన్ను కారణం చేయకండి. అయినా ఎందుకు అందరూ డల్‌ అయిపోయారు. మనం అన్ని రెడీ చేయాలి కదా?

మిస్సమ్మ: మీరు రెడీ అయితే చాలు నేను అన్ని రెడీ చేస్తాను.

 అనగానే పిల్లలు మేము ఎలా రెడీ అవుతామో నీకు తెలియదు మిస్సమ్మ అంటూ తాము గేమ్స్‌ అడతామని డాడీ కూడా చాలా సరదాగా ఉంటారని చెప్తారు. దీంతో మిస్సమ్మ డ్రీమ్స్‌ లోకి వెళ్తుంద. పాత సినిమాల్లోలాగా పరుగెత్తుకుంటూ వచ్చి అమర్‌ ప్రపోజ్‌ చేసినట్టు కలగంటుంది. బ్యాక్‌ గ్రౌండ్‌‌ లో లవ్‌ సాంగ్ ప్లే అవుతుంది. ఇంతలో అంజు, మిస్సమ్మ తలనొక్కి ఆ డ్రీమ్‌ లోంచి బయటకు రామ్మా.. అని వెటకారంగా మాట్లాడుతుంది. మెలికలు తిరిగిపోతూ మిస్సమ్మ డ్రీమ్‌లోంచి బయటకు వచ్చి త్వరగా రెడీ అవ్వండని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు గుప్త, అమర్‌ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బయటకు వెళ్లేందుకు అమర్‌ ఎందుకు ఒప్పుకున్నాడు. ఏదో జరగబోతుంది.. ఏం జరగబోతుందో మాయ దర్పణంలో చూస్తానని.. చూసి గుప్త షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణను చంపేందుకు రాహుల్, రుద్రాణి ప్లాన్ – రాహుల్ ను వదిలేసిన పోలీసులు

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget