Trinayani Serial Today December 13th Episode - 'త్రినయని' సీరియల్: ప్రెగ్నెంట్‌గా వచ్చిన విశాలాక్షి, షాక్‌లో నయని ఫ్యామిలీ!
Trinayani Today Episode విశాలాక్షిని గర్భవతిగా చూసిన నయని ఫ్యామిలీ షాకై ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Trinayani Serial Today Episode : ఇంట్లో వాళ్లందరూ తమ జాతకాలు తీసుకొచ్చి డమ్మక్కకు చూపిస్తుంటారు. ఇక నయని విశాల్‌లు కూడా అక్కడికి వస్తారు. ఏంటి ఇదంతా అని అడుగుతారు. ఇక సుమన అయితే విశాల్ బావగారిని తప్పించేందుకు అక్క, డమ్మక్క ఇలా చేశారు అంటుంది. ఇక విక్రాంత్ అయితే సుమన మీద సెటైర్లు వేస్తాడు. తాను చనిపోతాను అని తెలిస్తే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా సుమనకు దక్కనివ్వకుండా చేస్తాను అని అంటాడు. మరోవైపు గాయత్రీ పాప ఓ జాతకం పేపర్‌ను దగ్గరకు తీసుకొని ఆ జాతకానికే ఆపద అన్నట్లు హింట్ ఇస్తుంటుంది.
నయని: మీరు ఆగండి విక్రాంత్‌బాబు అందరి జాతకాలు చూసిన డమ్మక్క ఏం చెప్తుందో విందాం
డమ్మక్క: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రానున్న 48 గంటల్లో ఈ ఇంట్లో వాళ్లందరి జాతకాల్లో ప్రమాద సంకేతాలు సూచిస్తున్నాయి.
గాయత్రీ పాప చేతిలో ఉన్న జాతకం పేపర్‌పై పాప కుంకుమతో గీతలు గీస్తుంది. పేపర్ చినిగిపోతుంది అని పాప దగ్గర నుంచి హాసిని తీసుకుంటుంది. ఆ జాతకంపై ఉన్న కుంకుమ గీతలు చూసి షాకైన హాసిని చనిపోయేది మా అత్తయ్యే అని ఫన్నీగా చెప్తుంటుంది. దీంతో తిలోత్తమ హాసినిని తిడుతుంది.
హాసిని: గాయత్రీ పాన చేతిలో ఉన్న మీ జాతకంపై పాప చేతికి ఉన్న కుంకుమ అంటి యూ ఆకారంలో అంటుకుంది కావాలంటే చూడండి అత్తయ్య.
నయని: అంటే తిలోత్తమ అత్తయ్య అనే అర్థం
విశాల్: చిన్న పిల్ల చేతికి ఉన్న కుంకుమ అలా కనిపించింది అంతే
విక్రాంత్: చిన్న పిల్లలు దేవుడితో సమానం కదా బ్రో
డమ్మక్క: తిలోత్తమ అమ్మని కుంకుమే వెంటాడు తుంది.
ఎద్దులయ్య: అమ్మ దర్శనభాగ్యం కోసం అందరూ రావాలి. ముఖ్యంగా మాతలు వచ్చి చేతులు చాచాలి.. ఓం నమఃశివాయ
తిలోత్తమ: అబ్బా ఆ గంట ఊపడం ఆపి.. ఇంకా మా చెవిలో ఏం ఊదాలి అనుకున్నావో అది చెప్పు
ఎద్దులయ్య: మనందరం పిల్లలం కదా పెద్దమాత మనకోసం అమ్మ ప్రసాదం తెస్తుంది
పావనామూర్తి: ఎద్దులయ్య అమ్మా అంటే సోదరి విశాలాక్షి వస్తుందా
ఎద్దులయ్య: అవును అయ్యా
సుమన: అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చి తినిపోయేది కదా.. ఈసారి తను ఏదో ప్రసాదం తీసుకొచ్చి మనకు పుణ్యం కలుగుతుందనే భ్రమకు గురిచేస్తుంది
నయని: సుమన భగవంతుని ప్రసాదం తీసుకోవడం అంటే స్వర్గాన్నిఅందుకోవడమే చాలా మంచి నిరాశగా వెనుదిరిగిపోతారు. అలాంటిది విశాలాక్షి మనం ఉన్న చోటుకు పట్టుకొని వస్తుంటే మనం ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి
విక్రాంత్: పాపపు పనులు చేసే వారు అయిష్టంగానే మాట్లాడుతుంటారు లే వదినా
విశాల్: వస్తుంది విశాలాక్షి ఏనా
ఇంతలో విశాలాక్షి అక్కడికి వస్తుంది. పెళ్లి అయిపోయి పెద్ద పొట్టతో రావడంతో నయని కుటుంబ సభ్యులంతా షాక్ అయిపోతారు.
వల్లభ: నువ్వేంటి ఇలా వచ్చావు
విశాలాక్షి: ఇలా అంటే ఎలా
తిలోత్తమ: ఇలా అంటే కడుపు వేసుకొని వచ్చావని అర్థం
విశాలాక్షి: నీ కడుపులో ఆకలిగా ఉంటుంది అని నాకు పెట్టిన నైవేద్యం మీ కోసం తీసుకొచ్చాను.
సుమన: మేము అడిగింది ఏంటి నువ్వు చెప్తోంది ఏంటి.. అసలు గర్భవతిలా ఎందుకు వచ్చావు
విశాలాక్షి: పిల్లల కోసం వచ్చాను
పావనామూర్తి: నువ్వు తికమకగా మాట్లాడకు సోదరి
ఎద్దులయ్య: అమ్మ సరిగ్గానే చెప్పింది మీరు అర్థం చేసుకోవడం లేదు
విశాల్: అమ్మ విశాలాక్షి నువ్వు ఈ అవతారంలో వస్తే నిన్ను అందరూ ఆటపట్టిస్తారు కదా
విశాలాక్షి: బిడ్డలతో ఆడుకోవాలి అని అమ్మకు కోరికగా ఉంటుంది కదా నాన్న
విక్రాంత్: బ్రో బడిలోనో గుడిలోనో సాంసృతిక కార్యక్రమాలు జరిగిఉంటాయి. అక్కడ పాల్గొని నేరుగా ఇక్కడికే వచ్చేసినట్లుంది విశాలాక్షి
నయని: అవునా విశాలాక్షి అమ్మ పాత్ర వేశావా
విశాలాక్షి: ఓం నమఃశివాయ మా అన్న మాధవుడు ఆడించే జగన్నాటకంలో నటించేవారు మానవులు నేను ఈ ప్రసాదం మీకు ఇవ్వాలి అనే ఇలా వచ్చాను అమ్మా.. ఇది గరుడు ప్రసాదం.. వెంకన్న గుడిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కదా.. ధ్వజారోహనలో భాగంగా ధ్వజంపై గురుడ పటాన్ని ఎక్కించిన తర్వాత ధ్వజస్తంభం కింద ఉన్న గురుడ వాహనానికి అభిషేకం చేశాను.
ఎద్దులయ్య: అలా చేసిన తర్వాత ప్రసాదాన్ని గరుడ ప్రసాదం లేక గరుడ పిండం అని అంటారు
పావనాభార్య: పిండమా అయితే తినాలా వద్దా అయ్యా
పావనా: పిండాలు కాకులు తింటాయి కదా నువ్వు అలా చెప్తే ఎలా అయ్యా
విశాల్: మామయ్య లోకులే కాకులు కదా
తిలోత్తమ: ఆ పిల్ల మాటలు విని ఆ ప్రసాదం తినేస్తారా ఏంటి
నయని: లేదత్తయ్య వీళ్లు చెప్పాక నాకు మా తాతయ్య చెప్పిన మాట గుర్తొస్తుంది. అంటూ ఓ శ్లోకం చెప్తుంది.
విశాలాక్షి: నిజం అమ్మా.. ఇందులో అర్థం కాకపోవడానికి ఏంముంది ఏ స్త్రీ అయితే గరుడ పిండాన్ని ప్రసాదంగా తింటుందో తాను త్వరలో గర్భవతి అవుతుంది అని అర్థం.
తిలోత్తమ: ఆపుతారా అందరూ ఈ పిల్ల తల్లిలా వేషం వేసుకొని వచ్చి ప్రసాదాన్ని పిండం అని చెప్పి అందర్నీ నవ్వుల పాలు చేస్తుంటే మీరు సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారా
విశాలాక్షి: ఇది హాస్యం కాదు నిజం
సుమన: ఓహో నువ్వు గుడి దగ్గర గరుడ ప్రసాదాన్ని కాస్త తిన్నందుకేనా ఇలా గర్భవతిగా అడుగుపెట్టావ్
వల్లభ: అది బలే అడిగావ్ చిన్న మరదలా
విశాల్: అన్నయ్య చిన్న పిల్ల సరదాగా అలా వేషం కట్టినా కాసేపు వాళ్లతో సరదాగా గడిపితేనే వాళ్ల సంతోషంగా ఉంటారు. అంటే కానీ ఇలా వెటకారం చేయకూడదు
విశాలాక్షి: పర్లేదు నాన్న వాళ్లు అన్నదాంట్లో తప్పు లేదు.. అన్నట్లు గానే నేను కాస్త ప్రసాదం స్వీకరించి మిగతాది ఇక్కడికి తీసుకొచ్చాను
సుమన: నువ్వు తన్నది మాకు కుక్కడానికి వచ్చావా ఎంగిలి చేసింది మాకు ఇవ్వడానికి నీకు..
నయని: సుమన ఇక ఆపు తింటావా తినవా అదొక్కటి చెప్పు
సుమన: నేను తినను దాని పేరే గరుడ ప్రసాదం కదా.. నా బిడ్డ ఉలూచి పాము పిల్ల కదా రెండింటికీ పొంతన ఉండదు. నేను పొరపాటున తిన్నా సరే నా కూతురికి ఏమవుతుందాఅని భయంగా ఉంది
విశాలాక్షి: భయం కాదు అనుమానం.. తనతో ఎంత ఉంది అని కాదు తన సంతానం ఎంత ఉంది అనేది ముఖ్యం
తిలోత్తమ: నాకు అక్కర్లేదు కానీ ఇన్నేళ్లుగా లేని ధురందర ఆంటీ నెల తప్పుతుందా
సుమన: అలా అడగండి అత్తయ్య వీళ్ల పిచ్చికి ముక్కుతాడు వేసిన వాళ్లు అవుతారు
విశాలాక్షి: అక్కడ ఇక్కడ వార్తలు చూస్తూ ముక్కున వేళ్లు వేసుకునే మీరు నా మాటలకు అడ్డుపడాలి అనుకుంటున్నారు
విశాల్: ఇది పుణ్యం అనుకోండి తింటే ప్రసాదం కంటే ఫలితం
ఎద్దులయ్య: నమ్మకంతో తీసుకొని తినండి అమ్మా
విశాలాక్షి: సుమన గర్భాశయాన్ని కొనుక్కొని ఉలూచిని కన్నావు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ గరుడ ప్రసాదం స్వీకరించి ఇప్పటికైనా నీళ్లొసుకో
సుమన: నేను ఎలా కన్నానో నీలాంటి దానికి చెప్పిన వారికి బుద్ధిలేదు.. ఇంటి విషయాలు బయటివాళ్లకి ఎందుకు చెప్తారు. నా పరువు పోవాలి అనా
నయని: విశాలాక్షికి ఎవరూ చెప్పలేదు
విశాల్: కళ్లముందు కనపడుతుంటే తెలుసుకోలేరా..
వల్లభ: వాళ్లకి వీళ్లకి అడగడం ఎందుకు మీరే తినేయండి
హాసిని: నాకు మా ఆయనకి సఖ్యత లేకపోయినా విశాలాక్షి అమ్మవారిని స్మరించుకొని గరుడ ప్రసాదాన్ని తీసుకుంటాను అని హాసిని ప్రసాదం తింటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.