అన్వేషించండి

Naga Panchami Serial Today May 16th: 'నాగ పంచమి' సీరియల్ : కవలలకు జన్మనిచ్చిన పంచమి.. కరాళి ప్రయత్నాలు విఫలం!

Naga Panchami Serial Today Episode : కరాళి మాయను ఎదుర్కొని పంచమి ఇద్దరు బిడ్డలను ప్రసవించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode :మోక్ష, పంచమి కారులో వెళ్తూ ఉంటారు. మధ్యలో పంచమికి నొప్పులు మొదలవుతాయి. పంచమి ఏడుస్తుంది. మోక్ష చాలా కంగారు పడతాడు. ఇంతలో కారుకు అడ్డంగా చెట్టు పడిపోతుంది. మోక్ష చెట్టును కొంచెం పక్కకు జరుపుతాడు. అయితే పంచమి నొప్పులతో ఇబ్బంది పడటంతో మోక్ష పంచమిని ఎత్తుకొని గుహ దగ్గరకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతాడు. పంచమిని ఎత్తుకొని పరుగులు పెడుతుంటాడు. మరోవైపు కరాళి కూడా అంతే వేగంగా పంచమి వైపు వస్తుంటుంది. 

మోక్ష: నా మాట విని సిటీలో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా పంచమి.

పంచమి: మోక్షాబాబు మన బిడ్డను ఆ సుబ్రహ్మణ్య స్వామి తప్ప మరెవరూ కాపాడలేరు. 

మోక్ష: ఇలాంటి పరిస్థితిలో నిన్ను గుహ దాకా తీసుకెళ్లలేను. 

పంచమి: ఎలా అయినా వెళ్లాలి మోక్షాబాబు లేకపోతే మన బిడ్డ మనకు దక్కదు. 

మోక్షాబాబు: చాలా కష్టం పంచమి.. నువ్వు ఇక్కడే ఉండు నేను మీ ఊరికి వెళ్లి ఎవరైనా ఆడవాళ్లని తీసుకొని వస్తాను. జాగ్రత్త పంచమి.

పంచమి: మోక్షాబాబు ఎలా అయినా నన్ను ఆ స్వామి దగ్గరకు తీసుకెళ్లండి. 

కరాళి: గుర్తుపట్టావా పంచమి. నువ్వు నా మృత్యువుని కనడానికి తెగ ప్రయాస పడుతున్నావు. నీకు అంత కష్టం రానివ్వను పంచమి. కడుపులో ఉన్న నీ తల్లి విశాలాక్షిని కడుపులోనే చంపేస్తాను. 

పంచమి: నీకు దండం పెడతాను కరాళి వదిలేయ్. నా బిడ్డను ఏం చేయకు. నీ కోపం నా మీద చూపించకు. నా బిడ్డను వదిలేయ్. 

కరాళి: నీ బిడ్డను చంపాలని చాలా ప్రయత్నాలు చేశాను. ఇక ఇప్పుడు నిన్నూ నీ బిడ్డను ఏ శక్తి కాపాడలేదు. 

కరాళి పంచమి గొంతు పట్టుకొని నలిపేస్తుంది. పంచమి కరాళి చేతులు విడిపించుకొని కరాళిని తోసేసి అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇక కరాళి కూడా పంచమి వెనకే పడుతుంది. ఇంతలో నాగేశ్వరి పాము మోక్ష పరుగు పెట్టడం చూస్తుంది. మోక్ష పరుగెడుతున్నాడు అంటే పంచమికి నొప్పులు మొదలయ్యుంటాయని అనుకుంటుంది.  

నాగేశ్వరి: పుట్టిన బిడ్డను కాపాడుకోవాలి. మా మహారాణికి ఏం కాకూడదు. అని ఓ ముసలావిడలా తన రూపం మార్చుకుంటుంది నాగేశ్వరి. మోక్ష ఆ ముసలావిడను చూసి పరుగున వస్తాడు. ఆవిడ దగ్గరకు వచ్చి తన భార్యకు పురుడు పోయాలని చెప్తాడు. మారు వేషంలో ఉన్న నాగేశ్వరి మోక్ష వెంట వెళ్తుంది. 

ఇక పంచమి కరాళి నుంచి తప్పించుకొని వెళ్తుంటుంది. ఓ చోట పంచమి పడిపోతుంది. రాళ్ల వెనక పడిపోయిన పంచమి కరాళికి తన బాధ వినిపించకుండా నోరు అదిమి పట్టుకుంటుంది. దీంతో కరాళికి పంచమి కనిపించదు. కరాళి లేదు అనుకొని పంచమి లేచి వచ్చేసరికి ఎదురుగా కరాళి కనిపించి పంచమి గొంతు పట్టుకొని కొండ చివరకు వెళ్తుంది. 

పంచమి ఏడుపునకు సుబ్రహ్మణ్య స్వామి తన త్రిశూలాన్ని కరాళి మీదకు ప్రయోగిస్తారు. అది కరాళికి తగిలి కరాళి కింద పడిపోతుంది. పంచమి తప్పించుకుంటుంది. పంచమి నొప్పులతో ఇబ్బంది పడుతుంది. నొప్పులతో కింద పడిపోతుంది. ఇక పంచమి చుట్టూ నెమళ్లు చేరి వాటి పింఛాలను పంచమికి అడ్డుగా పెడతాయి. పంచమి ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తుంది. అయితే కళ్లు తెరచిన పంచమి ఇద్దరు బిడ్డలను చూసి నాగేశ్వరి ఇద్దరిలో ఎవర్ని తీసుకుంటుందో అని అనుకుంటుంది. ఇద్దరినీ ఇవ్వను అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 
 

Also Read: ఆద్య అస్స‌లు అల్ల‌రి చేయ‌దు - ఒక్కోసారి ఇద్ద‌రినీ చూసుకోవ‌డం క‌ష్టం అనిపిస్తుంది: రేణు దేశాయ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Embed widget