Prema Entha Madhuram Serial Today December 10th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: రాకేష్‌తో పెళ్లికి అకిని ఒప్పించిన శంకర్ – అకిని లేపుకెళ్లమని రవికి సలహా ఇచ్చిన జ్యోతి
Prema Entha Madhuram Today Episode: రాకేష్‌తో పెళ్లికి నిరాకరించిన అకి సూసైడ్ చేసుకుంటానని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: అకి ఎంగేజ్మెంట్‌కు ఇంకా రెడీ కాలేదేంటని జ్యోతిని అడుగుతాడు యాదగిరి. జ్యోతి కోపంగా యాదగిరిని తిడుతుంది. రవి వద్దని జ్యోతిని ఓదారుస్తాడు. నాకు అలాంటి అలోచన లేదని చెప్తాడు. అయితే నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని మరోకటి బయటకు చెప్తున్నావని.. మీ నాన్న గురించి ఆలోచించకు నువ్వు అకిని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపో అంటూ చెప్పగానే నువ్వు చెప్పినట్టు వెళ్లిపోతాను కానీ తర్వాత నాన్న ఏమైనా చేసుకుంటే.. అంటూ ఈ విషయం ఇంతటితో వదిలేయమ్మా అంటూ రవి వెళ్లిపోతాడు. మరోవైపు ఎంగేజ్మెంట్‌కు రాకుష్ రెడీ అయి వస్తాడు. అభయ్ ఎదురెళ్లి రాకేష్‌ను ఇంట్లోకి తీసుకొస్తాడు. లోపల జెండే, శంకర్ మాట్లాడుకుంటారు.
అభయ్: పంతులు గారు అబ్బాయి వచ్చేశారు. మీరు ఏర్పాట్లు త్వరగా చేయండి.
పంతులు: ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి.. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది.
అభయ్: సరే పంతులు గారు. ఫ్రెండ్ నేను పైకి వెళ్లి అకిని త్వరగా రెడీ కమ్మని చెప్తాను
అని అభయ్ వెళ్లిపోతాడు.
రాకేష్: ఏంటి అంకుల్ వర్థన్ కుటుంబంలో శుభకార్యం అంటే మొదట సంతోషించేది మీరే కదా..? అలాంటిది మీరే డల్లుగా కనిపిస్తున్నారు. ఈ పెళ్లి మీకు ఇష్టం లేదా..?
ఓనరు: ఇష్టం లేకపోతే మాత్రం వాళ్లు ఏం చేయగలరు రాకేష్. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. నీ పెళ్లి అక్కడ డిసైడ్ అయింది కాబట్టి ఇక్కడ ఫిక్స్ అయింది.
జెండే: ఇంతకీ మీకు రాకేష్‌కు ఏంటి సంబంధం. తనకు పెద్దమనిషిగా వచ్చారేంటి..?
ఓనరు: నేనో బిజినెస్ మ్యాన్ ను అండి రాకేష్‌ను నా దత్తపుత్రుడిలా చూస్తాను.
పంతులు: బాబు మీ జాతకం తీసుకొచ్చారా..?
ఓనరు: తీసుకొచ్చామండి బ్రహ్మండమైన జాతకం. ఏంటి శంకర్ నీ జాతకం కూడా చూపించుకుంటావా..? అయినా తంతే వచ్చి వర్థన్ ఫ్యామిలిలో పడ్డావు.
శంకర్: నిన్ను పుట్ బాల్ లా తన్నమంటావా.. తంతే బూరెల బుట్టెలో పడతావు.
ఓనరు: వద్దులే.. ఇక చాలు..
అనగానే జాతకం చూసిన పంతులు పిచ్చ తిట్టుడు తిడతాడు. అసలు ఇలాంటి జాతకం నా జీవితంలో నేను చూడలేదు అంటాడు. అయితే ఆ వర్జినల్ జాతకం కాదని.. వర్జినల్ జాతకం ఇంట్లో ఉందని ఓనరు చెప్పగానే జెండే తిడతాడు. మరోవైపు అకి ఏడుస్తుంది. గౌరి ఓదారుస్తుంది. ఇంతలో అభయ్ వచ్చి అకి ఇంకా రెడీ కాలేదేంటని అడుగుతాడు. దీంతో అకి కోపంగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. దానికి బదులు ఇంత విషం ఇవ్వు చనిపోతాను అంటుంది. ఏదిఏమైనా ఈ పెళ్లి జరగాల్సిందే అని అభయ్ కరాకండిగా చెప్తాడు. నువ్వు ఈ పెళ్లికి నో చెప్పావంటే నేను ఎవ్వరికీ కనిపించనంత దూరం వెళ్లిపోతాను అని అభయ్ అనగానే శంకర్ వస్తాడు.
శంకర్: అభయ్ ఏంటి తనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా..? తనకు అర్థం అయ్యేలా చెప్పి నచ్చజెప్పాలి కానీ ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం కరెక్టు కాదు.
అభయ్: కానీ తను నా మాట వినడం లేదు శంకర్ గారు. తన మంచి కోసం చెప్తున్నా కూడా మొండిగా ప్రవర్తిస్తుంది.
శంకర్: సరే నేను అకికి నచ్చజెప్పి తీసుకొస్తాను.
అభయ్: థాంక్యూ అండి మీరు చెప్తే అకి తప్పకుండా వింటుంది.
అంటూ అభయ్ వెళ్లిపోతాడు. శంకర్ కూడా అకిని రెడీ అవ్వమని నీ మనసుకు నచ్చనిది జరగకుండా చూసే బాధ్యత నాది అంటూ శంకర్ చెప్పి వెళ్లిపోతాడు. కిందకు వెళ్లిన అభయ్ పంతులు గారికి అకి వస్తుందని పూజ మొదలు పెట్టమని చెప్తాడు. పంతులు పూజ మొదలు పెడతాడు. ఇంతలో శంకర్ కిందకు రాగానే ఏమైందని జెండే అడుగుతాడు. అకి కిందకు రాని వచ్చాక చూద్దాం అని శంకర్ చెప్తాడు. ఇంతలో యాదగిరి ఎంగేజ్మెంట్‌కు వస్తాడు. అకి కూడా కిందకు వచ్చి రాకేష్ పక్కన కూర్చుంటుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!