అన్వేషించండి

Brahmamudi Serial Today August 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య, స్వప్నలను పూల్స్‌ ను చేసిన రాహుల్‌ - ఆటోవాలాగా మారిపోయిన కళ్యాణ్‌

Brahmamudi Today Episode: రాహుల్ ను అందరి ముందు దోషిలా నిలబెట్టాలనుకున్న కావ్య, స్వప్నలే ఇంట్లో వాళ్ల దృష్టిలో దోషులుగా నిలబడాల్సి వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రూంలో స్వప్న వినేలా ఎవరితోనో ఇల్లీగల్‌ గోల్డ్‌ గురించి ఫోన్‌ మాట్లాడతాడు రాహుల్‌. ఇదే విషయం స్వప్న, కావ్యకు చెప్తుంది. కావ్య ఆలోచిస్తుంటే.. ఇంకా ఏం ఆలోచిస్తున్నావే.. అందరి ముందు ఈ విషయం బయటపెడదాం అని స్వప్న అంటుంది. అలా చేస్తే.. రాహుల్‌ అందరిముందు చెడ్డవాడు అవుతాడు. కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు అని కావ్య అంటుంది. అయితే కానీ, నా భర్త కంపెనీ బాధ్యతలు తీసుకుంటే సంతోషమే కానీ, ఇలా ఆస్తులు పోగొడతాడని తెలిస్తే.. ఇరికించడానికి నేను సిద్ధమే అని స్వప్న అంటుంది. మరోవైపు జాబ్‌ చేస్తే జీతం రావడానికి నెల టైం పడుతుంది. రోజు డబ్బులు వచ్చే పని చేయాలనుకుంటాడు కళ్యాణ్‌. ఇంతలో ఒక ఆటో అతని దగ్గరకు వెళ్తాడు.

కళ్యాణ్‌: సార్‌ మీరు రోజు ఆటో నడిపితే ఎంతోస్తుంది.?

ఆటోవాలా: అబ్బో ఈ మధ్యన ఆటోవాళ్లను సార్‌ అని కూడా పిలుస్తున్నారా? అయినా మనకెందుకులే రోజుకు ఓ 500 నుంచి 1000 రూపాయలు వస్తాయి.

కళ్యాణ్‌: అవునా.. అయితే నేను కూడా మీలాగే ఆటో నడుపుదామనుకుంటున్నాను.

ఆటోవాలా: నిన్ను చూస్తుంటే ఆటో కంపెనీ కొనేవాడిలా ఉన్నావు. నువ్వు ఆటో నడపడమేంటి? సరే అర్థమైంది. కోట్లు పోగొట్టుకుని నోట్లకోసం పాట్లు పడుతున్నారన్న మాట. ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు.

   ఈ పక్కనే అని ఇల్లు చూపిస్తాడు కల్యాణ్. హో.. బంటిగాడి ఇంటికి వచ్చిన కొత్త జంట మీరేనా సరే. నేను సేటు నెంబర్ ఇస్తాను. అతని దగ్గరికి వెళ్లి నా పేరు చెబితే రెంట్‌కు ఆటో ఇస్తాడు. అని సేటు నెంబర్‌ ఇస్తాడు అతను. మరోవైపు రాహుల్ ఆఫీస్‌కు వెళ్తున్నట్లు రుద్రాణికి చెబుతాడు. నువ్వు ఇలా ప్రయోజకుడివి కావడం కంటే ఏముంది అంటుంది రుద్రాణి. ఇంతలో కావ్య, స్వప్న వచ్చి రాహుల్‌  అక్రమంగా దొంగ బంగారాన్ని కంపెనీ ద్వారా కొనడానికి సిద్ధపడ్డాడని చెప్తారు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ, ఇందిరాదేవి రాహుల్‌ ను తిడతారు. ఇంతలో నేను దొంగబంగారం కొంటున్నట్టు మీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. దీంతో నీ చేతిలో ఉన్న ఫైలే దానికి సాక్ష్యం అని ఆ ఫైల్‌ ను తీసి రాజ్‌కు ఇస్తారు.   

స్వప్న: ఇతని బాగోతం ఇందులోనే కనిపిస్తుంది.

రాజ్‌: ఇందులో ఏ తప్పు లేదు స్వప్న. ఇది మనం రెగ్యులర్‌ గా గోల్డ్ సప్లై చేసే కంపెనీతో చేసుకున్న అగ్రిమెంటే కదా. ఇందులో దొంగ బంగారం కొంటున్నట్లు ఎక్కడ లేదు. డాక్యుమెంట్స్ అన్ని అఫీషియల్‌ గానే ఉన్నాయి.

 కావ్య, స్వప్న షాక్‌ అవుతారు. రాహుల్‌ బాగ్‌ ను పూర్తిగా వెతుకుతారు. అందులో మరేమీ దొరకదు. ఇంతలో ఎలా మాయం చేశావు అని స్వప్న అడగ్గానే మా అక్కనే పూల్‌ ను చేస్తున్నావా? రాహుల్‌ అంటుంది కావ్య.

రుద్రాణి: హేయ్‌ షటప్. రాజ్‌ను కాదని, రాహుల్‌కు కంపెనీ బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి కావ్య మండిపోతుంది. అందుకే అక్కచెల్లెళ్లు కలిసి ఇలా చేశారు.

అపర్ణ: రుద్రాణి ఆపు.. నోరు గుక్కతిప్పుకోకుండా అంటున్నావేంటీ. స్వప్న చూశానంటుంది. చదివానంటుంది. ఏ భార్య కూడా చేయని తప్పు భర్తపై మోపదు. కావ్య కూడా ఆధారం లేకుండా ఎవరిని అనదు. నిజంగానే నీ కొడుకు ఆ ఫైల్ మార్చాడేమో..?

రాహుల్‌: పెద్దత్తయ్య మీరు కావ్యను నమ్మి నన్ను అంటున్నారు. ఫైల్ సంగతి పక్కన పెడితే అలా చేస్తే నేరం ఎవరిపై పడుతుంది. నా మీదే కదా. నేనే కదా ఆఫీస్‌కు వెళ్తున్నాను.

స్వప్న: ఎంత బాగా నటిస్తున్నావు రాహుల్‌. నన్ను పిచ్చిదాన్ని చేద్దామనుకుంటున్నావా..?

రుద్రాణి: మీ ఇద్దరు కలిసి రాహుల్‌ ను  చేస్తున్నారు. నాన్న కావాలంటే రాజ్‌కే కంపెనీ అప్పజెప్పండి.

ధాన్యలక్ష్మీ: అలా ఎలా కుదురుతుంది. కల్యాణ్ వచ్చేవరకు రాజ్‌  కంపెనీకి వెళ్లకూడదని మావయ్య గారే చెప్పారు.

 అని చెప్పగానే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇక ఇక్కడితో వదిలేయండి. నేను వచ్చి సీటు లాక్కోను ఇవాళ్టీ నుంచి ఆఫీసుకు రెగ్యులర్‌గా వెళ్లు రాహుల్‌ అని రాజ్‌ చెప్పి కావ్యను పక్కకు తీసుకెళ్లి కుటుంబాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నావా? అని తిడతాడు రాజ్‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
Nindu Manasulu Serial Today October 12th: నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
Godavari Serial Today October 12th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 12: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం
నువ్వులేక నేను లేను: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget