Naga Panchami Serial: 'నాగ పంచమి' సీరియల్: అదరగొట్టేసిన 'నాగపంచమి' - ఈ ట్విస్ట్‌లు మీరు ఊహించి ఉండరు
Naga Panchami Today Promo: పాముగా మారిన పంచమి విశ్వరూపంతో మోక్షను కాటేయడానికి వెంటపడడంతో ఇవాళ్టి సీరియల్ ప్రోమో ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Telugu Serial Today Promo: విశేష ప్రేక్షకాధరణ సొంతం చేసుకున్న సీరియల్స్‌లో మాటీవీలో ప్రసారమయ్యే నాగపంచమి ఒకటి. ఓ అబ్బాయి పాము రూపంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆమె వల్లే అతడికి గండం ఉండటం వల్ల ఈ సీరియల్ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. భార్య ప్రతీ పౌర్ణమికి పాములా మారి భర్తను కాటేయాలని చూడటం.. భర్త తప్పించుకోవడానికి ఆగచాట్లు పడటం వల్ల నాగపంచమి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ఈ రోజు విడుదలైన ప్రోమో సీరియల్ మీద ఇంకా ఇంట్రస్ట్ పెంచేస్తుంది.
ఈ రోజు ప్రోమోలో ఏం ఉందంటే..
పంచమి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆగ్రహించిన నాగ దేవత కొన్ని శక్తులను ప్రయోగింస్తుంది. దీంతో పంచమి ఐదు తలల పెద్ద పాములా మారుతుంది. మరోవైపు పంచమిని కాపాడటానికి మోక్ష, తన స్వార్థం కోసం కరాళి అక్కడికి కలిసి వస్తారు. మోక్ష, మోహిని ఆ ఐదు తలల పామును చూసి తీవ్ర భయబ్రాంతులకు గురవుతారు. ఇద్దరు పరుగులు తీస్తారు. పంచమి పాము బుసలు కొడుతూ.. మోహినిని చుట్టేస్తుంది. ఆ సీన్ చూస్తే మోహిని పని ఐపోయినట్లే అనిపిస్తోంది. ఇక తర్వాత పంచమి పాము మోక్ష వైపు వస్తుంటుంది. అది చూసి మోక్ష భయంతో పంచమి ఇక నా చావుని ఎవరూ తప్పించలేరు అని వణికిపోతుంటాడు. మొత్తానికి పంచమి పాము మోక్షని కాటేసిందా... మోక్షని కాపాడుకోవాలని అనుకున్న పంచమి ఏం చేయబోతుంది.. మృత్యుంజయ యాగం ఎంతవరకు మోక్షకు హెల్ప్ అవుతుంది. సుబ్బు పంచమికి, మోక్షకు సాయం చేస్తాడా అనే విషయాలు సీరియల్‌లో చూడొచ్చు.
నిన్నటి ఎపిసోడ్‌లో జరిగింది ఇదే..
పంచమి తన చితిని పేర్చుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ సమయంలో పంచమి కేకలు విన్న నాగ దేవత ఏం జరిగిందా అని తన దివ్య దృష్టితో చూస్తుంది. పంచమి ఆత్మహత్య చేసుకోవడం చూసి ఆగ్రహానికి గురవుతుంది. తన విశ్వరూపం చూపిస్తాను అని నృత్యం చేస్తూ కొన్ని శక్తులను పంచమి మీదకు వదులుతుంది. ఇక మరోవైపు మోక్ష పంచమి గీసిన విభూది రేఖ లోపలే ఉంటాడు. ఇంతలో కరాళి మోక్ష దగ్గరకు వెళ్లాలి అని చూస్తుంది కానీ విభూది రేఖ పవర్‌కు లోపలికి వెళ్లలేకపోతుంది. దీంతో మోక్షను పిలుస్తుంది. పంచమిని వెంటపడ్డాను అని తన దగ్గరకు మనం వెళ్లాలి అని అప్పుడే తమ ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెప్తుంది.
అయితే పంచమి తనని ఆ గీత దాటొద్దు అని చెప్పిందని నేను రాను అని మోక్ష చెప్తాడు. దీంతో మోహిని తన మంత్ర శక్తులతో పంచమి ఆత్మహత్య చేసుకోవడం మోక్షకు చూపిస్తుంది. అది చూసి షాకైన మోక్ష పంచమిని కాపాడాలి అని బయటకు వస్తాడు. ఇక ఇద్దరూ కలిసి పంచమి ఆత్మహత్య చేసుకున్న ప్రదేశానికి బయలు దేరుతారు. ఇక మరోవైపు సప్త రుషులు మృత్యుంజయ యాగం జరిపిస్తుంటారు. ఆ యాగాన్ని భగ్నం చేయాలి అని ఫణేంద్ర, నాగకన్యలు ఎదురు చూస్తుంటారు. సమయం చూసి యాగ ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నించినా లోపలకి వెళ్లలేకపోతారు. వారి ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతూనే ఉంటాయి. దీంతో ఫణేంద్ర యాగం చేస్తున్నది మామూలోలు కాదు అని ఆ యాగాన్ని ఆపడానికి తమ శక్తి సరిపోదని నాగకన్యలతో చెప్తాడు. ఇక పంచమి పాము మోక్షను కాటేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే ఇవాళ్లి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.