Gruhalakshmi December 13th Episode - ‘గృహలక్ష్మీ’ సీరియల్: మొక్కలను మార్చి దివ్యను పిచ్చిదాన్ని చేసిన రాజ్యలక్ష్మీ - నందాను క్షమించిన తులసి
Gruhalakshmi Serial Today Episode: దివ్యను పిచ్చిదాన్ని చేసి ఇంట్లోంచి గెంటేయాని రాజ్యలక్ష్మీ ఆడుతన్న 'తులసి మొక్క' నాటకం రక్తి కట్టడంతో ఇవాళ్టి ఏపిసోడ్ మరింత ఇంట్రస్టింగ్ గా జరిగింది.
Gruhalakshmi Telugu Serial Today Episode: రాజ్యలక్ష్మీ, బసవయ్య, ప్రసూనాంబ ముగ్గురు కలిసి దివ్యతో పూజ చేయించడానికి తులసి మొక్క దగ్గరకు దివ్యను తీసుకెళ్తారు. రాజ్యలక్ష్మీ పూజకు అంత రెడీగా ఉందా అని బసవయ్యను అడుగుతుంది. అంతా రెడీగానే ఉందని బసవయ్య చెప్తాడు. అయితే తులసి చెట్టు ఎండి పోయి ఉంటుంది. ఎండిపోయిన తులసి మొక్కను చూడగానే
దివ్య: పుణ్యం కావాలనుకున్న వాళ్లు ఎండిపోయిన తులసి మొక్కకు పూజ చేయరు అత్తయ్య.
రాజ్యలక్ష్మీ: అవును ఆ సంగతీ నాకు తెలుసు. ఇప్పుడు దాని గురించి ఎందుకు?
దివ్య: తెలసి ఉండి ఎండిపోయిన తులసి మొక్కకు ఎందుకు పూజ చేయమంటున్నారు. మీ మనసులో ఏముంది?
రాజ్యలక్ష్మీ: ఎండిపోయిన తులసి మొక్కా అదెక్కడమ్మా?
దివ్య: అంత అమాయకంగా నటించకండత్తయ్యా.. ఇదేంటి? ఎంటలా ముఖముఖాలు చూసుకుంటున్నారు.
బసవయ్య: అదేనమ్మా మాకు సరిగ్గా కళ్లు కనిపించడం లేదా? నువ్వు పొరపాటు పడుతున్నావా? అర్థం కావడం లేదు.
ప్రసూనాంబ: నీకు అత్తగారంటే కోపం ఉండొచ్చు.. కానీ మరీ ఇంత పచ్చిగా నిందలేస్తే ఎలా అమ్మాయి.
అంటూ అందరూ కలిసి ఎండిన తులసి మొక్కను పచ్చటి తులసి మొక్క అంటూ దివ్యను పిచ్చిదాన్ని చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఇంతలో అక్కడికి విక్రమ్ వస్తాడు. వెంటనే బసవయ్య, ప్రసూనాంబ తులసి మొక్కను మార్చి ఎండిన మొక్క స్థానంలో పచ్చని తులసి మొక్కను పెడతారు. దీంతో విక్రమ్ కూడా దివ్యను తిట్టి అది పచ్చని తులసి మొక్కే అని చెప్పి వెళ్లిపోతాడు. విక్రమ్ వెళ్లగానే బసవయ్య మళ్లీ మొక్కను మారుస్తాడు.
దీంతో దివ్య కూడా కన్‌ఫ్యూజన్‌లో ఎండిన మొక్కకే పూజ చేసి లోపలికి వెళ్లి వాళ్ల తాతయ్యను అడుగుతుంది. తన వెనకాల ఉన్న తులసి మొక్క పచ్చగా ఉందా? లేదా ఎండిపోయిందా అని ఇంతలో ప్రసూనాంబ, బసవయ్య ఎండిన మొక్క స్థానంలో పచ్చని మొక్కను పెడతారు. దివ్య వాళ్ల తాతయ్య కూడా తిరిగి చూసి అది పచ్చని మొక్కే అని చెప్పి వెళ్లిపోతాడు. దివ్య అయోమయంగా చూస్తుండి పోతుంది. అనసూయ హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తులసి పై నుంచి వచ్చి..
తులసి: అత్తయ్య ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను ఆఫీసుకు వెళ్లాలి తప్పదు.
అనసూయ: వెళ్లమ్మ..
తులసి: అంటే మామయ్యా..
అనసూయ: ఇది ఏ ఒక్కరోజుతోనో వారంతోనో తీరిపోయే సమస్య కాదు. శాశ్వతంగా మనం మోయాల్సిన బరువు. కట్టుకున్న దాన్ని నాకు తప్పదు. నువ్వు కూడా నీ జీవితాన్ని ఎందుకిలా నాశనం చేసుకుంటావు అమ్మా..
తులసి: అలా అంటారేంటి అత్తయ్యా.. ఈ సమస్య నాది కూడా
అంటూ తులసి అనగానే మాకు చేతకానప్పుడు మాకు సాయం చేద్దువు కానీ అంటూ అనసూయ చెప్తుండగానే లోపలి నుంచి నంద వస్తాడు. అనసూయ నందను ఆఫీసుకే వెళ్తున్నావా అని అడుగుతుంది. అవునని నంద చెప్పడంతో తులసి ఏమొద్దని మీరు ఆఫీసుకు వస్తే నేను ప్రశాంతంగా పని చేసుకోలేనని మీరు ఆఫీసులో నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. నాకు సాయం చేయాలని ఉంటే మామయ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లండి అని చెప్తుంది. నం సరే అని చెప్పడంతో తులసి ఆఫీసుకు వెళ్తుంది.
దివ్య వంట చేసి, స్మెల్ చూస్తూ.. ‘‘ఇవాళ వంటకాలన్నీ చాలా రుచిగా ఉన్నట్లున్నాయి. విక్రమ్ అయితే నా వంట తిని ఫిదా అవ్వాల్సిందే’’ అనుకుంటూ విక్రమ్‌ను పిలవడానికి వెళ్తుంది. ఇంతలో బసవయ్య, ప్రసూనాంబ వంటల స్థానంలో పచ్చి కూరగాయలు మారుస్తారు. దివ్య వచ్చి మళ్లీ ఒకసారి వంటకాల వాసన చూద్దామని ఓపెన్ చేసి చూసి పచ్చి కూరగాయలు ఉండటంతో షాక్ అవుతుంది.
అందరూ తినడానికి వస్తుంటారు. వారిని డైనింగ్ టేబుల్ దగ్గరకు రాకుండా ఆపాలి అని హాల్లోకి దివ్య వెళ్లగానే మళ్లీ బసవయ్య, ప్రసూనాంబ కూరగాయల స్థానంలో డిషెష్ మారుస్తారు. దివ్యకు ఎదురుగా వచ్చిన విక్రమ్ త్వరగా వెళ్దామని ఆకలిగా ఉందని చెప్తాడు. దీంతో దివ్య వంటలన్నీ మాయమై పోయాయని వంటల స్థానంలో పచ్చి కూరగాయలు వచ్చాయని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
ఏమీ ఎరుగనట్లు బసవయ్యా, ప్రసూనాంబ వచ్చి వంటలు పచ్చి కూరగాయలుగా మారడం ఏంటి? అని అడుగుతారు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఘుమఘుమలాడే వంటకాలు ఉంటాయి. దీంతో అందరూ షాక్ అవుతారు. బసవయ్యా, ప్రసూనాంబ, రాజ్యలక్ష్మీ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.