Nindu Noorella Saavasam December 13 th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అంజు దెబ్బకి షాకైన ప్రిన్సిపల్, ఒంటరిగా ఉన్న అరుంధతి ఘోర చేతికి చిక్కుతుందా?
Nindu Noorella Saavasam Today Episode: మిస్సమ్మకి కనపడకూడదని ఒంటరిగా వెనక్కి వెళ్లి దాక్కుంటుంది అరుంధతి. అప్పుడే ఘోర ఆమెని చూస్తాడు దాంతో ఆమెని ఘోర బంధిస్తాడా అనే ఉత్కంఠత ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఎగ్జామ్ హాల్లో కూర్చున్న అంజుతో ఎండ్ బెల్ అయ్యేలోపు ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి అని వార్నింగ్ ఇస్తుంది ప్రిన్సిపల్.
ఎగ్జామ్ పేపర్ ని చూసిన అంజు ముఖం ఇబ్బందిగా పెట్టి కళ్ళు తేలేస్తుంది. అంజు పరిస్థితి అందరికీ అర్థమవుతుంది. ఆమె నిస్సహాయతకు అందరూ బాధపడతారు. ఆమె బాధ చూడలేక అమర్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు.
ఆనంద్: ఎగ్జామ్ టఫ్ గా ఉన్నట్టుంది, అంజు మొహం చూస్తే అర్థమయిపోతుంది అని అక్కడున్న వాళ్ళతో చెప్తాడు.. అక్కడ అందరూ అంజలిని ఎగ్జామ్ బాగా రాయమని ఎంకరేజ్ చేస్తారు.
మిస్సమ్మ : అంజలి నిస్సహాయత చూస్తే నాకు కూడా బాధగానే ఉంది.
రాథోడ్: అంజలి పాప ఎప్పుడూ ఇంతేనమ్మ చదివింది గుర్తుండదు. పాపం వాళ్ళమ్మ గారి కోసం రాయాలి అనుకుంటే రాయలేకపోతుంది అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మనోహరి : వీళ్ళిచ్చిన ఎలివేషన్ కి అక్కడ చూస్తున్న ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు. దానివాలకం చూస్తే ఎగ్జామ్ రాసినట్టు లేదు. నాకు ఆకలి వేస్తుంది అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాను అనుకుంటుంది.
రాథోడ్ కి దారిలో రామ్మూర్తి కనిపించి ఎగ్జామ్ స్టార్ట్ అయిందా అని అడుగుతాడు.
రాథోడ్: ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది కానీ ఎగ్జామ్ టఫ్ గా ఉన్నట్టుంది పాప మొహం చూస్తే తెలిసిపోతుంది. ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే అడ్మిషన్ ఇవ్వరు. ఆ భగవంతుడు నిర్ధయుడు. ముందు తల్లిని దూరం చేశాడు ఇప్పుడు తన అన్నదమ్ములకి దూరం చేస్తున్నాడు అని బాధపడతాడు.
ఎగ్జామ్ రాయటానికి ఇబ్బంది పడుతున్న అంజు బాధని చూడలేక దేవుడిని ప్రార్థించడానికి వెళ్తారు అమ్ము వాళ్లు. మా చెల్లెలుపైకి అల్లరి చేస్తుంది కానీ మనసు చాలా మంచిది. తను లేకుండా మేము ఉండలేము అంటుంది కానీ నిజానికి మేము లేకుండా తను ఉండలేదు. నిన్ను ఎప్పుడూ మేము ఏమీ కోరుకోలేదు మా చెల్లెలు ఎగ్జామ్ బాగా రాసేలాగా చెయ్యు అని వేడుకుంటారు పిల్లలు.
రామ్మూర్తి: అప్పుడే అక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు.
పిల్లలు: అంజుని ఎగ్జామ్ పాస్ అయ్యేలాగా చేయమని దేవుడిని కోరుకుంటున్నాము.
రామ్మూర్తి: నేను కూడా అంజలి పాప పాస్ అవ్వాలని గట్టిగా కోరుకుంటాను.
ఆనంద్: మేమంటే బ్లడ్ రిలేషన్ కాబట్టి ఆ దేవుడు మా కోరిక వింటాడు. తను మీకు నిజంగా మనవరాలు కాదు కదా మీ కోరిక వింటాడా..
రామ్మూర్తి : తను నా మనవరాలే, ఆ మాటకు వస్తే మీరందరూ నా మనవళ్లు మనవరాళ్లే. మీరందరూ నా కూతురు పిల్లలు అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. పిల్లల్ని విడదీయొద్దని, పాప ఎగ్జామ్ బాగా రాయాలని భగవంతుడిని కోరుకుంటాడు. మరోవైపు
ప్రిన్సిపల్: ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది ఎగ్జామ్ రాసేది ఏమైనా ఉందా అని వెటకారంగా అడుగుతుంది. ఈ పిల్ల రాసేది లేదు, ఏం లేదు. అనవసరంగా టైం వేస్ట్ నేను వెళ్తాను టైం అయిపోయిన తర్వాత ఆ పాప దగ్గర పేపర్ తీసుకొని పంపించేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.
అప్పుడే అంజుకి తన తండ్రి పెట్టుకున్న నమ్మకం తను తల్లికి ఇచ్చిన మాట అన్ని గుర్తు చేసుకొని ఎగ్జామ్ రాయడం ప్రారంభిస్తుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. అరుంధతి దేవుడికి థాంక్స్ చెప్పుకుంటుంది.
వెళ్ళిపోతున్న ప్రిన్సిపల్ ని పిలిచి అంజు ఎగ్జామ్ రాయటం చూపిస్తాడు సార్. ఎగ్జామ్ టకటక రాస్తున్న అంజుని చూసి షాక్ అవుతుంది ప్రిన్సిపల్.
ఆ తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేవరకు మిస్సమ్మ కంటికి కనిపించకూడదు అనుకుని అక్కడ నుంచి వెళ్లిపోయి చెట్టు వెనక దాక్కుకుంటుంది అరుంధతి. కానీ ఘోర అక్కడే ఉన్నట్లు గమనించదు.
ఘోర : ఒంటరిగా దొరికావు చనిపోయినా నువ్వు ఆ ఇంటికి మహారాణివే. ఆ ఇంట్లో ఉండగా నిన్ను బంధించలేను ఇదే సరైన సమయం అని బ్యాగ్ లోంచి గాజు బాటిల్ తీస్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ప్రెగ్నెంట్‌గా వచ్చిన విశాలాక్షి, షాక్‌లో నయని ఫ్యామిలీ!