Meghasandesham Serial Today September 17th: ‘మేఘసందేశం’ సీరియల్: శోభ గదిలోకి వెళ్లిన భూమి – గగన్ కు పెళ్లిచూపులు అరెంజ్ చేసిన శారద
Meghasandesham Today Episode: ఇందు పెళ్లి సంగీత్ లో డాన్స్ చేయాలని అందుకోసం అందరికీ డాన్స్ నేర్పించేందుకు భూమిని పిలుస్తాడు శరత్‌చంద్ర దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Meghasandesham Serial Today September 17th: ‘మేఘసందేశం’ సీరియల్: శోభ గదిలోకి వెళ్లిన భూమి – గగన్ కు పెళ్లిచూపులు అరెంజ్ చేసిన శారద meghasandesham serial today episode September 17th written update Meghasandesham Serial Today September 17th: ‘మేఘసందేశం’ సీరియల్: శోభ గదిలోకి వెళ్లిన భూమి – గగన్ కు పెళ్లిచూపులు అరెంజ్ చేసిన శారద](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/17/39d44bf633bfbd9ea249746c4096a5ea1726551069891879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Meghasandesham Serial Today Episode: నువ్వు చచ్చైనా నీ బిడ్డ బతకాలని దాన్ని బయటకు విసిరేశావా? ఇప్పడది నా ఇల్లు నా వాళ్లు అంటూ నా దాకా వస్తే నా పరిస్థితి ఏంటి? మహారాణిలా బతకాలి అనుకున్న నా కూతురు పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఈ ఇంటి వారసురాలిగా నీ కూతరు అడుగుపెడితే మా ఇద్దరి పరిస్థితి ఏంటి? వారసురాలిగా ఆ భూమి మా అధికారాన్ని, అహాన్ని లాగేసుకుంటే మేమెలా బతకాలి అంటూ అపూర్వ శోభ ఫోటో ముందు నిలబడి మాట్లాడుతుంది. దీంతో భూమి యువరాణిలా వచ్చినట్టు నక్షత్ర పనిమనిషిలా వచ్చినట్టు కలగంటుంది. మంగలేమో ఇంట్లో పెద్ద పనిమనిషిలా వచ్చినట్టు కలగంటుంది. మరుసటి రోజు భూమి ఇంటికి వస్తుంటే అపూర్వ చూసి భయపడుతుంది.
అపూర్వ: అర్ధరాత్రి అమ్మా పగలేమో కూతురు సతాయించుకు తింటున్నారు. ( అని మనసులో అనుకుని ) ఏయ్ ఏంటో మళ్లీ ఎందుకు వస్తున్నావు. మా ఇంట్లో ఏం పని నీకు.
శరత్: నేనే రమ్మన్నాను.
అపూర్వ: అవునా మీరు రమ్మన్నారా? బావ. అదే ఏం పని మీద వచ్చావమ్మా అని అడుగుతున్నాను.
శరత్: పెళ్లికి సంగీత్ ఫంక్షన్ ఉంది కదా? అందరికీ డాన్స్ నేర్పించాలంటే ఎవరో ఒకర్ని పిలవాలి. మన భూమి చాలా బాగా డాన్స్ చేస్తుంది కాబట్టి. తననే నేర్పించడానికి రమ్మన్నాను.
చెర్రి మథర్: అంటే ఈ అమ్మాయి అందరికీ డాన్స్ నేర్పిస్తుందా? అన్నయ్యా..
అని అడగ్గానే శరత్ చంద్ర అవునంటాడు. దీంతో చెర్రి, చాలా హ్యాపీగా ఫీలవుతాడు. అపూర్వ మాత్రం తనకంటే ఎవరైనా పెద్ద డాన్స్ మాస్టర్ ను పిలిస్తే బాగుండు బావ అనగానే భూమి అయితే ఇంట్లో మనిషిలా నేర్పిస్తుంది అంటాడు శరత్. ఎవరెవరికి ఏ స్టెప్స్ నేర్పిస్తే బాగుంటాయో అవి నేర్పించమ్మా.. అని భూమికి ఫ్రీడమ్ ఇస్తాడు శరత్‌చంద్ర. దీంతో తనకు డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నాకు అమ్మ గది కావాలని అడుగుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలోనే భూమి అంటే నేను గురువునే నా తల్లిదండ్రులుగా బావిస్తున్నాను అని చెప్తుంది.
శరత్‌చంద్ర: తప్పేమీ లేదమ్మా గురువునే తల్లిలా బావిస్తున్నావంటే.. ఇక తల్లిదండ్రులను ఎంతలా గౌరవిస్తావో అర్థం అవుతుంది.
చెర్రి: నువ్వు ఎంత త్వరగా నేర్పిస్తావని అందరం వెయిటింగ్ ఇక్కడ.
నక్షత్ర: అంత తొందర ఎందుకు డాన్స్ నేను నేర్పిస్తానులే..
భూమి: నీకు నీ డాన్స్ మాత్రమే వచ్చు నాకు నా డాన్స్ తో పాటు నీ డాన్స్ కూడా వచ్చు. ఆంటీతో పాటు నిన్ను ఆడిస్తా.. చూస్తూ ఉండు.
శరత్: అమ్మాయి నేర్పిస్తా అంటుంది కాబట్టి అందరూ నేర్చుకోండి. ఇందు పెళ్లి రోజు సంగీత్ స్పెషల్ అట్రాక్షన్ కావాలి.
అని శరత్‌చంద్ర చెప్పగానే చెర్రి హ్యాపీగా ఫీలవుతాడు. నక్షత్ర కోపంగా చూస్తుంటుంది. మరోవైపు శాస్త్రీ, శారదకు ఫోన్ చేసి మేము ఆదివారం వస్తాము అని చెప్పాము కానీ ఇప్పుడే వచ్చేస్తున్నాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో శారద కంగారుపడుతుంది. పూరి వచ్చి ఎందుకు కంగారు పడుతున్నావు అని అడగ్గానే మీ అన్నయ్యను చూసుకోవడానికి పెళ్లి వారు ఈరోజే వస్తున్నారట. ఇప్పుడు మీ అన్నయ్యను ఆపేదెలా అని టెన్షన్ పడుతుంది. ఇంతలో గగన్ కిందకు వచ్చి వెళ్లిపోతుంటే శారద తనకు ఒంట్లో బాగాలేదని చెప్తూ గగన్ ను మాటల్లో పెడుతుంది. ఇంతలో పెళ్లి వాళ్లు వస్తారు. పూరి విషయం గగన్ చెప్తుంది. మరోవైపు భూమిని తీసుకుని శోభాచంద్ర రూంలోకి వెళ్తాడు శరత్. రూంలో ఉన్న శోభ ఫోటో, ఆమె వాడిన వస్తువులు చూసి ఎమోషనల్ గా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)