అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 30th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: శంకర్‌ బలాన్ని పోలీసులకు చెప్పిన జెండే – కిడ్నాపర్ల ఆచూకి తెలుసుకున్న చిన్నొడు.

Prema Entha Madhuram Today Episode: కిడ్నాపర్లను పట్టుకోవడానికి శంకర్ పోలీసుల సాయం తీసుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  శంకర్‌, జెండే కిడ్నాపర్లను ఎలా పట్టుకోవాలో ప్లాన్‌ చేస్తారు. వారికి తోడుగా అకి వస్తుంది. తనకు తెలిసిన ఒక పోలీస్‌ ఆఫీసర్‌ కు ఫోన్‌ చేసి డీటెయిల్స్‌ తీసుకుంటుంది. ఆ గ్యాంగ్‌ ను పట్టుకోవడానికి మేము కూడా ట్రై చేస్తున్నామని మాకు లోకల్‌ పోలీసుల హెల్ఫ్‌ కావాలని  మీరు వాళ్లకు చెప్పండని అడగ్గానే సరే అంటాడు. దీంతో అందరూ తలా ఒక దిక్కుకు వెతకడానికి వెళ్లిపోతారు. మరోవైపు కిడ్నాప్‌ అయిన అమ్మాయిలందరూ ఏడుస్తుంటారు. జగ్గుభాయ్‌ రౌడీలకు ఎప్పుడు ఎలా వెళ్లేది డైరెక్షన్‌ ఇస్తాడు. రౌడీలు శ్రీనుకు ఫోన్‌ చేసి మేము చెప్పిన ప్లేస్‌ కు త్వరగా వచ్చేయ్‌ అని చెప్తారు. మరోవైపు శంకర్‌, గౌరి, జెండే, అకి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్తారు.

ఎస్సై: ఏంటి మీరు చెప్తే పట్టించుకోలేదని డీసీపీ గారి నుంచి కాల్‌ చేయించారా? చూడండి మీరు పీఎం నుంచి కాల్‌ చేయించినా..  అందర్నీ కాపాడటానికే ప్రయత్నిస్తాం కానీ మీ అమ్మాయి ఒక్కదాని కోసం స్పెషల్‌ సర్చింగ్‌ లు ఏమీ జరగవు.

శంకర్‌: అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు మేడం. మేము కాల్‌ చేయించింది డిపార్ట్‌ మెంట్‌ నుంచి హెల్ఫ్‌ తీసుకోవడానికి.

జెండే: అవునండి అందరు అమ్మాయిలు సేఫ్‌గా బయటపడటమే మా ఉద్యేశం.

ఎస్సై: అసలు ఈ కేసు గురించి మీకేం తెలుసండి. మేమే తలలు పట్టుకుని కూర్చున్నాం. మేం ఏం చేయాలి. మీరేం చేస్తారు.

శంకర్‌: మేము వాళ్ల వరకు రీచ్‌ అవ్వగలం మేడం. జస్ట్‌ మీ నుంచి సపోర్ట్‌ కావాలి అంతే

ఎస్సై: మిస్టర్‌ మరీ అంత ఓవర్‌ కాన్ఫిడెంట్‌ పనికిరాదు.

 అని ఎస్సై హెచ్చరించగానే జెండే శంకర్‌ గురించి గొప్పగా చెప్తాడు. శంకర్‌ తల్చుకుంటే ఎవర్నీ అయినా పట్టుకుంటాడని చెప్తాడు. దీంతో శంకర్‌ తన ప్లాన్‌ చెప్పగానే ఎస్సై మెచ్చుకుంటుంది. మీరు చెప్పినట్టే నేను కొన్ని సిగ్నల్‌ కెమెరాస్‌ చూశాను అని చెప్తుంది. తర్వాత శంకర్‌ ఫైల్‌ తీసుకుని చూస్తాడు. బయట నుంచి మొత్తం వింటున్న ఒక కానిస్టేబుల్‌ జగ్గుభాయ్‌ కు ఫోన్‌ చేసి శంకర్‌ ప్లాన్‌ మొత్తం చెప్తాడు. మిమ్మల్ని కనిపెట్టేస్తాడు. అని చెప్పడంతో భాయ్‌ భయపడుతుంటాడు. ఇంతలో రాకేష్‌ వస్తాడు.   ఏమైందని అడుగుతాడు.

     ఎవడో శంకర్‌ అంట నన్ను పట్టించడానికి పోలీసులతో చేయి కలిపాడట అని చెప్పడంతో రాకేష్‌ షాక్‌ అవుతాడు. మరోవైపు శ్రీను, శంకర్‌కు ఫోన్‌ చేసి పార్టీ డబ్బులు వేస్తానన్నారు నీ అకౌంట్‌ లో పడ్డాయా చూడమని అడుగుతాడు. శంకర్‌ అకౌంట్‌ చెక్‌ చేసుకుని పడ్డాయని.. ఏదైనా అవసరం వస్తే తమ్ముళ్లకు చెప్పమంటాడు. దీంతో శ్రీను ఏమైందని అడిగితే కిడ్నాప్‌ విషయం చెప్తాడు శంకర్‌. మరోవైపు అందరూ ఎవరికి వాళ్లు వెతుకుతుంటారు. ఇంతలో చిన్నొడు కిడ్నాపర్లు ఉన్న ఇంటి దగ్గరకు వెళ్తాడు. చిన్నోడిని చూసిన రాకేష్, జగ్గుభాయ్‌ నాటకం ఆడి చిన్నోడు అక్కడి నుంచి వెళ్లేలా చేస్తారు. మరోవైపు పోలీస్‌ స్టేషన్‌ లో పోలీసులు హడావిడిగా ఉంటారు.

కానిస్టేబుల్‌: కిడ్నాప్‌ అయిన నెంబర్స్‌ మేడం. గంట ముందు వరకు అన్ని స్విచ్చాప్‌ అనే వచ్చాయి. ఇప్పుడు ట్రై చేస్తే ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌ అని వస్తున్నాయి.

ఎస్సై: సిమ్ములు రిమూవ్‌ చేసి డ్యామేజ్‌ చేసి ఉంటారు. అంటే కచ్చితంగా వాళ్లను సిటీ దాటించే ప్రయత్నం చేస్తుంటారు. డిపార్ట్‌ మెంట్‌ మొత్తం అలర్ట్‌ గా ఉండమనండి.

కానిస్టేబుల్‌: అన్ని వెహికిల్స్‌ ను చెక్‌ చేస్తున్నారు మేడం.

ఎస్సై: అంతే కాదు మఫ్టీలో కొంతమందిని మాల్స్, బస్టాండుల్లో ఉండమనండి.

 అని చెప్పి ఎస్సై వెళ్లిపోతుంది. శంకర్‌ కు ఫోన్‌ చేసి నీ గెస్‌ కరెక్ట్ అయిందని ఎస్సై చెప్తుంది. దీంతో ఇద్దరూ కలిసి ఎలా పట్టుకోవాలో ప్లాన్‌ చేస్తారు. ఇంతలో చిన్నొడు వచ్చి తను చూసిన బిల్డింగ్స్‌ గురించి చెప్తుంటే ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

ALSO READ:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య, స్వప్నలను పూల్స్‌ ను చేసిన రాహుల్‌ - ఆటోవాలాగా మారిపోయిన కళ్యాణ్‌

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget