Prema Entha Madhuram Serial Today May 5th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: మండపానికి మారువేషాల్లో వచ్చిన శంకర్ వాళ్లు – మండపంలోనే గౌరికి ప్రపోజ్ చేసిన శంకర్
Prema Entha Madhuram Today Episode: మండపంలో పూజ చేస్తున్న గౌరి దగ్గరకు వెళ్లి శంకర్ ప్రపోజ్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram Serial Today Episode: పెళ్లి మండపానికి వస్తున్న అభయ్ ని చూసి రాకేష్ వాళ్ల తాతయ్య కోపంగా వీడి సంగతి చెప్తాను అనుకుంటూ ఎదురుగా వెళ్తాడు. కోపంగా ఆగు అంటూ ఎక్కడికి పెళ్లి కొడుకులా వస్తున్నావు అని అడుగుతాడు.
అభయ్: చాలా బాగా క్యాచ్ చేశారే.. మీరు చాలా ఇంటలిజెంట్ అనుకుంటా.. పెళ్లి కొడుకు స్థానంలో కూర్చోవడానికే వచ్చా.. మాయ కోసం ఏమీ తీసుకురాలేదని ఫీలయ్యా.. కానీ మీరే రోజ్ ఏర్పాటు చేశారు. ఈ చిన్న రోజ్‌ను నా మాయకు ఇస్తాను.
రాకేష్ తాత: హలో బాబు మరీ అంత స్పీడు అయిపోకు.. నీకు లోపలికి ఎంట్రీ లేదు.
అభయ్: ఇన్విటేషన్ ఇచ్చి ఎంట్రీ లేదంటారేంటి..?
రాకేష్ తాత: ఇన్విటేషన్ పేరుతో మీ చెల్లి బావ వచ్చారు. ఇప్పుడు నువ్వు వచ్చావు. ఏంటసలు మీ ప్లాన్ ఏం చేయబోతున్నారు.
అభయ్: చెప్తా రండి.. అది సీక్రెట్ చెప్పకూడదు.
రాకేష్ తాత: ముందు నువ్వు బయటకు వెళ్లు..
రాకేష్: ఏంటి తాతయ్య గొడవ..
అభయ్: హలో రాకేష్ చూడు రాకేష్ నా మాయ పెళ్లి జరుగుతుంది కదాని వస్తే ఈ ఓల్డ్ మ్యాన్ లోపలికి రానివ్వడం లేదు.
రాకేష్ తాత: హలో రాకేష్ ది ఏమీ లేదు ఇక్కడ అంతా నా ఇష్ట ప్రకారమే జరగుతుంది ఇక్కడ. ముందు నువ్వు బయటకు వెళ్లు..
అభయ్: ఏంటి రాకేష్ నన్ను ఇక్కడ చూడగానే మాయ పెళ్లి పీటల మీద నుంచి వస్తుందని భయమా..?
రాకేష్: అభయ్ నీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైంది. మీరు ఎవరిని చూసుకుని ఇంత బిల్డప్ ఇస్తున్నారో ఆ శంకర్ ఇక్కడకు వస్తే ప్రాణాలతో వెళ్లడు.
అభయ్: మరైతే నన్ను రానివ్వడానికి ఏంటి ప్రాబ్లమ్
రాకేష్: ఎవరు రావొద్దన్నారు. వచ్చి ఫస్ట్ రో లో కూర్చో వచ్చి నా చెల్లి పెళ్లి దగ్గరుండి చూసి కుమిలి కుమిలి ఏడువు. నాకు కావాల్సింది కూడా అదేగా..?
రాకేష్ తాత: రాకేష్ నీకు పిచ్చి పట్టింది. నువ్వు సమస్యలు కోరి తెచ్చుకుంటున్నావు.
రాకేష్: తాతయ్య నాకు తెలుసులే..నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అయినా శత్రువును తరిమేస్తే ఏమొస్తుంది. ఎదురుగా ఉంచుకుని నా గెలుపును చూపిస్తే కదా నా ఇగో శాసిస్పై అవుతుంది. వెళ్లి కూర్చో..
అభయ్ వెళ్లిపోతాడు. రాకేష్‌ను వాళ్ల తాత తిట్టడంతో రాకేష్ తిరిగి తిట్టి వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు గౌరి, శ్రావణి, సంధ్య పెళ్లి కూతుర్లుగా ముస్తాబై మంటపానికి వస్తుంటే వాళ్ల బాబాయ్ వచ్చి ఆగండి అని చెప్తాడు. ఇంతలో రాకేష్ వస్తాడు.
రాకేష్: ఏంటండి ఏం కావాలి.
బాబాయ్: ఏం లేదు బాబు.. పెళ్లి కూతుర్లతో పెళ్లికి ముందు పూజ చేయించడం మా ఇంటి ఆనవాయితీ అందుకే వీళ్లను మేళతాళాలతో తీసుకెళ్లి ఆ పూజ చేయిద్దామని..
రాకేష్: మేళతాళాలను నేను పిలవలేదండి..
బాబాయ్: ఓనరు గారు పిలిచారండి.
రాకేష్: నాకు చెప్పకుండా పిలిచాడేంటి..? ( మనసులో అనుకుంటాడు)
ఇంతలో శంకర్ ఆయన తమ్ముళ్లు, యాదగిరి మేళతాళాల వారి వేషాలు వేసుకుని మేళాలు వాయించుకుంటూ వస్తారు. గౌరి వాళ్లను మండపానికి తీసుకెళ్తుంటారు. శంకర్ ను గౌరి గుర్తు పట్టి హ్యాపీగా నవ్వుతుంది. ఇంతలో చిన్నొడు సంద్యకు, పెద్దొడు శ్రావణికి సైగ చేస్తారు. వాళ్లు గుర్తు పట్టి నవ్వుకుంటారు. అందరూ కలిసి డాన్సులు వేస్తూ మండపానికి వెళ్తుంటారు. ఇంతలో శంకర్, గౌరి దగ్గరకు వెళ్తాడు. మీకు పెళ్లి అనగానే నా మనసు మనసులో లేదని ఎక్కడ నాకు దూరం అయిపోతారోనని భయం వేస్తుంది. అంటూ అక్కడే గౌరికి ప్రపోజ్ చేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















